Begin typing your search above and press return to search.

ప్రదీప్ రంగనాథన్ 'డ్యూడ్'.. పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే?

భారీ అంచనాల మధ్య డ్యూడ్ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమాపై పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే?

By:  M Prashanth   |   17 Oct 2025 2:40 PM IST
ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్.. పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే?
X

కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. ‘ల‌వ్ టుడే, డ్రాగన్ మూవీలో తెలుగు ఆడియన్స్ కు బాగా చేరువైన ఆయన.. ఇప్పుడు డ్యూడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సినిమాలో ప్రేమలు బ్యూటీ మమితా బైజు, డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టిలు హీరోయిన్లుగా నటించగా.. కీర్తిశ్వరన్ దర్శకత్వం వహించారు.

శరత్ కుమార్, హ్రిదు హరూన్, డ్రావిడ్ సెల్వం, సత్య, రోహిణి, ఐశ్వర్య శర్మ సహా పలువురు నటీనటులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఆ సినిమాను టాలీవుడ్ ప్రముఖ మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌ పై నవీన్ యెర్నెనీ, వై రవిశంకర్‌ నిర్మించారు. భారీ అంచనాల మధ్య డ్యూడ్ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమాపై పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే?

ముందుగా సినిమాను చూసిన వారంతా హీరో ప్రదీప్ రంగనాథన్ నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అదరగొట్టేశారని అంటున్నారు. అవుట్ స్టాండింగ్ పర్ఫామెన్స్ ఇచ్చారని కొనియాడుతున్నారు. మరోసారి తన టాలెంట్ బయటపెట్టారని చెబుతున్నారు. మమితా బైజు యాక్టింగ్ కూడా బాగుందని అంటున్నారు. శరత్ కుమార్ తన పాత్రలో ఒదిగిపోయారని కామెంట్లు పెడుతున్నారు.

సినిమాలో క్యాస్టింగ్ అంతా న్యాయం చేశారని చెబుతున్నారు. అయితే క్లాసిక్ కన్యాదానం మూవీ జెన్ జెడ్ వెర్షన్ డ్యూడ్ అంటూ కొందరు పోల్చుతున్నారు. ఫస్టాఫ్ అంతా బాగుందని అంటున్నారు. కానీ సెకండాఫ్ అనుకున్న రేంజ్ లో లేదని చెబుతున్నారు. స్పీడ్ తగ్గిందని.. అక్కడే అసలు లోపం ఉందని కామెంట్లు పెడుతున్నారు. ఫస్టాఫ్ మాత్రం ఆకర్షణీయంగా, యువతకు ఆకట్టుకునేలా ఉందని అనేక మంది రివ్యూస్ ఇస్తున్నారు.

డ్యూడ్ మూవీకి గాను దర్శకుడు కీర్తిశ్వరన్ కామెడీని హ్యాండిల్ చేసిన విధానం బాగుందని, కానీ హీరో రోల్ ను డిజైన్ చేసినట్లు హీరోయిన్ల పాత్రను క్రియేట్ చేయేలేదని రివ్యూ ఇస్తున్నారు. కొన్ని కీలక సన్నివేశాల్లో ఆసక్తికరమైన కథనాన్ని రాసుకోవడంలో ఆయన ఫెయిల్ అయ్యారని అంటున్నారు. సెకండాఫ్ స్క్రీన్ ప్లేను ఇంకా బలంగా రాసుంటే బాగుండేదని చెబుతున్నారు.

అదే సమయంలో సినిమాలో అక్కడక్కడ కొన్ని సీన్స్ ను ఇంకా కట్ చేయాల్సి ఉందని, ఎడిటింగ్ ఇంకా బాగా చేసి ఉండాల్సిందని కామెంట్లు పెడుతున్నారు. అయితే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయిందని, సాయి అభ్యాంకర్ అందించిన పాటలు బాగున్నాయని అంటున్నారు. చాలా సన్నివేశాలు బ్యూటిఫుల్ గా నికేత్ బొమ్మి చిత్రీకరించినట్లు చెబుతున్నారు. అలా సినిమాపై రకరకాలుగా రివ్యూస్ ఇస్తున్నారు.