ప్రగ్య దెబ్బకు నీలి సముద్రం షేకైంది
ఇప్పుడు ప్రగ్య జైశ్వాల్ అలాంటి ఒక అందమైన కాంబినేషన్ తో బోయ్స్ హృదయాలను కొల్లగొడుతోంది.
By: Tupaki Desk | 20 Jun 2025 1:46 PM ISTనీలి నీలి సముద్రం.. నీలి రంగు బికినీ అందాలు.. ఈ కాంబినేషన్ ని ఆస్వాధించని యూత్ ఉంటుందా? ఇప్పుడు ప్రగ్య జైశ్వాల్ అలాంటి ఒక అందమైన కాంబినేషన్ తో బోయ్స్ హృదయాలను కొల్లగొడుతోంది. బాలీలో తన స్నేహితురాళ్లు లక్ష్మీ మంచు, రకుల్ ప్రీత్ లతో కలిసి రచ్చరచ్చ చేస్తోంది ప్రగ్య.
తాజాగా ప్రగ్య జైశ్వాల్ సోలో బికినీ షూట్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది. కంచె బ్యూటీ బ్లూ బికినీ ట్రీట్ గురించి వర్ణించడంలో యూత్ బిజీగా ఉన్నారు. సహజంగానే ఫిట్ నెస్ ఫ్రీక్ అయిన ప్రగ్య టోన్డ్ బాడీని హత్తుకుపోయిన టూపీస్ వస్త్రాలలో హా* గా కనిపిస్తోంది. బికినీ షూట్ లో ఎక్కడా చిరునవ్వు చెరగదు.. కొంటెగా కవ్వించే ఆ కళ్లకు బ్లాక్ గాగుల్స్ మరో హైలైట్. డార్క్ నేవీ బ్లూ సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతుంటే, దాని మీదుగా ఉన్న నెట్ పై ప్రగ్య స్మైలిస్తూ కెమెరాలకు ఫోజులిచ్చింది. ప్రగ్య టోన్డ్ బికినీ లుక్ యూత్ హృదయాల్లో మత్తు చల్లుతోంది.
ఇది సెలబ్రిటీ ఫోటోషూట్ స్పాట్.. సముద్రం మీదుగా క్యాటమరాన్ పై రిలాక్స్ డ్ గా ప్రగ్య ఫోజులిస్తుంటే, కెమెరాలో ఫ్లాష్‌లు మెరుస్తున్నాయి.. ప్రశాంతమైన సముద్రం.. విశాలమైన ఆకాశం ఈ ఫోటోషూట్ ప్రత్యేకతను మరింత ఉత్కంఠభరితంగా మార్చాయి. ప్రస్తుతం ఈ స్పెషల్ ఫోటోషూట్ ఇంటర్నెట్ లో వేవ్స్ క్రియేట్ చేస్తోంది. ప్రగ్య ప్రస్తుతం అఖండ 2, టైసన్ నాయుడు అనే రెండు భారీ చిత్రాల్లో నటిస్తోంది. ఈ రెండూ తన కెరీర్ కి చాలా కీలకమైనవి. నటిగా నిరూపించుకుంటే, కెరీర్ స్పీడ్ ని పెంచుతాయని నమ్ముతోంది.
