Begin typing your search above and press return to search.

రెడ్ హాట్ లుక్: వాడిగా వేడిగా కొంటెగా ప్ర‌గ్య‌

రెడ్ హాట్ లుక్ తో మెస్మ‌రైజ్ చేసింది. ఈ లుక్ చూడ‌గానే.. వాడిగా వేడిగా కొంటెగా ప్ర‌గ్య లుక్ అదిరింది! అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   14 Oct 2023 4:40 AM GMT
రెడ్ హాట్ లుక్: వాడిగా వేడిగా కొంటెగా ప్ర‌గ్య‌
X

కంచె బ్యూటీ ప్ర‌గ్య జైశ్వాల్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఈ బ్యూటీ సోష‌ల్ మీడియాల్లో నిరంత‌రం త‌న అభిమానుల‌కు ట‌చ్ లో ఉంటోంది. ఎప్ప‌టిక‌ప్పుడు నిత్య‌నూత‌న‌మైన ఫోటోషూట్ల‌తో వీడియోల‌తో గుబులు రేపుతోంది. ప్ర‌ఖ్యాత కెల్విన్ క్లెయిన్ బ్రాండ్ ప్ర‌మోష‌న్ లోను ప్ర‌గ్య త‌ల‌మునక‌లుగా ఉంద‌ని త‌న ఇన్ స్టా ఫీడ్ చెబుతోంది. చాలాసార్లు సీకే బ్రాండ్ లోదుస్తుల్లో త‌ళుకుబెళుకులు ప్ర‌ద‌ర్శించిన పూజా తాజాగా రెడ్ హాట్ లుక్ తో మెస్మ‌రైజ్ చేసింది. ఈ లుక్ చూడ‌గానే.. వాడిగా వేడిగా కొంటెగా ప్ర‌గ్య లుక్ అదిరింది! అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ లుక్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతోంది.


ఆస‌క్తిక‌రంగా ప్ర‌గ్య ఏం చేసినా కెరీర్ ప‌రంగా పుంజుకోవ‌డంలో త‌డ‌బ‌డుతోంది. ఇప్పుడున్న ఠ‌ఫ్ కాంపిటీష‌న్ లో త‌న‌ని తాను కెరీర్ ప‌రంగా ఎలివేట్ చేసుకునే ప్ర‌య‌త్నం చేసినా త‌న ఎత్తుగ‌డ‌లు ఏవీ ఫ‌లించ‌డం లేదు. ఇంత‌కుముందు స‌ల్మాన్ భాయ్ స‌ర‌స‌న ఓ సినిమా, ఎన్బీకే స‌ర‌స‌న ఓ సినిమా చేసింది. ఇవేవీ త‌న‌కు కెరీర్ ప‌రంగా క‌లిసి రాలేదు. బాల‌య్య‌తో అఖండ విజ‌యం త‌ర్వాత ప్ర‌గ్య తెలుగు ప‌రిశ్ర‌మ‌లో బిజీ అవుతుంద‌ని భావించినా ఆశించిన‌ది జ‌ర‌గ‌లేదు.

అయినా నిరాశ చెంద‌క ప్ర‌గ్య ఎంతో పాజిటివ్ యాటిట్యూడ్ తో త‌న ప్ర‌య‌త్నాలు తాను చేస్తోంది. ఇంకా త‌న త‌దుప‌రి సినిమాని ప్ర‌క‌టించ‌లేదు. మోహ‌న్ బాబు స‌న్ ఆఫ్ ఇండియాలో న‌టించాక మ‌రో సినిమాని ప్ర‌క‌టించేందుకు చాలా స‌మ‌యం వేచి చూడాల్సి వ‌చ్చింది. త్వ‌ర‌లోనే ఒక పెద్ద ప్రాజెక్టుతో ప్ర‌గ్య తిరిగి లైమ్ లైట్ లోకి రావాల‌ని క‌ల‌లుగంటోంది. ఆ స‌మ‌యం ఆస‌న్న‌మ‌వుతుంద‌నే ఆశిద్దాం. ప్ర‌స్తుతానికి ఫ్యాన్స్ కి ప్ర‌గ్య రెడ్ హాట్ లుక్ స్పెష‌ల్ ట్రీట్ గా నిలుస్తుంద‌న‌డంలో సందేహం లేదు.