Begin typing your search above and press return to search.

అద్దంలో చిక్కిన అందాల ప్ర‌గ్య‌

తాజాగా మ‌రోసారి ప్ర‌గ్య ఓ స్పెష‌ల్ ఫోటోషూట్ తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. మేక‌ప్ రూమ్ లో మేక‌ప్ సెష‌న్స్ లో ఉన్న ప్ర‌గ్య అలా అద్దంలో త‌న రూపాన్ని చూసుకుని మురిసిపోతోంది.

By:  Tupaki Desk   |   15 May 2025 4:48 PM
అద్దంలో చిక్కిన అందాల ప్ర‌గ్య‌
X

కంచె బ్యూటీ ప్ర‌గ్య జైశ్వాల్ ఇటీవ‌ల ముంబై ప‌రిశ్ర‌మ‌లో అవ‌కాశాల వేట సాగిస్తున్న‌ సంగ‌తి తెలిసిందే. స‌ల్మాన్ ఖాన్ లాంటి పెద్ద హీరో ఈ భామ‌కు అవ‌కాశం క‌ల్పించినా అదృష్టం క‌లిసి రాలేదు. ప్ర‌స్తుతం త‌న స్నేహితురాళ్లు మంచు ల‌క్ష్మి, ర‌కుల్ తో క‌లిసి త‌న కెరీర్ గేమ్ ఛేంజ‌ర్ ఛాన్స్ కోసం వేచి చూస్తోంది. ఇదే స‌మ‌యంలో వ‌రుస ఫోటోషూట్ల‌తో విరుచుకుప‌డుతూ అభిమానుల‌ను యంగేజ్ చేస్తోంది.

తాజాగా మ‌రోసారి ప్ర‌గ్య ఓ స్పెష‌ల్ ఫోటోషూట్ తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. మేక‌ప్ రూమ్ లో మేక‌ప్ సెష‌న్స్ లో ఉన్న ప్ర‌గ్య అలా అద్దంలో త‌న రూపాన్ని చూసుకుని మురిసిపోతోంది. ప‌క్క‌నే మేక‌ప్ ఆర్టిస్ట్ ఎన‌ర్జిటిగ్గా ఫోటోకు ఫోజులిచ్చాడు. ఈ ఫోటోలో ప్ర‌గ్య ప‌సుపు రంగు ఫ్రాకులో ఎంతో బ్యూటిఫుల్ గా క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం ఈ స్పెష‌ల్ ఫోటోగ్రాఫ్ ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా దూసుకెళుతోంది. అద్దంలో చిక్కిన అందాల భామ అంటూ అభిమానులు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

ప్ర‌గ్య ప్ర‌స్తుతం హిందీ చిత్ర‌సీమ‌లో ఔత్సాహిక ద‌ర్శ‌కులు వినిపించిన‌ క‌థ‌లు వింటోంద‌ని స‌మాచారం. కానీ ఇంకా అధికారికంగా ఏదీ ఫైన‌ల్ చేయ‌లేదు. త్వ‌ర‌లోనే త‌దుప‌రి సినిమాకి సంబంధించిన అప్ డేట్ చెబుతుంద‌ని అభిమానులు భావిస్తున్నారు.