మైత్రీ సంస్థ.. 'లక్కీ' హీరోకు భారీ ఆఫర్ ఇచ్చిందా?
టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ మరో భారీ ప్రాజెక్ట్ కు సిద్ధమవుతున్నట్లు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
By: M Prashanth | 6 March 2026 9:05 AM ISTటాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ మరో భారీ ప్రాజెక్ట్ కు సిద్ధమవుతున్నట్లు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల తమకు లక్కీగా మారిన కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ తో మరో మూవీ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అంతే కాదు ఆ ప్రాజెక్ట్ కోసం ఆయనకు భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
నిజానికి ప్రదీప్ రంగనాథన్.. వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు సంపాదించకుంటున్నారు. ముఖ్యంగా లవ్ టుడే సినిమాతో యూత్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ఆయన, తర్వాత వచ్చిన డ్రాగన్ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. ఆ రెండు సినిమాలు కూడా మంచి స్పందన పొందడంతో పాటు బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్లు సాధించాయి.
దీంతో మైత్రి మూవీ మేకర్స్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా డ్యూడ్ చిత్రాన్ని నిర్మించి హిట్ అందుకుంది. ఇందులో మమిత బైజు హీరోయిన్ గా నటించగా, కీర్తిస్వరన్ అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహించారు. తమిళంతో పాటు తెలుగులో ఆ సినిమాను విడుదల చేయగా.. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ముఖ్యంగా యూత్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ దక్కిందని చెప్పాలి.
విమర్శకుల నుంచి ఎక్కువగా పాజిటివ్ రివ్యూలు వచ్చినప్పటికీ, కొన్ని చోట్ల మిక్స్డ్ స్పందన కూడా కనిపించింది. అయినప్పటికీ ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. డ్యూడ్ సినిమా నిర్మాణానికి మైత్రి మూవీ మేకర్స్ సుమారు రూ.26-27 కోట్ల వరకు బడ్జెట్ కేటాయించగా.. తొలి రోజే దాదాపు రూ.22 కోట్ల వరకు రికవరీ జరిగినట్లు అప్పట్లో టాక్ వచ్చింది.
దీంతో ఆ సినిమా మైత్రీ సంస్థకు ప్రొఫిటబుల్ ప్రాజెక్ట్ గా నిలిచిందని, ప్రదీప్ లక్కీ హీరోగా మారారని వార్తలు వచ్చాయి. డ్యూడ్ కు గాను ప్రదీప్ కు సుమారు రూ.13 కోట్ల పారితోషికం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ప్రదీప్ రంగనాథన్ తో మరో సినిమా చేయాలని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ప్లాన్ చేస్తుందని తెలుస్తుండగా.. కొత్త ప్రాజెక్ట్ కోసం రూ.50 కోట్ల భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
అంతేకాదు ఇప్పటికే అడ్వాన్స్ కూడా ఆయనకు ట్రాన్స్ఫర్ చేసినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అదే నిజమైతే.. హీరో పారితోషకం రూ.50 కోట్లు అయితే.. టోటల్ బడ్జెట్ రూ.100 కోట్లకు పైగా ఉండొచ్చు. అయితే ఆ ప్రాజెక్ట్ పై ఇప్పటివరకు మైత్రి మూవీ మేకర్స్ లేదా ప్రదీప్ రంగనాథన్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. అయినప్పటికీ ఆ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఇందులో నిజమెంత ఉందనేది వేచి చూడాలి.
