Begin typing your search above and press return to search.

హీరోగా టాలీవుడ్ యాంకర్.. మళ్ళీ ఇన్నాళ్ళకు

నేచురల్ స్టార్ నాని ఆర్జేగా చేస్తూ మూవీలో హీరోగా మారి ప్రస్తుతం తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు

By:  Tupaki Desk   |   18 March 2024 5:36 AM GMT
హీరోగా టాలీవుడ్ యాంకర్.. మళ్ళీ ఇన్నాళ్ళకు
X

నేచురల్ స్టార్ నాని ఆర్జేగా చేస్తూ మూవీలో హీరోగా మారి ప్రస్తుతం తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. అలాగే తమిళంలో శివకార్తికేయన్ కూడా ఆర్జే నుంచి టెలివిజన్ యాంకర్ గా మారి తరువాత నటుడిగా మారి ఇప్పుడు సక్సెస్ ఫుల్ హీరోగా దూసుకుపోతున్నాడు. వీరి బాటలోనే ప్రదీప్ కూడా ఆర్జే స్థాయి నుంచి బుల్లితెరపై నెంబర్ వన్ యాంకర్ స్థాయికి ఎదిగాడు.

అన్ని ఛానల్స్ లో గేమ్ షోలు, డాన్స్ షోలు, ఈవెంట్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఫేమ్ అందుకున్నాడు. ఆర్జేగా కెరియర్ స్టార్ట్ చేసిన ప్రదీప్ తరువాత సినిమాలలో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ నటుడిగా మారాడు. నెక్స్ట్ యాంకర్ గా బుల్లితెరపై సక్సెస్ అయ్యాడు. నటుడిగా అప్పుడప్పుడు సిల్వర్ స్క్రీన్ పై మెరుస్తూ ఉన్న ప్రదీప్ కి హీరోగా బ్రేక్ ఇచ్చింది మాత్రం 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే మూవీ.

లవ్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమాతో హీరోగా మారి సక్సెస్ అందుకున్న కూడా ప్రదీప్ యాంకర్ గానే కొనసాగుతున్నాడు. ఆ మూవీ సక్సెస్ తర్వాత హీరోగా చాలా అవకాశాలు వచ్చిన సెలక్టివ్ గా తనకి సెట్ అయ్యే కథలు మాత్రమే చేయాలని ప్రదీప్ లాంగ్ గ్యాప్ తీసుకున్నారు. మరల మూడేళ్ళ తర్వాత ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయబోతున్నాడని తెలుస్తోంది.

ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ కూడా సైలెంట్ గా కంప్లీట్ చేసేసాడంట. త్వరలో ఈ సినిమా సందడి స్టార్ట్ కాబోతోందని తెలుస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ తో సినిమా గురించి రివీల్ చేసే ఛాన్స్ ఉంది. అలాగే సమ్మర్ కానుకగా రిలీజ్ చేయాలని భావిస్తున్నారంట. రిలీజ్ డేట్ ఎప్పుడనేది కూడా త్వరలో కన్ఫర్మ్ చేసే అవకాశం ఉందని టాక్. ప్రస్తుతం మూవీ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉందని సమాచారం.

బుల్లితెరపై కూడా ప్రదీప్ ఈ మధ్యలో గతంలో కనిపించినంత ఎక్కువగా హైలెట్ కావడం లేదు. అక్కడ కూడా రొటీన్ షోలు ఎక్కువ కావడంతో చాలా వరకు తగ్గించేశాడు. ఇక కొత్తగా ట్రై చేయాలని వెండితెరపై హీరోగా కూడా తనకంటూ బ్రాండ్ క్రియేట్ చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు. రాబోయే సినిమా కానీ హిట్ అయితే ప్రదీప్ కి మరిన్ని అవకాశాలు క్యూ కడతాయని చెప్పొచ్చు. అలాగే పెద్ద బ్యానర్స్ కూడా ప్రదీప్ మీద ప్రత్యేకంగా ఫోకస్ చేసే అవకాశం ఉందని టాలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తోన్న మాట.