Begin typing your search above and press return to search.

కండీష‌న్ల‌న్నీ అన్ కండీష‌న‌ల్ గా ఎత్తేసిందా!

సెల‌బ్రిటీ కుటుంబం నుంచి ఎంట్రీ ఇచ్చే స్టార్స్ కిడ్స్ కి ఫ్యామిలీ నుంచి అన్ని ర‌కాల స‌పోర్ట్ ఉంటుంది.

By:  Tupaki Desk   |   28 April 2024 7:16 PM GMT
కండీష‌న్ల‌న్నీ అన్ కండీష‌న‌ల్ గా ఎత్తేసిందా!
X

సెల‌బ్రిటీ కుటుంబం నుంచి ఎంట్రీ ఇచ్చే స్టార్స్ కిడ్స్ కి ఫ్యామిలీ నుంచి అన్ని ర‌కాల స‌పోర్ట్ ఉంటుంది. ఇండ‌స్ట్రీలో ఎలా ఉంటుంద‌న్న‌ది ముందుగానే అవ‌గాహ‌న ఉంటుంది. ఆ ప్ర‌కారం ఇన్ సైడ్ న‌డుచుకోవాల్సి ఉంటుంద‌ని గైడ్ చేస్తారు. స్టార్ కిడ్స్ విషయంలో పెద్దగా ఇబ్బందులు కూడా ఎదుర‌వ్వ‌వు. ఒక‌వేళ ఎదురైనా అర్దం చేసుకునే త‌ల్లిదండ్రులు ఉంటారు కాబ‌ట్టి పెద్ద స‌మస్య‌గానూ భావించ‌రు. అయితే ఔట్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీ నుంచి వ‌చ్చే భామ‌ల విష‌యంలో మాత్రం కొన్నిర‌కాల ఇబ్బందులైతే త‌ప్ప‌వు.


మోడ‌లింగ్ వ‌ర‌కూ ఒకే కానీ...సినిమాల్లోకి వెళ్తానంటే తొంద‌ర‌గా అంగీక‌రించే ప‌రిస్థితి ఉండ‌దు. అలా జ‌ర‌గాలంటే కుటుంబ స‌భ్యుల్ని ఒప్పించడం అన్న‌ది పెద్ద విష‌య‌మే. అమ్మ‌-నాన్న‌ల్ని ఒప్పించి మ్యాక‌ప్ వేసుకోవాలంటే కుమార్తులు చాలా విష‌యాల్లో ఆచితూచి వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంది. ముంబై నుంచి దిగుమ‌తి అయిన `పెద‌కాపు` బ్యూటీ ప్ర‌గ‌తి శ్రీ వాస్త‌వ సినిమాల్లోకి రావ‌డానికి కండీష‌న్ల‌తోనే ఎంట్రీ ఇచ్చింది. డిజైన‌ర్ దుస్తుల విష‌యంలో కొన్నిప‌రిమితులు విధించుకుంటాన‌ని ఓపెన్ గానే చెప్పింది. ఇంట్లో త‌ల్లిదండ్రుల‌కు ఇష్టం లేక‌పోయ‌నా! వాళ్ల‌ను ఒప్పించి కొన్నికండీష‌న్ల‌తో ఎంట్రీ ఇచ్చింది.


కానీ ఇప్పుడు కండీష‌న్లు అన్నీ అన్ కండీష‌న్ గా ఎత్తేసిన‌ట్లు క‌నిపిస్తుంది. తాజాగా అమ్మ‌డు నెట్టింట ఓ హాట్ ఫోటోని షేర్ చేసింది. స్విమ్ షూట్ లో ప్ర‌గ‌తి ఈత అనంత‌రం ఇలా సాయంసంధ్యా వేళ సేద తీరుతుంది. టాప్ టూ బాట‌మ్ అమ్మ‌డు స్కిన్ షో హైలైట్ అవుతుంది. త‌డిసిన అందాల్లో ప్ర‌గ‌తి బ్యూటీ ని మెచ్చ‌కుండా ఉండ‌లే క‌పోతున్నారు. త‌మ‌దైన శైలిలో కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ఇలా స్పీడ‌ప్ అవ్వ‌డం ప్ర‌గ‌తి కెరీర్ కి క‌లిసొచ్చింద‌నే చెప్పాలి.


నెట్టింట ఫాలోవ‌ర్ల సంఖ్య అంత‌కంత‌కు పెరుగుతుంది. పిండి కొద్ది రొట్టె అన్న‌ట్లు! ఎంత‌గా మెప్పించ‌గ‌ల్గితే అంత‌టి పాపులిరిటీ సొంత‌మే కదా. అందుకే ఈ ఛాన్స్...ప్రఖ్యాత చిత్రనిర్మాత ఆనంద్ ఎల్ రాయ్ కూడా అమ్మ‌డికి అవ‌కాశం క‌ల్పించారు. వెల్ క‌మ్ టూ మై వ‌రల్డ్ అంటూ బ్యాన‌ర్ లో ఛాన్స్ ఇచ్చారు. పెద‌కాపు త‌ర్వాత మ‌ళ్లీ తెలుగులో అవ‌కాశాలు రాలేదు. దీంతో బాలీవుడ్ లోనే ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ల‌క్కీగా అవ‌కాశాలు కూడా వ‌రిస్తున్నాయి.