L.I.K ప్రదీప్ రంగనాధ్.. మరో డిఫరెంట్ కథతో..!
ఈ సినిమాలో ఎస్.జె సూర్య ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నట్టు తెలుస్తుంది. సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
By: Tupaki Desk | 13 March 2025 6:04 PMకోలీవుడ్ యువ హీరోల్లో ప్రదీప్ రంగనాథ్ తన సినిమాలతో అదరగొడుతున్నాడు. అంతకుముందు డైరెక్టర్ గా సత్తా చాటిన అతను లవ్ టుడేతో హీరోగా మారి సూపర్ హిట్ కొట్టాడు. లవ్ టుడే సినిమాను యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దిన ప్రదీప్ రంగనాథ్ ఆ సినిమాలో హీరోగా అటిస్తూ డైరెక్ట్ చేసి అదరగొట్టాడు. ఐతే ఆ సినిమా తర్వాత ఈమధ్యనే డ్రాగన్ అంటూ మరో సూపర్ హిట్ అందుకున్నాడు ప్రదీప్ రంగనాథ్.
అశ్వత్ మారిముత్తు డైరెక్షన్ లో తెరకెక్కిన డ్రాగన్ సినిమా తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా సూపర్ హిట్ అందుకుంది. లవ్ టుడే, డ్రాగన్ రెండు సినిమాలతో తెలుగు ఆడియన్స్ కు దగ్గరయ్యాడు ప్రదీప్ రంగనాథ్. అంతేకాదు అతని సినిమాలంటే చాలు యూత్ ఆడియన్స్ ని పక్కా ఎంటర్టైన్ చేస్తాయని ఫిక్స్ అయ్యారు. ఐతే ప్రదీప్ రంగనాథ్ నెక్స్ట్ సినిమా L.I.K సినిమా చేస్తున్నాడు. లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అనే టైటిల్ తో ఇది వస్తుంది.
ఈ సినిమాను విఘ్నేష్ శివన్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా కథ కూడా డిఫరెంట్ గా ఉంటుందని టాక్. ప్రదీప్ రంగనాథ్ మరో యూత్ ఫుల్ కథతో వస్తున్నాడని తెలుస్తుంది. లీక్ అయిన దాని బట్టి చూస్తే ఎల్.ఐ.కె సినిమా తండ్రి కొడులు ఇద్దరు కూడా ఒకే అమ్మాయిలో ప్రేమలో పడతారట. వినడానికి కాస్త విచిత్రంగా ఉన్నా ఈ కథతోనే ఎల్.ఐ.కె సినిమా వస్తుందని తెలుస్తుంది. ఈ కథనే విఘ్నేష్ శివన్ చాలా ఎంటర్టైనింగ్ గా తెరకెక్కుస్తున్నట్టు తెలుస్తుంది.
ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ప్రదీప్ రంగనాథన్ సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు మంచి వెయిట్ ఉంటుంది. సో L.I.K సినిమాతో కృతి శెట్టికి కూడా మంచి క్రేజ్ ఏర్పడే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. ఈ సినిమాలో ఎస్.జె సూర్య ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నట్టు తెలుస్తుంది. సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
L.I.K సినిమా కూడా హిట్ పడితే మాత్రం ప్రదీప్ రంగనాథ్ ని ఆపడం ఎవరి వల్లా కాదని చెప్పొచ్చు. తెలుగులో కూడా ప్రదీప్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడుతుంది. అంతేకాదు మైత్రి మూవీ మేకర్స్ ప్రదీప్ తో ఒక సినిమా చేసే ప్లానింగ్ లో ఉన్నారని తెలుస్తుంది. ఇప్పటికే కథా చర్చలు పూర్తైన ఈ సినిమా గురించి అఫీషియల్ అప్డేట్ త్వరలో బయటకు రాబోతుంది.