Begin typing your search above and press return to search.

ఘాటు పోజుతో ప్ర‌గ్యా పేంప‌రింగ్!

మ‌రి సోష‌ల్ మీడియాలో నైనా యాక్టివ్ గా ఉందా? అంటే కొన్ని నెల‌లుగా ఆ ర‌కంగానూ అమ్మ‌డు క‌నిపించ‌లేదు.

By:  Tupaki Desk   |   9 Nov 2023 5:33 AM GMT
ఘాటు పోజుతో ప్ర‌గ్యా పేంప‌రింగ్!
X

'అఖండ' త‌ర్వాత ప్ర‌గ్యాజైశ్వాల్ మ‌ళ్లీ టాలీవుడ్ లో క‌నిపించ‌లేదు. 'స‌న్నాఫ్ ఇండియా' చిత్రంలో న‌టింటి చిన‌ప్ప‌టికీ ఆ సినిమా వైఫ‌ల్యంతో అమ్మ‌డి పేరు వినిపించ‌లేదు. ఆ త‌ర్వాత టాలీవుడ్ కి పూర్తిగా దూర‌మైం ది. ఏడాది కాలంలో అస‌లు అడ్ర‌స్ లేనే లేదు. దీంతో ప్ర‌గ్యా ఏం చేస్తుంది? అన్న చ‌ర్య ఎక్క‌డా రాలేదు. బాలీవుడ్ ..కోలీవుడ్ లో ఏవైనా సినిమాలు చేస్తుందా? అదీ లేదు. మ‌రి సోష‌ల్ మీడియాలోనైనా యాక్టివ్ గా ఉందా? అంటే కొన్ని నెల‌లుగా ఆ ర‌కంగానూ అమ్మ‌డు క‌నిపించ‌లేదు.


ఇలా ఎన్నో సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. కానీ వాటికి స‌మాధానాలు మాత్రం ప్ర‌గ్యా స‌హా ఎవ‌రి ద‌గ్గ‌ర లేవు. అవ‌కాశాలొస్తే ప్ర‌గ్యా ఏం చేస్తుందా? చెప్ప‌డానికి వీలుంటుంది. ఆమె కూడా ట‌చ్ లో ఉంటుం ది. కానీ ఛాన్సులే లేన‌ప్పుడు ఏం చేస్తుంది? ఇంటికి ప‌రిమిత‌మ‌వ్వ‌డం త‌ప్ప‌! తాజాగా అమ్మ‌డు చేస్తోన్న ప‌దే అలాగే ఉన్న‌ట్లుంది. మ‌రి ఏమ‌నుకుందో! ఏమోగానీ తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ఫోటోతో నెటి జ‌నుల ముందుకొచ్చేసింది.


ఇదిగో ఇక్క‌డిలే బ్లేజ‌ర్ దుస్తుల్లో వ‌లపు బాణాలు విసిరే కార్య‌క్ర‌మం పెట్టుకుంది. వైట్ క‌ల‌ర్ బ్లేజ‌ర్ లో అమ్మ‌డు అందంగా ముస్తాబైన ఫోటోతో చూప‌రుల‌ను ఆక‌ర్షిస్తుంది. యువ‌త‌ని ఆకర్షించే కిల్ల‌ర్ లుక్..సొగ‌సైన క్లీవేజ్ షోతో వావ్ అనిపిస్తుంది. నెక్ పై అమ్మ‌డు ఎంపిక చేసుకుని జ్యూవెల‌రీ డిజైన్ ఆక‌ట్టుకుంటుంది. హెయిర్ స్టైల్ సంథింగ్ స్పెష‌ల్ గా ఫోక‌స్ అవుతుంది. ప్రస్తుతం ఈ ఫోటో అంత‌ర్జాలంలో వైరల్ గా మారింది. చాలా రోజుల‌కు నెట్టింట ద‌ర్శ‌నం ఇవ్వ‌డంతో అభిమానులు పండ‌గ చేసుకుంటున్నారు.


ఇక కెరీర్ ప‌రంగా ఈ ర‌క‌మైన ప్ర‌య‌త్నాలు అవ‌కాశాలు తెస్తాయా? లేదా? అన్న‌ది చెప్ప‌లేని ప‌రిస్థితి. ఇప్ప‌టికే చేయాల్సిన అన్నిర‌కాల ప్ర‌య‌త్నాలు చేసింది. ఆ ర‌క‌మైన ప్ర‌య‌త్నాలే టాలీవుడ్ లో ఇంత‌కాలం అవ‌కాశాలు వ‌చ్చేలా చేసాయి. బాలీవుడ్ మాత్రం అమ్మ‌డిని పెద్ద‌గా ప‌ట్టించుకున్న‌ట్లు క‌నిపించ‌లేదు. కెరీర్ ఆరంభంలో చేసిన ఒక్క సినిమా మిన‌హా మ‌ళ్లీ ఛాన్స్ అందుకోలేదు.