Begin typing your search above and press return to search.

స‌న్నీలియోన్‌తో ప్ర‌భుదేవా స‌రిగ‌మ‌లు

శృంగార చిత్రాల తార స‌న్నీలియోన్ బాలీవుడ్ లో న‌టిగా మారి ప్ర‌జ‌ల హృద‌యాల్లో స్థానం సంపాదించుకుంది.

By:  Tupaki Desk   |   5 April 2024 3:55 AM GMT
స‌న్నీలియోన్‌తో ప్ర‌భుదేవా స‌రిగ‌మ‌లు
X

శృంగార చిత్రాల తార స‌న్నీలియోన్ బాలీవుడ్ లో న‌టిగా మారి ప్ర‌జ‌ల హృద‌యాల్లో స్థానం సంపాదించుకుంది. కానీ ఇటీవ‌ల స‌న్నీలియోన్ త‌న పిల్ల‌ల వ్యాప‌కంలో ప‌డి, సినీ ప‌రిశ్ర‌మ‌లో స్పీడ్ త‌గ్గించింది. అయితే అడ‌పాద‌డ‌పా సినిమాల్లో న‌టిస్తూనే ఉంది. తాజా స‌మాచారం మేర‌కు.. స‌న్నీలియోన్ త‌దుప‌రి ప్ర‌భుదేవా, హిమేష్ రేష‌మ్మియా వంటి పాపుల‌ర్ స్టార్ల‌తో జ‌త‌క‌ట్ట‌నుంది.

ఇది అరుదైన క‌ల‌యిక .. హిందీ మీడియా ప్రకారం, సన్నీ లియోన్ -హిమేష్ రేష్మియా- ప్రభుదేవాల అరుదైన క‌ల‌యిక‌లో భారీ ఎంట‌ర్ టైన‌ర్ సెట్స్ కెళ్ల‌నుంది. షూటింగ్ కోసం టీమ్ మస్కట్ వెళుతోంది. దర్శక‌టుడు ప్రభుదేవాతో స‌న్నీలియోన్ కి రెండో అవ‌కాశ‌మిది. ఈ జోడీ గ‌తంలో `పెట్టా రాప్` చిత్రంలోని ఒక పాట కోసం కలిసి పనిచేశారు. ఇప్పుడు మ‌రోసారి కలిసి స్క్రీన్‌పై క‌నిపించ‌బోతున్నారు. కంటెంట్ రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ జాన‌ర్ అని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. సీరియ‌ల్ కిస్స‌ర్ తో స‌న్నీలియోన్.. ఆ మ‌ధ్య‌లో ప్ర‌భుదేవా పాత్ర ఏమిట‌న్న‌ది స‌స్పెన్స్.

సన్నీలియోన్ బిగ్ బాస్ ఐదవ సీజన్‌లో పాల్గొన్న తర్వాత భార‌త‌దేశంలో స్టార్ గా మారింది. ఆరంభం జిస్మ్ 2లో కథానాయికగా ఛాన్స్ పొందింది. సన్నీ టెలివిజన్ ప్రపంచంలో కూడా పాపుల‌రైంది. MTV పాపుల‌ర్ షో స్ప్లిట్స్‌విల్లా సీజన్‌లను హోస్ట్ చేస్తోంది. స‌న్నీ ఇప్ప‌టికే తన అద్భుతమైన నృత్య నైపుణ్యాలను కూడా ప్రదర్శించింది. బాలీవుడ్‌కు కొన్ని అతిపెద్ద హిట్‌లను అందించింది. ఒక్కో పాటకు దాదాపు రూ. 2-3 కోట్లు తీసుకుంటుంది.

ఇటీవల అనురాగ్ కశ్యప్ తెర‌కెక్కంచిన కెన్నెడీలో ప్రధాన పాత్ర పోషించింది. ఈ చిత్రంలో రాహుల్ భట్, సన్నీలియోన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం 2023లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శిత‌మైంది. హాజరైన వారి నుండి ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత సినిమా థియేటర్లలో విడుదలైనప్పటికీ అక్కడ పెద్దగా స్పందన రాలేదు. సన్నీకి తమిళం, తెలుగు, మలయాళం, హిందీ, ఇంకా ఒక కన్నడ సినిమాల్లో గొప్ప లైనప్ ఉంది. కన్నడ స్టార్ ఉపేంద్ర యొక్క భారీ అంచనాల చిత్రం UI లో కూడా కనిపిస్తుంది.