Begin typing your search above and press return to search.

ప్ర‌గ్య ఘాటు అందాల వ‌ల‌

ప్రగ్యా జైస్వాల్ ఉల్లాసంగా ఉత్సాహంగా ఫోటోల‌కు ఫోజులిస్తున్న వైనం యువ‌త‌రంలో గుబులు రేపుతోంది. ప్ర‌గ్య అన్ లిమిటెడ్ థైషోస్ హీటెక్కిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   5 Feb 2024 9:48 AM GMT
ప్ర‌గ్య ఘాటు అందాల వ‌ల‌
X

నేటిత‌రంలో సోష‌ల్ మీడియాల్లో స్పీడ్ చూపించే భామ‌ల్లో ప్ర‌గ్యా జైశ్వాల్ ఒక‌రు. ఈ బ్యూటీ ఇంత‌కుముందు ప్ర‌ఖ్యాత కెల్విన్ క్లెయిన్ ఇన్న‌ర్ దుస్తుల‌కు ప్ర‌చారక‌ర్త‌. ఇటీవ‌ల వ‌రుస‌గా ఇన్ స్టా వేదిక‌గా వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లు షేర్ చేస్తూ భారీగానే ఆర్జిస్తోంది. అయితే ప్ర‌గ్య సినీకెరీర్ మాత్రం అంతంత మాత్రంగానే కొన‌సాగుతోంది. ఎన్బీకే, స‌ల్మాన్ లాంటి పెద్ద స్టార్ల స‌ర‌స‌న అవ‌కాశాలొచ్చినా అవేవీ త‌న‌కు క‌లిసి రాలేదు.

తాజాగా ఈ బ్యూటీ బీచ్ వెకేష‌న్ నుంచి షేర్ చేసిన స్పెష‌ల్ ఫోటోషూట్ అంత‌ర్జాలాన్ని షేక్ చేస్తోంది. ఆస‌క్తిక‌రంగా ఈసారి ట్రిప్ లో త‌న గ్రేట్ ఫ్రెండ్ రకుల్ ప్రీత్, ఆమె ప్రియుడు జాకీ భగ్నాని క‌నిపించారు. వీళ్ల‌తో పాటు టాలీవుడ్ ఆల్ రౌండ‌ర్ మంచు లక్ష్మి, త‌న‌ కుమార్తె స‌హా అందాల క‌థానాయిక‌ సీరత్ కపూర్ కూడా ఉన్నారు. వీరంతా పడవలో షికార్ చేస్తున్నారు. స‌ముద్ర‌పు అందాల‌ను ఆస్వాధిస్తూనే టీమ్ చిల్లింగ్ గా ఫోటోల‌కు ఫోజులిచ్చింది.

హాలిడే ట్రిప్ కి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. వీటిలో ప్ర‌గ్య జైశ్వాల్ పొడుగు కాళ్ల సౌంద‌ర్యం ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు అంత‌ర్జాలాన్ని షేక్ చేస్తున్నాయి.

ప్రగ్యా జైస్వాల్ ఉల్లాసంగా ఉత్సాహంగా ఫోటోల‌కు ఫోజులిస్తున్న వైనం యువ‌త‌రంలో గుబులు రేపుతోంది. ప్ర‌గ్య అన్ లిమిటెడ్ థైషోస్ హీటెక్కిస్తున్నాయి. ప్ర‌గ్య ఘాటు అందాల వ‌ల‌కు చిక్కితే చేప‌పిల్ల‌లా గిల‌గిల‌లాడిపోవాల్సిందే అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

ప్రగ్యా 2014లో ద్విభాషా థ్రిల్లర్ చిత్రం విరాట్టుతో తొలిసారిగా నటించింది. కానీ 2015 పీరియడ్ డ్రామా కంచెలో కనిపించిన తర్వాత విజ‌యం అందుకుంది. ప్రగ్యా ఉత్తమ మహిళా డెబ్యూ సౌత్‌గా ఫిల్మ్‌ఫేర్ అవార్డును కూడా అందుకుంది. అటుపై తెలుగులో ఓం నమో వేంకటేశాయ, నక్షత్రం, అఖండ త‌దిత‌ర‌ చిత్రాలలో నటించింది. చివరిగా యాక్షన్ చిత్రం `సన్ ఆఫ్ ఇండియా`లో కనిపించింది. డైమండ్ రత్న బాబు రచన , దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ - 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై విష్ణు మంచు నిర్మించారు. ఈ చిత్రంలో మోహన్‌బాబు, మీనా, శ్రీకాంత్‌లు కీలక పాత్రలు పోషించారు. కానీ ఈ సినిమా కూడా ఫ్లాప్‌గా మిగ‌ల‌డం నిరాశ‌ప‌రిచింది.