Begin typing your search above and press return to search.

ఇండియ‌న్ మైఖెల్ జాక్స‌న్ ఇలా బిజీ అయితే ఎలా?

ప్రస్తుతం ప్ర‌భుదేవా వ‌రుస‌గా న‌ట‌న‌లో బిజీ అయిన ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ప్ర‌భుదేవా న‌టుడిగా కొన్ని త‌మిళ సినిమాలు చేస్తున్నాడు.

By:  Tupaki Desk   |   8 Nov 2023 11:30 PM GMT
ఇండియ‌న్ మైఖెల్ జాక్స‌న్ ఇలా బిజీ అయితే ఎలా?
X

బాలీవుడ్ లో వ‌రుస హిట్ సినిమాల‌తో కాక పుట్టించిన ప్ర‌భుదేవా ఒక్క‌సారిగా సైలెంట్ అయ్యాడేంటి? ఆయ‌న‌కు అవ‌కాశాలు రాక సినిమాలు చేయ‌లేదా? ఆయ‌నే కావాల‌ని స్కిప్ కొడుతున్నాడా? అని చాలా సందేహాలున్నాయి. బాలీవుడ్ లో ఆయ‌న చివ‌రిగా స‌ల్మాన్ ఖాన్ హీరోగా 'రాధే' చిత్రాన్ని తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన సినిమా అట్ట‌ర్ ప్లాప్ అయింది.

90 కోట్లు ఖ‌ర్చు చేసిన సినిమా 18 కోట్లు మాత్ర‌మే రాబ‌ట్టింది. ఈ సినిమా రిజ‌ల్ట్ తో ప్ర‌భుదేవా ఒక్క‌సారిగా సైలెంట్ అయిపోయారు. మ‌రి ఆయ‌న‌కు అవ‌కాశాలు రాక అలా సైలెంట్ అయ్యారా? అంటే మ్యాట‌ర్ అది కాద‌ని తాజాగా ఆయ‌న లైనప్ చూస్తుంటే తెలుస్తోంది. ప్రస్తుతం ప్ర‌భుదేవా వ‌రుస‌గా న‌ట‌న‌లో బిజీ అయిన ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ప్ర‌భుదేవా న‌టుడిగా కొన్ని త‌మిళ సినిమాలు చేస్తున్నాడు.

అలాగే శాండిల్ వుడ్ పైనా దృష్టి పెట్టిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం అక్క‌డా సినిమాలు చేస్తున్నాడు. ఈ నేప‌థ్యంలో ద‌ర్శ‌కుడిగా బాలీవుడ్ సినిమాలు తగ్గించిన‌ట్లు తెలుస్తోంది. అయితే ఇక్క‌డ మ‌రో బ‌ల‌మైన‌ కార‌ణం కూడా ఉంది. ప్ర‌భుదేవా ఇప్ప‌టికే బాలీవుడ్ లోకొంత మంది స్టార్ హీరోల‌కు స్టోరీలు చెప్పి లాక్ చేసాడు. అయితే ఆ హీరోలంతా ఇత‌ర చిత్రాల‌తో బిజీగా ఉన్నారు. అప్ప‌టిక‌ప్పుడు ప్ర‌భుదేవాకి డేట్లు కేటాయించ‌లేక హోల్డ్ లోపెట్టారు.

ఆ హీరోలు ఫ్రీ అయితే ప్ర‌భుదేవా సినిమాకి డేట్లు కేటాయించే అవ‌కాశం ఉంది. అయితే ద‌ర్శ‌కుడిగా బిజీ అయిన ప్ర‌భుదేవా ఒక్క‌సారిగా న‌టుడిగా మ‌ళ్లీ బిజీ అవ్వ‌డంతోనే అభిమానుడు నిరుత్సాహ‌ప‌డు తున్నారు. అయినా రెండు ప‌నులు ఒకేసారి చేయ‌డం కుద‌ర‌ని ప‌ని. ద‌ర్శ‌క‌త్వం..న‌ట‌న రెండింటిని బ్యాలెన్స్ చేయ‌డం అన్న‌ది క‌ష్ట‌మైన ప‌ని. కొంత కాలంగా గౌత‌మ్ మీన‌న్ కూడా ద‌ర్శ‌కుడిగా కంటే న‌టుడిగానే బిజీగా ఉన్నారు. ద‌ర్శ‌క‌త్వం చేయాల‌ని ఉన్నా! ఖాళీ లేక చేయ‌లేక‌పోతున్న‌ట్లు...అక్క‌డ వ‌చ్చే ఆదాయం..న‌టుడిగానే సంపాదిస్తున్న‌ట్లు మాట్లాడారు. మ‌రి ప్ర‌భుదేవా కూడా ఆయ‌న‌లా ట‌ర్న్ తీసుకుంటాడా? ఏమో!