Begin typing your search above and press return to search.

ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ జోరుకి స్పీడ్ బ్రేక‌ర్స్‌!

అలాంటి కోవ‌కు చెందిన వ్య‌క్తే యువ సంచ‌ల‌నం ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్‌. `కోమాలి` మూవీతో డైరెక్ట‌ర్‌గా అరంగేట్రం చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు ప్ర‌దీప్‌.

By:  Ravindar Gorantla   |   11 April 2026 11:34 AM IST
ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ జోరుకి స్పీడ్ బ్రేక‌ర్స్‌!
X

యాక్సిడెంట‌ల్‌గా హీరోగా మారి బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపించిన వాళ్లు చాలా మందే ఉన్నారు. అయితే హీరో మెటీరియ‌లే కాద‌ని, నువ్వు హీరో ఏంట‌ని ప్రాజెక్ట్‌ల‌నే ప‌క్క‌న పెడితే ప‌ట్టుబ‌ట్టి మ‌రీ ఓకే చేయించుకుని హీరోగా అరంగేట్రం చేసి, తొలి సినిమాతో బాక్సాఫీస్‌ని షేక్ చేసిన వాళ్లు మాత్రం చాలా అరుదు. అలాంటి కోవ‌కు చెందిన వ్య‌క్తే యువ సంచ‌ల‌నం ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్‌. `కోమాలి` మూవీతో డైరెక్ట‌ర్‌గా అరంగేట్రం చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు ప్ర‌దీప్‌.

ఫ‌స్ట్ మూవీతోనే విభిన్న‌మై స్టోరీని ఎంచుకుని అందులో చెన్నై వ‌ర‌ద‌ల‌ని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చూపించి ఆక‌ట్టుకున్నాడు. ఫ‌స్ట్ మూవీతోనే రూ.50 కోట్ల క్ల‌బ్‌లో చేరిన ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ హీరోగా అరంగేట్రం చేస‌ని `ల‌వ్ టుడే`తో బ్లాక్ బ‌స్ట‌ర్ ని ద‌క్కించుకుని అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. హీరోగా, డైరెక్ట‌ర్‌గా ఈ సినిమాతో ఏకంగా వంద కోట్ల క్ల‌బ్‌లో చేరి ట్రేడ్ వ‌ర్గాల‌నే విస్మ‌యానికి గురి చేశాడు. కేవ‌లం రూ.5 కోట్ల‌తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద రూ.105 కోట్లు రాబ‌ట్టి అంద‌రిని షాక్‌కు గురి చేసింది.

దీంతో ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్‌కు హీరోగా వ‌రుస ఆఫ‌ర్లు త‌లుపుత‌ట్టాయి. చిన్న బ‌డ్జెట్‌ల‌తో భారీ లాభాల్ని తెచ్చిపెడుతుండంతో ప్ర‌తీప్ కోలీవుడ్‌, టాలీవుడ్‌లో ప్రొడ్యూస‌ర్ల‌కు హాట్ కేక్‌గా మారిపోయాడు. దీంతో మ‌లి ప్ర‌య‌త్నంగా `ది రిట‌ర్న్ ఆఫ్ ది డ్రాగ‌న్‌` మూవీని ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ రూ.37 కోట్ల‌తో నిర్మించింది. త‌మిళంతో పాటు తెలుగులోనూ భారీ స్థాయిలో రిలీజ్ చేసింది. `ల‌వ్ టుడే` బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచి మంచి క్రేజ్‌ని సొంతం చేసుకోవ‌డంతో `ది రిట‌ర్న్ ఆఫ్ ది డ్రాగ‌న్‌`పై అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

అందుకు త‌గ్గ‌ట్టే సినిమా ఉండ‌టంతో వ‌ర‌ల్డ్ వైడ్‌గా బాక్సాఫీస్ వ‌ద్ద ఈ మూవీ ఏకంగా రూ.150 కోట్లు రాబ‌ట్టి ప్ర‌దీప్ క్రేజ్‌ని మ‌రింత‌గా పెంచేసింది. దీంతో తెలుగు మేక‌ర్స్ మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు రంగంలోకి దిగి ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్‌తో ఓ మూవీ చేశారు. అదే `డ్యూడ్‌`. ప్రేమ‌లు ఫేమ్ మ‌మితా బైజు హీరోయిన్‌గా న‌టించిన ఈ మూవీ రెండు భాష‌ల్లోనూ యూత్‌ని విశేషంగా ఆక‌ట్టుకుని బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా అనిపించుకుంది. ఈ సినిమా కూడా రూ.114 కోట్లు..అంటే వంద కోట్ల క్ల‌బ్‌లో చేర‌డంతో ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ వంద కోట్ల క్ల‌బ్‌లో హ్యాట్రిక్ హిట్‌ని సొంతం చేసుకున్నాడు.

ఇదే జోష్‌తో ప్ర‌దీప్‌ రంగ‌నాథ‌న్ చేసిన లేటెస్ట్ మూవీ `ఎల్ఐకె`. కృతిశెట్టి హీరోయిన్‌. విఘ్నేష్ శివ‌న్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా 2024 నేప‌థ్యంలో ఫ్యూచ‌రిస్టిక్ ఫిల్మ్‌గా రూపొందింది. టీజ‌ర్‌, ట్రైల‌ర్‌ల‌లో కొత్త త‌ర‌హా సినిమాగా బ‌జ్‌ని క్రియేట్ చేసిన ఈ సినిమా ప్రేక్ష‌కుల్ని మాత్రం ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకోలేక‌పోయింది. రొమాంటిక్ ల‌వ్‌స్టోరీగా మంచి విజ‌యాన్ని సాధిస్తుంద‌ని భావిస్తే యావ‌రేజ్ ఫిల్మ్‌గా నిలిచి షాక్ ఇచ్చింది. ఈ సినిమాతో ప్ర‌తీప్ రంగ‌నాథ‌న్ డ‌బుల్ హ్యాట్రిక్‌కు స్పీడ్ బ్రేక‌ర్ ప‌డింద‌నే కామెంట్‌లు వినిపిస్తున్నాయి. రూ.95 కోట్ల బ‌డ్జెట్‌తో చేసిన ఆ సినిమా పెట్టిన బ‌డ్జెట్‌ని రాబ‌డుతుందా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్నార్థ‌కంగా మారింది.