Begin typing your search above and press return to search.

ఎంత రెచ్చిపోయినా అమ్మడికి ఆఫర్లు మాత్రం లేవు..!

మిర్చి లాంటి కుర్రాడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ప్రగ్యా జైశ్వాల్ అంతకుముందే తమిళంలో ఒక సినిమా హిందీలో ఒక సినిమా చేసింది

By:  Tupaki Desk   |   21 March 2024 8:02 AM GMT
ఎంత రెచ్చిపోయినా అమ్మడికి ఆఫర్లు మాత్రం లేవు..!
X

మిర్చి లాంటి కుర్రాడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ప్రగ్యా జైశ్వాల్ అంతకుముందే తమిళంలో ఒక సినిమా హిందీలో ఒక సినిమా చేసింది. అయితే తెలుగులో డైరెక్టర్ క్రిష్ దృష్టిలో పడిన అమ్మడు వరుణ్ తేజ్ తో చేసిన కంచె సినిమాలో ఫీమేల్ లీడ్ గా తీసుకున్నాడు. ఆ సినిమాతో అమ్మడికి మంచి క్రేజ్ ఏర్పడింది. అప్పటి నుంచి వరుస సినిమాలు చేస్తూ వచ్చింది. స్టార్ ఛాన్సులు అందుకోవడంలో విఫలమైన ప్రగ్యా చేసిన సినిమాలు కూడా నిరాశపరచడంతో కెరీర్ లో వెనుకపడింది.

తెలుగులో ఏడు ఎనిమిది సినిమాలు చేసిన ప్రగ్యా కొన్ని సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ కూడా చేసింది. నందమూరి నట సింహం బాలకృష్ణ తో కలిసి అఖండ సినిమాలో నటించింది అమ్మడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత అయినా ప్రగ్యా కి ఛాన్సులు వస్తాయనుకున్నా కూడా ఆ తర్వాత నిరాశ తప్పలేదు. మంచు మోహన్ బాబు చేసిన సన్ ఆఫ్ ఇండియాలో నటించినా లాభం లేకుండా పోయింది.

ఛాన్స్ ఇస్తే చాలు తన టాలెంట్ చూపిస్తా అని ఎదురుచూస్తున్న ప్రగ్యాకు ఒక్కటంటే ఒక్క ఆఫర్ రావట్లేదు. సినిమాల మీద ఎలాగు ఆశలు వదులుకున్న అమ్మడు ఫోటో షూట్స్ తో సత్తా చాటాలని చూస్తుంది. అందుకే తన ఇన్ స్టాగ్రాం మొత్తం తన ఫోటో షూట్స్ తో నింపేస్తుంది. హీరోయిన్స్ ఇన్ స్టా ఫోటో షూట్స్ కి విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. సినిమాల్లో చేయని గ్లామర్ ట్రీట్ ఫోటో షూట్స్ తో అందిస్తుంటారు.

ఈ క్రమంలో ప్రగ్యా జైశ్వాల్ కూడా తన గ్లామర్ లుక్స్ తో ఫాలోవర్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంది. ఫోటో షూట్స్ తో రెచ్చిపోతున్న ముద్దుగుమ్మల్లో ప్రగ్యా కూడా ఒకరిగా చెప్పుకోవచ్చు. అయితే ఇంత రెచ్చిపోతున్నా కూడా ఎవరు పిలిచి ఛాన్స్ ఇవ్వట్లేదు. ప్రగ్యా ని కావాలనే దూరం పెడుతున్నారా లేదా ఆమె ఒకటి రెండు అవకాశాలు వచ్చినా చేయట్లేదా అన్నది తెలియదు కానీ ఫోటో షూట్స్ తో పిచ్చెక్కిస్తున్న ఈ అమ్మడి అందాలను వెండితెర మీద చూడాలని ఆమె ఫాలోవర్స్ కోరుతున్నారు. మరి అమ్మడి కష్టాన్ని ఏ దర్శకుడు మొదట గుర్తించి ఛాన్స్ ఇస్తాడో చూడాలి. ఈసారి అవకాశం వస్తే మాత్రం రచ్చ రంబోలా అనిపించేందుకు ప్రగ్యా రెడీ అవుతుంది.