ఆ ఎగ్జైట్‌మెంట్‌తోనే గర్ల్‌ఫ్రెండ్‌ను చూసుకున్నా
ప్రమోషన్స్ లో భాగంగా ప్రదీప్ అడిగిన వారికి ఇంటర్వ్యూలిస్తూ మీడియాతో ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతున్నాడు.
By: Tupaki Desk | 31 March 2025 6:00 PM ISTబుల్లితెర యాంకర్ గా ప్రదీప్ కు ఉన్న క్రేజ్ వేరు. అతని యాంకరింగ్ అంటే పడి చచ్చే వాళ్లు ఎంతో మంది ఉన్నారు. ప్రస్తుతమున్న మేల్ యాంకర్స్ లో ప్రదీప్ టాప్ ప్లేస్ లో ఉన్నాడు. ఓ వైపు పలు షో లకు యాంకర్ గా ఉంటూనే మరోవైపు హీరోగా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమా చేశాడు. ఆ సినిమా తర్వాత కూడా ప్రదీప్ పలు షోలు చేశాడు.
ఇప్పుడు మళ్లీ ప్రదీప్ హీరోగా రెండో మూవీ రాబోతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి టైటిల్ ను వాడుకుంటూ ప్రదీప్ రెండో సినిమా చేశాడు. దీపికా పిల్లి హీరోయిన్ గా నటించిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది.
ప్రమోషన్స్ లో భాగంగా ప్రదీప్ అడిగిన వారికి ఇంటర్వ్యూలిస్తూ మీడియాతో ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతున్నాడు. రీసెంట్ గా ప్రదీప్ ఓ ఇంటర్వ్యూకి హాజరై అందులో తన గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. గతంలో ప్రదీప్ ఒక షో లో హుషారు లోని ఉండిపోరాదే సాంగ్ ను పాడుతూ చాలా ఎమోషనల్ అయిన విషయం తెలిసిందే.
ఇంటర్వ్యూలో అదే విషయం పై మీకు లవ్ కానీ, బ్రేకప్స్ కానీ ఉన్నాయా? ఎందుకు ఆ పాట పాడుతూ అంత ఎమోషనల్ అయ్యారు అని అడగ్గా దానికి ప్రదీప్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చాడు. ఎందుకుండవు ఉంటాయి, సూర్య సన్నాఫ్ కృష్ణన్ లో అదే నన్నే నన్నే చేరవచ్చె లాగా ఉండేదని, కానీ అదంతా కాలేజ్ డేస్ లో అని, అప్పుడు అందరికీ గర్ల్ ఫ్రెండ్ ఉంది కాబట్టి మనక్కూడా ఉండాలనే ఎగ్జయిట్‌మెంట్ తో ఉంటామని అన్నాడు.
కానీ ఎప్పుడైతే మనకు ఓ మెచ్యూరిటీ వస్తుందో అప్పుడే లైఫ్ లో ఏం చేయాలి? ఎలా చేయాలని ఆలోచిస్తామని, అలా తనక్కూడా మెచ్యూరిటీ వచ్చాక అన్నీ వదిలేసి లైఫ్ మీద ఫోకస్ చేసి సెటిల్ అయితే టైమ్ వచ్చినప్పుడు అన్నీ వస్తాయని రియలైజ్ అయ్యానని ప్రదీప్ తెలిపాడు. ఇక సినిమా విషయానికొస్తే ప్రదీప్ ఈ మూవీపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ మూవీతో నితిన్, భరత్ డైరెక్టర్లుగా పరిచయం అవుతున్నారు.
