Begin typing your search above and press return to search.

ప్రదీప్ మాచిరాజు.. ఈ ఆటేదో బాగుందే..!

యాంకర్ గా బుల్లితెర మీద సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ప్రదీప్ ఆ ఇమేజ్ ని సిల్వర్ స్క్రీన్ పై వాడుకోవాలని హీరోగా మొదటి ప్రయత్నంగా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమా చేశాడు.

By:  Tupaki Desk   |   13 May 2025 9:42 AM IST
ప్రదీప్ మాచిరాజు.. ఈ ఆటేదో బాగుందే..!
X

యాంకర్ గా బుల్లితెర మీద సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ప్రదీప్ ఆ ఇమేజ్ ని సిల్వర్ స్క్రీన్ పై వాడుకోవాలని హీరోగా మొదటి ప్రయత్నంగా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమా చేశాడు. అనూప్ సాంగ్స్ ఇచ్చిన జోష్ మున్నా డైరెక్షన్ ఆ సినిమా మాత్రం ప్రేక్షకులను అలరించింది. కమర్షియల్ గా కూడా అది వర్క్ అవుట్ అయ్యింది. ఐతే హిట్టు కొట్టాం కదా అని వెంటనే సినిమా చేయకుండా మళ్లీ కొంత స్మాల్ స్క్రీన్ పైనే యాంకరింగ్ కొనసాగించాడు ప్రదీప్. మరో హిట్ సబ్జెక్ట్ దొరికే దాకా వెయిట్ చేశాడన్నమాట.. అలా ఫైనల్ గా మళ్లీ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో రెండో అటెంప్ట్ చేశాడు.

ఈ సినిమా ఫస్ట్ సినిమా అంత హిట్ కాకపోయినా జస్ట్ ఓకే అనిపించుకుంది.. సినిమాను ఇంకాస్త బెటర్ గా తీసే ఛాన్స్ ఉన్నా దర్శకులు కాస్త కన్ ఫ్యూజ్ అయ్యారనిపిస్తుంది. ఈ సినిమాలో మరో స్పెషల్ ఎట్రాక్షన్ అదే బుల్లితెర మీద యాంకర్ గా చేస్తున్న దీపిక పిల్లి హీరోయిన్ గా నటించడమే. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా రిజల్ట్ ప్రదీప్ ని సాటిస్ఫై చేసిందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

ఐతే సినిమా చేయడం మళ్లీ గ్యాప్ ఇచ్చి బుల్లితెర మీద షోస్ చేయడం.. మళ్లీ మంచి కథ వస్తే సినిమా చేయడం ఇలా చేస్తున్నాడు ప్రదీప్. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాకు ముందు అన్ని షోస్ ఆపేసి ఆ సినిమా మీదే పూర్తి దృష్టి పెట్టాడు. ఆ సినిమా పూర్తైంది.. మళ్లీ అతను బ్యాక్ టు స్మాల్ స్క్రీనా లేదా మూడో సినిమా వెంటనే చేస్తాడా అన్నది ఆసక్తికరంగా మారింది. సినిమాలు చేస్తూ అటు బుల్లితెర మీద షోస్ చేయడం కాస్త ఇబ్బందే కానీ రెండిటినీ ప్రదీప్ బ్యాలెన్స్ చేస్తున్నాడు.

ఈసారి 3వ సినిమాకు మరీ లేట్ చేయకుండా ఉండాలని చూస్తున్నాడట. ఐతే ముందు రెండు సినిమాలు కామెడీ ఎంటర్టైనర్స్ గా చేసిన ప్రదీప్ ఈసారి తన థర్డ్ అటెంప్ట్ గా ఒక సీరియస్ సబ్జెక్ట్ ని తీసుకోవాలని చూస్తున్నాడు. అదే జరిగితే తప్పకుండా ప్రదీప్ సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్రదీప్ నెక్స్ట్ స్టెప్ ఏంటి మళ్లీ బ్యాక్ టు స్మాల్ స్క్రీన్ అంటాడా లేదా నెక్స్ట్ సినిమాకు లైన్ చేస్తాడా అన్నది చూడాలి. ఆడియన్స్ మాత్రం తను సినిమాలు చేస్తూ బుల్లితెర మీద కూడా కొనసాగాలని కోరుతున్నారు.