Begin typing your search above and press return to search.

మనవరాలు దువాతో తాతగారి ముచ్చట్లు!

బాలీవుడ్ స్టార్ క‌పుల్స్ దీపికా పదుకొనే- రణ్‌వీర్ సింగ్‌ల కుమార్తె దువా పదుకొనే సింగ్ పరిశ్రమలోనే కాదు. సోషల్ మీడియాలోనూ ఎంతో ఆకర్షణగా నిలుస్తోంది.

By:  Srikanth Kontham   |   16 Jun 2026 2:00 PM IST
మనవరాలు దువాతో తాతగారి ముచ్చట్లు!
X

బాలీవుడ్ స్టార్ క‌పుల్స్ దీపికా పదుకొనే- రణ్‌వీర్ సింగ్‌ల కుమార్తె దువా పదుకొనే సింగ్ పరిశ్రమలోనే కాదు. సోషల్ మీడియాలోనూ ఎంతో ఆకర్షణగా నిలుస్తోంది. ఇటీవల దీపికా తండ్రి మాజీ బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాష్ పదుకొనే ఓ ఇంటర్వ్యూలో మనవరాలి గురించి.. తాతగా తనకు కలిగిన అనుభూతుల గురించి ఎంతో ఆత్మీయంగా పంచుకు న్నారు. తాతయ్యలు, అమ్మమ్మలు మనవడు.. మనవరాలిపై ఎందుకంత అమితమైన ప్రేమను, ఆరాటాన్ని చూపి స్తారో ? తనకు అస్సలు అర్థమయ్యేది కాదని కానీ దువా జీవితంలోకి వచ్చాక ఆ మధురమైన భావోద్వేగం ఏంటో? తనకు పూర్తిగా అర్ద‌మ‌వుతుంద‌ని సంతోషం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా దీపికా పదుకొనే, రణ్‌వీర్ సింగ్‌లు కుమార్తెను పెంచుతున్న విధానాన్ని ప్రకాష్ పదుకొనే ఎంతగానో అభినందించారు. వారిద్దరూ బాధ్యత గల తల్లిదండ్రులుగా తమ బాధ్యతలను చక్కగా నిర్వహిస్తున్నారన్నారు. దీపికా తన సమయాన్ని ఎక్కువ భాగం పాప సంరక్షణ కోసమే కేటాయిస్తుంది. రణ్‌వీర్ సింగ్ కూడా షూటింగుల నుండి విరామం దొరికిన‌ప్పుడల్లా పనుల్లో ఎంతో సహాయం చేస్తుంటాడని తెలిపారు. అంతేకాదు పాప పెంపకంలో పదుకొనే - సింగ్ కుటుంబాలు నిరంతరం అండగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.

సెలబ్రిటీల పిల్లలకు సాధారణంగా మీడియా - పాపరాజీల తాకిడి చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే దువా బెంగళూరులోని తాతయ్య ఇంటికి వచ్చినప్పుడు సాధారణమైన పౌరురాలిగా లభించే రోజువారీ అనుభవాలను రుచి చూపించడానికి ప్రకాష్ పదుకొనే - ఆయన భార్య ఉజ్జల ఎంతో ప్రయత్నిస్తుంటారట. దువాను బెంగళూరు మెట్రో రైళ్లలో, ఆటో రిక్షాలలో తిప్పుతుంటారని ..సాయంత్రం వేళల్లో స్థానిక పార్కులకు కూడా తీసుకువెళ్తుంటామ‌ని ప్ర‌కాష్ తెలిపారు. మనవరాలు స్నేహపూర్వక స్వభావం కలిగిన పిల్ల అని.. చిన్న వయస్సు నుండే ప్రయాణాలు చేయడం వల్ల అందరితో సులభంగా కలిసిపోతుందని మురిసిపోయారు.

బెంగళూరులోని క్యాంప్ స్టేషన్ సమీపంలో ఇల్లు ఉండటంతో దువాకు అక్కడి నుండి వెళ్లే రైళ్లను చూడటం ఎంతో ఇష్టమని.. అలాగే పాడెల్ అనే ఆట పట్ల కూడా ఆమె ఆసక్తి చూపిస్తోందని తెలిపారు. ఇటీవ‌లే దీపికా ప‌దుకోణే రెండ‌వ‌సారి కూడా గ‌ర్బం దాల్చిన విష‌యాన్ని వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. వృత్తిపరమైన విషయాలకు వస్తే, దీపికా - రణ్‌వీర్ భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.

దీపికా పదుకొనే షారుఖ్ ఖాన్‌తో కలిసి `కింగ్` చిత్రంలోనూ అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో కలిసి అట్లీ దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న `రాకా` అనే భారీ పాన్-ఇండియా చిత్రంలోనూ న‌టిస్స‌తున్నారు. రణ్‌వీర్ సింగ్ ఇటీవల ఆదిత్య ధర్ దర్శకత్వంలో రిలీజ్ అయిన `ధురంధర్2` చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారు. ప్ర‌స్తుతం డాన్ 3 ప్రాజెక్ట్ వివాదంలో ర‌ణ‌వీర్ పేరు సంచ‌ల‌నంగా మారిన సంగ‌తి తెలిసిందే.