Begin typing your search above and press return to search.

బ్యాక్ లెస్ అందాలతో కనువిందు చేస్తోన్న ప్రగ్యా జైశ్వాల్

కమర్షియల్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని ఈ బ్యూటీ సొంతం చేసుకుంది

By:  Tupaki Desk   |   2 Aug 2023 4:05 AM GMT
బ్యాక్ లెస్ అందాలతో కనువిందు చేస్తోన్న ప్రగ్యా జైశ్వాల్
X

టాలీవుడ్ లో ప్రగ్యా జైశ్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేద . కమర్షియల్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని ఈ బ్యూటీ సొంతం చేసుకుంది. విరాట్టు అనే తమిళ్ చిత్రంతో హీరోయిన్ గా కెరియర్ స్టార్ట్ చేసింది. తరువాత టిట్లూ ఎంబీయే మూవీతో బాలీవుడ్ లో తన అదృష్టం పరీక్షించుకుంది. ఈ రెండు సినిమాలు ఫెయిల్ అయ్యాయి. మిర్చీలాంటి కుర్రాడు మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.


ఇక రెండు సినిమాని వరుణ్ తేజ్ కి జోడీగా క్రిష్ దర్శకత్వంలో కంచె చేసింది. ఈ సినిమా కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ కాకపోయిన మంచ్జి సినిమా అనే గుర్తింపు తెచ్చుకుంది. మూవీలో ప్రగ్యా జైశ్వాల్ పెర్ఫార్మెన్స్ కి చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు. తరువాత ఆమె చేసిన సినిమాలు ఏవీ కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేదు.

ఎక్కువగా ఆమె గ్లామర్ రోల్స్ లోనే తన నెక్స్ట్ సినిమాలలో కనిపిస్తూ వచ్చింది. చివరిగా బాలకృష్ణకి జోడీగా అఖండ చిత్రంలో ప్రగ్యా జైశ్వాల్ నటించింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన హీరోయిన్ గా ప్రగ్యాకి మాత్రం పెద్దగా మైలేజ్ ఇవ్వలేదని చెప్పాలి. ఇదిలా ఉంటే ప్రగ్యా జైశ్వాల్ సినిమాలు చేయకపోయిన సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ ని తన అందచందాలతో అలరిస్తూనే ఉంది.

రెగ్యులర్ గా ఇన్ స్టాగ్రామ్ లో ప్రగ్యా జైశ్వాల్ పెట్టె హాట్ ఫోటోలకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. లక్షల్లో ఆ ఫోటోలని వీక్షిస్తూ, లైక్ చేస్తారు. దీంతో ఈ బ్యూటీ కూడా సోషల్ మీడియాలో మరింత ఎక్కువ మందికి చేరువ అయ్యేందుకు హాట్ హాట్ అందాలని షోకేస్ చేస్తూ కావాల్సినంత వినోదం పంచుతుంది. ఈ ఫోటోలు విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయి.

తాజాగా మరోసారి రెడ్ కలర్ డ్రెస్ లో బ్యాక్ అందాలు చూపిస్తూ ప్రగ్యా జైశ్వాల్ చేసిన గ్లామర్ షో నెటిజన్లుని విపరీతంగా ఆకర్షిస్తూ ఉంది. టెంప్ట్ చేసే విధంగా కళ్ళతోనే రొమాంటిక్ గా విరహాగ్ని రాజేస్తోంది. ఈ ఫోటోలలో ప్రగ్యా జైశ్వాల్ అందం మరింతం రెట్టింపు అయినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.