Begin typing your search above and press return to search.

దేశీ నైట్స్.. లుక్స్ తో చంపేస్తున్న బాలయ్య బ్యూటీ!

ప్రముఖ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్. మెరూన్ రెడ్ కలర్ చీర కట్టి అందాలు ఆరబోస్తూ.. బాల్కనీలో నగర అందాలను ఆస్వాదిస్తూ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

By:  Madhu Reddy   |   2 April 2026 12:10 PM IST
దేశీ నైట్స్.. లుక్స్ తో చంపేస్తున్న బాలయ్య బ్యూటీ!
X

సమయం దొరికితే చాలు వెకేషన్స్ అంటూ ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్స్ అటు డే టైం లోనే కాకుండా ఇటు నైట్ టైమ్స్ లో కూడా నగర అందాలను చూస్తూ.. ఆస్వాదిస్తూ గ్లామర్ తో అభిమానులను కూడా అలరిస్తున్నారు. ఈ క్రమంలోనే బాల్కనీలో పౌర్ణమి వెన్నెలలో చల్లని గాలులకు మరింత హీట్ పుట్టించేలా అందంగా ముస్తాబయి అందరి మనసులు దోచుకుంటోంది ప్రముఖ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్. మెరూన్ రెడ్ కలర్ చీర కట్టి అందాలు ఆరబోస్తూ.. బాల్కనీలో నగర అందాలను ఆస్వాదిస్తూ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.




పైగా ఈ ఫోటోలకు దేశీ లుక్స్ అంటూ జోడించిన క్యాప్షన్ విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ మధ్యకాలంలో ఎక్కువగా గ్లామర్ వలకబోస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ప్రగ్యా జైస్వాల్ మరొకసారి మేడ మీద నుంచి అందాలు ఆరబోయడంతో అభిమానులు ఈమె అందానికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.. ప్రగ్యా జైస్వాల్ అందం చూసి అభిమానులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా కామెంట్ చేస్తూ ఆమెపై తమ ప్రేమను పంచుకుంటున్నారు. మొత్తానికైతే ప్రగ్యా జైస్వాల్ షేర్ చేసిన ఈ ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.




ప్రగ్యా జైస్వాల్ మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ లో జన్మించింది. పూణేలోని సింబయాసిస్ లా స్కూల్ లో చదివింది. అలాగే సింబయాసిస్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న రోజుల్లోనే వివిధ రకాల అందాల పోటీలలో పాల్గొని విజయవంతమైన మోడల్గా ఎదిగింది. కళా, సంస్కృతి రంగంలో ఈమె సాధించిన విజయానికి గానూ 2014 జనవరి 22న సింబయాసిస్ సాంస్కృతిక్ పురస్కారం కూడా లభించింది. 2008లో సెమినా మిస్ ఇండియా అందాల పోటీల్లో పాల్గొని మిస్ ఫ్రెష్ ఫేస్, మిస్ ఫ్రెండ్ ఆఫ్ ఎర్త్ టైటిల్స్ ను సొంతం చేసుకుంది . అంతేకాదు డాబర్ వాటిక , మిలీనియం హైపర్ మార్కెట్ ఫర్ దుబాయ్, రిలయన్స్ డిజిటల్ ఎఫ్బిబి వంటి ఎన్నో పాపులర్ బ్రాండ్స్ కి అంబాసిడర్ గా కూడా చేసింది.




అలా పాపులారిటీ సొంతం చేసుకున్న ప్రగ్యా జైస్వాల్ తొలిసారి 2014లో తెలుగు, తమిళ్ ద్విభాష చిత్రమైన డేగాలో అవకాశం అందుకుంది. ఆ తర్వాత టిట్టు ఎంబీఏ అనే హిందీ సినిమాతో బాలీవుడ్లోకి అడుగుపెట్టిన ఈమె 2015లో తెలుగులో వచ్చిన మిర్చి లాంటి కుర్రాడు సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోయినా ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కంచె సినిమాలో నటించింది. ఈ సినిమాతో మంచి పేరు కూడా సొంతం చేసుకుంది. నిజానికి క్రిష్ గతంలో తీసిన గబ్బర్ ఈజ్ బ్యాక్ అనే సినిమాలో పాత్ర కోసం ఆడిషన్ ఇచ్చింది. కానీ ఆ పాత్ర ఆమెకు లభించలేదు. అందుకే క్రిష్ తన తదుపరి చిత్రంలో ఈమెకు అవకాశం కల్పించారు. ఇక అఖండ, డాకు మహారాజ్ సినిమాలతో భారీ పాపులారిటీ అందుకున్న ఈమె.. ఇప్పుడు మళ్లీ స్టార్ హోదాను దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది.