కోలీవుడ్ నటుడి కోసం టాలీవుడ్ క్యూలోనా?
తనని తానే హీరోగా తీర్చిదిద్దు కున్నాడు. తొలి సినిమా `లవ్ టుడే`ని స్వీయా దర్శకత్వంలో తెరకెక్కించిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 5 July 2025 10:00 PM ISTతెలుగు సినిమాకు భాషతో సంబంధం లేదు. ఇతర భాషా నటుల్ని ప్రోత్సహించడంలో టాలీవుడ్ ఎప్పుడూ ముందుంటుంది. ప్రేక్షకులు కూడా భాషతో సంబంధం లేకుండా ఆదరిస్తుంటారు. అందుకే ఇతర భాషల నటులు టాలీవుడ్ లో పెద్ద స్టార్లు అవుతున్నారు. ఈ మధ్య కాలంలో ప్రదీప్ రంగనాధ్ కూడా అలా ఫేమస్ అయిన వాడే. `లవ్ టుడే` అనే చిన్న సినిమాతో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి పెద్ద సక్సెస్ అందుకున్నాడు. ఆ సినిమాతోనే కుర్రకారులో ఫాలోయింగ్ దక్కించుకున్నాడు.
అటుపై రిలీజ్ అయిన `డ్రాగన్` తో మరో సక్సస్ అందుకున్నాడు. రెండు కూడా తమిళ సినిమాలే. పోలికలు కాస్త ధనుష్ లా ఉండటంతో జూనియర్ ధనుష్ అనే ట్యాగ్ ని కూడా సొంతం చేసుకున్నాడు. ప్రదీప్ లో ఈ ఫాలోయింగ్ చూసిన మైత్రీ మూవీ మేకర్స్ మరో ఆలోచన లేకుండా అగ్రిమెంట్ చేసు కున్నారు. అదే `డ్యూడ్` అనే చిత్రం. ఈ సినిమా ఆన్ సెట్స్ లో ఉన్న సంగతి తెలిసిందే. అలాగే నయనతార భర్త విగ్నేష్ శివన్ కూడా ఇదే హీరోతో `ఎల్ ఐసీ` అనే సినిమా కూడా చేస్తున్నాడు.
దీంతో ఇతడి క్రేజ్ చూసి టాలీవుడ్ నుంచి మరింత మంది నిర్మాతలు ముందుకొస్తున్నారు .అతడికి అడ్వాన్సులు ఇచ్చి బు క్ చేసుకోవడానికి క్యూలో ఉన్నారుట. దర్శకుడి ఆప్షన్ కూడా అతడికే ఇచ్చే స్తున్నారు. తన సొంత కథతో వచ్చినా? తానే డైరెక్టర్ గా మారి చేసినా? అంతిమంగా తమకు కావాల్సింది లాభాలు ఒక్కటే గా భావించి నిర్మాతలంతా అతడి చుట్టూ తిరుగుతున్నారుట. ప్రదీప్ మంచి రైటర్ కం డైరెక్టర్ కూడా.
తనని తానే హీరోగా తీర్చిదిద్దు కున్నాడు. తొలి సినిమా `లవ్ టుడే`ని స్వీయా దర్శకత్వంలో తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇది యూత్ పుల్ లవ్ స్టోరీ. తర్వాత చేసిన `డ్రాగన్` లో యువత మెచ్చే అంశాలతో పాటు మంచి సందేశం కూడా అందించాడు. ప్రస్తుతం తానే స్వయంగా ఓ సైన్స్ పిక్షన్ కథ కూడా సిద్దం చేస్తున్నాడు. ఇలా ప్రదీప్ మల్టీ ట్యాలెంటెడ్ కావడంతో నిర్మాతలు కూడా అతడిపై మూవ్ అవుతున్నారు.