Begin typing your search above and press return to search.

ప‌రిణీతి పెళ్లి.. ఫోన్ కెమెరాల‌కు ముసుగు తొడుగుతార‌ట‌

ఇక మోస్ట్ అవైటెడ్ సెల‌బ్రిటీ వెడ్డింగ్ నుంచి ఎలాంటి లీక్‌లు జరగకుండా ఉండేందుకు ఫోన్ కెమెరాలను టేప్ వేయనున్నట్టు సమాచారం.

By:  Tupaki Desk   |   23 Sep 2023 4:10 AM GMT
ప‌రిణీతి పెళ్లి.. ఫోన్ కెమెరాల‌కు ముసుగు తొడుగుతార‌ట‌
X

పరిణీతి చోప్రా- రాఘవ్ చద్దా వివాహానికి భారీ సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ జంట సెప్టెంబర్ 22 శుక్రవారం ఉదయ్‌పూర్ చేరుకున్నారు. సెప్టెంబర్ 24 న వివాహం చేసుకోనున్నారు. ఈ జంట బస చేసిన లీలా ప్యాలెస్ హోటల్ వద్ద భద్రతను కట్టుదిట్టంగా ఏర్పాటు చేసారు. ప్ర‌ముఖ జాతీయ మీడియా క‌థ‌నం ప్రకారం...ఈ గ్రాండ్ వెడ్డింగ్ కోసం వేదిక వద్ద 100 మంది సెక్యూరిటీ గార్డులను మోహరించ‌నున్నారు. వివాహ వేదిక పిచోలా సరస్సు మధ్యలో నిర్మించినందున, భద్రతా సిబ్బంది ఐదు పడవలలో చుట్టూ ప‌హారా కాస్తార‌ట‌.

రాఘవ్ బారత్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయ నాయకుడు మేవారీ శైలిలో అలంకరించిన ప్ర‌త్యేక‌ పడవలో ఒక హోటల్ నుండి వివాహ వేదిక వరకు వెళ్తాడు కాబట్టి, ఈ హోటల్‌ల జెట్టీ (పడవ చేరే వరకు నిర్మించబడిన ప్లాట్‌ఫాం) వద్ద ప్రత్యేక భద్రతా సిబ్బందిని కూడా నియమించారు.

ఇదిలావుండగా వివాహ వేడుక‌ గోప్యత కోసం ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకున్నట్లు హోటల్ సన్నిహిత వర్గాలు కూడా తెలియజేశాయి. ఇందులో భాగంగా హోటల్ ఆవరణలోకి బయటి వ్యక్తులు ఎవరైనా వస్తే పూర్తిగా స్కాన్ చేస్తారు.

ఇది మాత్రమే కాదు.. సిబ్బందిని కూడా మూడు రోజుల పాటు హోటల్ నుండి బయటకు వెళ్లడానికి అనుమతించరు. ఇక మోస్ట్ అవైటెడ్ సెల‌బ్రిటీ వెడ్డింగ్ నుంచి ఎలాంటి లీక్‌లు జరగకుండా ఉండేందుకు ఫోన్ కెమెరాలను టేప్ వేయనున్నట్టు సమాచారం.

రాఘవ్ చద్దా - పరిణీతి చోప్రా ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఇప్ప‌టికే మొద‌ల‌య్యాయి. ఈ జంట ఇటీవల న్యూ ఢిల్లీలో సూఫీ నైట్ - అర్దాస్ ఈవెనింగ్ పార్టీని కూడా నిర్వహించింది. అలాగే ఈ స్పెష‌ల్ డే కోసం ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన‌ పాస్టెల్-రంగు లెహెంగాను ప‌రిణీతి ఎంచుకున్నట్లు క‌థ‌నాలొచ్చాయి. పరిణీతి- మనీష్ సుదీర్ఘ కాలం స్నేహితులు. మనీష్‌కి పారీ శైలి గురించి .. ఆమె పెళ్లికి ఏమి కావాలో బాగా తెలుసు. అందుకే తాను మనీష్ మల్హోత్రా వధువు అవుతానని ప‌రిణీతి ఎప్పుడూ స్పష్టంగా చెప్పేది.

అంద‌మైన జంట‌కు ఈ ఏడాది మే 13న న్యూఢిల్లీలోని కపుర్తలా హౌస్‌లో నిశ్చితార్థం అయింది. దీనికి ముందు ఇద్దరూ తమ రిలేష‌న్ షిప్ పై బహిరంగంగా చర్చించలేదు. అయితే ఆ ఇద్దరూ చాలా సంవత్సరాలుగా ఒకరికొకరు తెలుసు. వారు అనేక పార్టీ నైట్ ల‌లో కలిసి కనిపించారు. ఇద్దరూ కలిసి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చదువుకున్నారు.