లండన్ సూర్యుడితో సమానంగా నేనిలా
మధ్యలో అప్పుడప్పుడు బాలయ్య అవకాశాలు ఇవ్వడంతో ఆ మాత్రం సినిమాలైనా చేయగలిగింది.
By: Tupaki Desk | 1 Dec 2023 12:44 PM ISTప్రగ్యాజైశ్వాల్ కెరీర్ జర్నీ నత్త నడకన సాగుతోన్న సంగతి తెలిసిందే. గతేడాది `సన్నాఫ్ ఇండియా`తో ప్రేక్షకుల ముందుకొచ్చిన అమ్మడు మళ్లీ ఇంత వరకూ కొత్త ప్రాజెక్ట్ షురూ చేసింది లేదు. టాలీవుడ్ కి మెరుపులా దూసుకొచ్చినా కాలక్రమంలో ఆ మెరుపులు కొనసాగించడంలో మాత్రం విఫలమైంది. మధ్యలో అప్పుడప్పుడు బాలయ్య అవకాశాలు ఇవ్వడంతో ఆ మాత్రం సినిమాలైనా చేయగలిగింది.
లేదంటే అమ్మడి జాబితాలో మినిమం నెంబర్ కూడా ఉండేది కాదేమో. ప్రస్తుతం అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్నా! రావడం లేదు. కొత్త భామల తాకిడి...వయసు ముదురుతోన్న వైనం వంటి సన్నివేశాలు ప్రగ్యాని వెనక్కి నెట్టేస్తున్నాయి. దీంతో కెరీర్ విషయంలో ఎటూ తేల్చుకోలేని డైలమా కనిపిస్తోంది. అయినా ఇన్ స్టాలో మాత్రం యాక్టివిటీ ఏమాత్రం తగ్గించలేదు.
ఎప్పటికప్పుడు కొత్త ఫోటోలతో కుర్రాళ్లని ఆకర్షిస్తూనే ఉంది. నవ నాయికలకు ఏమాత్రం తగ్గకుండా అందాల ఆరబోతలో మాత్రం ఎప్పటికప్పుడు తనదైన మార్క్ వేస్తోంది. తాజాగా మరో కొత్త స్నాప్ తో ఇన్ స్టాలోకి వచ్చేసింది. ఇదిగో ఇక్కడిలా ఒళ్లంతా కప్పేసుకుని కెమారాకిలా చిక్కింది. జీన్స్ ప్యాంట్...రెడ్ టీషర్ట్ ధరించి..దానిపై చలిని తట్టుకుని వేడిమిని అందించే నల్ల కోటు వేసుకుంది.
ఇది లండన్ షాట్. అవును లండన్ లో ఉదయాన్నే సూర్యుడు ఆకాశానుంచి ఎలా ఉదయిస్తాడో? ప్రగ్యాజైశ్వాల్ కూడా తొలి కిరణాలు తనమీదే పడేలా? అప్పుడే గదిలోంచి బయటకు వచ్చింది. ఈ విషయాన్ని ఇన్ స్టా లో రివీల్ చేసి..తొలి కిరాణాలు నావే అనిసింది. చాలా రేర్ గా చోటు చేసుకునే మూవ్ మెంట్ ఇది అంటూ మురిసిపోయింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.
