వారిచ్చిన సపోర్ట్ చాలా పెద్దది
30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాతో హీరోగా మారిన ప్రదీప్ మాచిరాజు, తన రెండో సినిమా కోసం చాలానే గ్యాప్ తీసుకున్నాడు.
By: Tupaki Desk | 10 April 2025 10:53 PM IST30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాతో హీరోగా మారిన ప్రదీప్ మాచిరాజు, తన రెండో సినిమా కోసం చాలానే గ్యాప్ తీసుకున్నాడు. తనకు సూటయ్యే కథ వచ్చే వరకు వెయిట్ చేసి మరీ ప్రదీప్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాను సెలెక్ట్ చేసుకున్నాడు. దాని కోసం ప్రదీప్ చాలానే జాగ్రత్తలు తీసుకున్నాడు. ఆల్రెడీ ఈ సినిమా నుంచి రిలీజైన పాటలు, ట్రైలర్ కు ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
మొత్తానికి తను చేసిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయిని ఆడియన్స్ లోకి తీసుకెళ్లి సినిమాపై మంచి హైప్ ను క్రియేట్ చేయగలిగాడు ప్రదీప్. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రదీప్ మీడియాతో మాట్లాడుతూ పలు ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. ఈ సినిమాలో అందరికీ నచ్చే కామెడీ ఉంటుందని, అది ఆడియన్స్ ను తప్పకుండా మెప్పిస్తుందని ప్రదీప్ చెప్పాడు.
డైరెక్టర్లు నితిన్- భరత్ కు తన బాడీ లాంగ్వేజ్ చాలా బాగా తెలుసని, కథలోని కామెడీని తనతో ఎలా చేయించాలనే అంశంపై డైరెక్టర్లు చాలా జాగ్రత్తలు తీసుకున్నారని, సినిమాలోని ఎంటర్టైనింగ్ స్టోరీ ప్రతీ ఒక్క ఆడియన్‌ను ఎంతగానో ఆకట్టుకుంటుందని ప్రదీప్ చెప్పాడు. తమ సినిమాకు మహేష్ బాబు, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలు చేసిన సపోర్ట్ ఎంతో విలువైందని కూడా ప్రదీప్ తెలిపాడు.
తమ సినిమాను ఎంతగానో నమ్మి సినిమాను రిలీజ్ చేస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ కు థ్యాంక్స్ చెప్పిన ప్రదీప్, మైత్రీ నిర్మాతల సపోర్ట్ తమ సినిమాకు చాలా పెద్ద ప్లస్ అని తెలిపాడు. ట్రైలర్ చూసి బావుందని చెప్పిన బ్రహ్మానందంకు కూడా ప్రదీప్ ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పాడు. ఫస్ట్ సీన్ నుంచి ఎండ్ కార్డ్ వరకు తమ సినిమా చాలా క్లీన్ గా, ఎంటర్టైనింగ్ గా ఉంటుందని ప్రదీప్ వెల్లడించాడు.
ఏప్రిల్ 11న రిలీజ్ కానున్న ఈ సినిమా కోసం తాము చందమామ పుస్తకాల లాంటి భిన్నమైన కథాంశాన్ని సెలెక్ట్ చేసుకున్నామని చెప్పిన ప్రదీప్, ఈ సినిమా చూశాక ఒక మంచి సినిమా కోసం పవన్ కళ్యాణ్ టైటిల్ ను వాడుకున్నారని సంతోషిస్తారన్నాడు. దీపికా పిల్లి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా సక్సెస్‌పై ప్రదీప్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.
