Begin typing your search above and press return to search.

పవర్ లిఫ్టింగ్ లో మెడల్... సత్తా చాటిన సినీ నటి ప్రగతి!

అవును... తాజాగా బెంగళూరులో జరిగిన 28వ బెంచ్ ప్రెస్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ లో సినీనటి ప్రగతి సత్తా చాటింది

By:  Tupaki Desk   |   28 Nov 2023 3:24 PM GMT
పవర్ లిఫ్టింగ్ లో మెడల్... సత్తా చాటిన సినీ నటి ప్రగతి!
X

సినీనటి ప్రగతి గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. సినిమాల్లో డీసెంట్ క్యారెక్టర్స్‌ తో నటిగా మంచి పేరు సంపాదించుకున్న ఆమె... సోషల్ మీడియాలో రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటారు. ఇక ఫిట్ నెస్ కి సంబంధించిన ఎన్నో వీడియోలు ఆన్ లైన్ వేదికగా ఆమె పంచుకుంటారు. ఈ సమయంలో తాజాగా నేషనల్ లెవెల్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ లో సత్తా చాటింది.

అవును... తాజాగా బెంగళూరులో జరిగిన 28వ బెంచ్ ప్రెస్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ లో సినీనటి ప్రగతి సత్తా చాటింది. ఈ పోటీల్లో పాగ్లొన్న ప్రగతి.. మంచి ప్రతిభ కనబర్చింది. ఈ క్రమంలో ఎంతో మంది ప్రొఫెషనల్స్ ని దాటుకుని మూడో స్థానంలో నిలిచింది. దీంతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

ప్రస్తుతం 48 ఏళ్ల వయసుకు చేరువైన ప్రగతి.. జిం లో సుమారు 80 కేజీల బరువును సునాయసంగా ఎత్తి పక్కనపడేస్తున్నట్లు కనిపించిన ఎన్నో వీడియోలు ఉన్న సంగతి తెలిసిందే. సినిమాలో చాలా సాఫ్ట్‌ గా కనిపించే ఈమె.. రియల్‌ లైఫ్‌ లో ఇంత హార్డ్ కోర్ వెయిట్ లిఫ్టర్‌ గా ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది.

ఈ క్రమంలోనే బెంగళూరులోని ఇంజినీర్స్ అసోసియేషన్ ఆడిటోరియం వేదికగా జరిగిన 28వ బెంచ్ ప్రెస్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ లో ప్రొఫెషనల్ పవర్ లిఫ్టర్లతో పోటీ పడి ప్రగతి కాంస్య పతకం సాధించింది. దీంతో రియల్ ఛాంపియన్‌ అంటూ ఫ్యాన్స్‌ ఆమెకు ఆన్ లైన్ వేదికగా అభినందనలు తెలుపుతున్నారు.

కాగా... తమిళ సినిమాతో హీరోయిన్ గా వెండితెరపై అడుగు పెట్టిన ప్రగతి.. హీరోయిన్ గా సుమారు 10 సినిమాల్లో నటించింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలకు కొంతకాలం దూరంగా ఉన్న ఆమె... ఆ తర్వాత బుల్లితెరపైకి అడుగు పెట్టింది. ఈ క్రమంలో పలు సీరియల్స్ లో నటించి మెప్పించింది.

ఈ క్రమంలో... "బాబీ" సినిమాతో మళ్లీ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సంగతి అలా ఉంటే... కరోనా లాక్ డౌన్ సమయంలో ప్రగతి తనలోని కొత్త కోణాన్ని బయటకు తీసుకొచ్చింది. గతంలో చూడని వీడియోలను ప్రగతి అభిమానులతో పంచుకుంది.