Begin typing your search above and press return to search.

హార్ట్ స్ట్రోక్ ఇచ్చేలా ప్రగ్యా పరువాలు

గతంలో బికినీలో కూడా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చిన ఈ బ్యూటీ ఈసారి స్టైలిష్ పొట్టి డ్రెస్సులో మాత్రం అంతకుమించి అనేలా స్టన్ అయ్యేలా చేసిందని అంటున్నారు.

By:  Tupaki Desk   |   19 Sep 2023 5:53 AM GMT
హార్ట్ స్ట్రోక్ ఇచ్చేలా ప్రగ్యా పరువాలు
X

చేసింది తక్కువ సినిమాలైనా గ్లామరస్ బ్యూటీగా మంచి క్రేజ్ అందుకున్న హీరోయిన్స్ లలో ప్రగ్యా జైస్వాల్ ఒకరు. ఈ బ్యూటీ మొదట్లోనే నటిగా మంచి గుర్తింపును అయితే అందుకుంది. మోడల్ గా కెరియర్ స్టార్ట్ చేసిన అమ్మడు ఆ తర్వాత సినిమా ప్రపంచంలోకి చాలా తొందరగానే అడుగు పెట్టింది. ఇక ఆ రూట్లో మాత్రం ఆమెకు మంచి గుర్తింపు అయితే లభించింది.


కానీ మరో స్థాయికి వెళ్లే సినిమా అవకాశాలు మాత్రం రాలేదు. అయినప్పటికీ తన గ్లామర్ తో మాత్రం ఎప్పటికప్పుడు తన ఉనికిని చాటుకుంటూనే ఉంది. ఇక రీసెంట్గా అమ్మడు పోస్ట్ చేసిన ఫోటోలు చూస్తే కుర్రాళ్ళు గుండెలు పట్టుకోవాల్సిందే అనేలా కామెంట్స్ అయితే వస్తున్నాయి. గతంలో బికినీలో కూడా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చిన ఈ బ్యూటీ ఈసారి స్టైలిష్ పొట్టి డ్రెస్సులో మాత్రం అంతకుమించి అనేలా స్టన్ అయ్యేలా చేసిందని అంటున్నారు.

పెద్దగా మేకప్ లేకుండా అమ్మడు చిరునవ్వుతోనే తన గ్లామర్ కు మరింత ఆకర్షణను పెంచింది. ప్రగ్యా జైస్వాల్ కి మంచి అవకాశాలు రావడం లేదు. కానీ ఆమెను గ్లామర్ యాంగిల్ లో వెండితెరపై ప్రజెంట్ చేస్తే మంచి క్రేజ్ వచ్చే అవకాశం ఉంది అని ఆమె ఫాలోవర్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. ఇక ఈ బ్యూటీ సినిమా కెరియర్ విషయానికి వస్తే 2014లో తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది.

మొదట్లో తమిళ్ హిందీలో చకచకా రెండు సినిమాలు చేసింది. కానీ అవేమి ఎంతగా సక్సెస్ కాలేదు. ఇక తెలుగులో మిర్చి లాంటి కుర్రాడు అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుణ్ తేజ్ కంచె సినిమాతో ఆమెకు మొదటి సక్సెస్ అయితే లభించింది. ఆ సినిమాలో ఆమె చేసిన పాత్రకు పలు అవార్డులు కూడా దక్కాయి.

ఇక ఆ తరువాత గుంటూరు నక్షత్రం, జయ జానకి నాయక, ఆచారి అమెరికా యాత్ర, అఖండ సినిమాలు చేసింది. ముఖ్యంగా అఖండ సినిమా ఆమెకు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని ఇచ్చింది. అయితే గత ఏడాది సన్నాఫ్ ఇండియా మాత్రం ఆమెకు నిరాశను మిగిల్చింది. ఇక ప్రస్తుతం హిందీలోనే ఒక వెబ్ సిరీస్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.