Begin typing your search above and press return to search.

ప్రభాస్ - యశ్.. నిజమైతే అరాచకమే..

సలార్ సినిమాను దర్శకుడు ప్రశాంత్ మల్టీవర్స్ తరహాలో తెరపైకి తీసుకురాబోతున్నాడు అని ఇదివరకే టాక్ వినిపించింది.

By:  Tupaki Desk   |   14 Nov 2023 9:05 AM GMT
ప్రభాస్ - యశ్.. నిజమైతే అరాచకమే..
X

ప్రభాస్ నుంచి రాబోతున్న బిగ్గెస్ట్ యాక్షన్ ఫ్యాన్ ఇండియన్ మూవీ సలార్ బాక్స్ ఆఫీస్ వద్ద సాలీడ్ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది అని ఫ్రాన్స్ అయితే ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఇప్పటివరకు ఒక లెక్క ఇకనుంచి మరొక లెక్క అనేలా ఆ సినిమా రికార్డులు ఉండబోతున్నాయి అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి నిర్మాతలు కాస్త ఆలస్యంగానే ప్రమోషన్స్ మొదలుపెట్టారు.

ఏది ఏమైనా హీరో ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ బ్రాండ్ ఇమేజ్ వల్లనే ఈ సినిమా మార్కెట్లో ఈజీగా 1000 కోట్లు కలెక్ట్ చేస్తుంది అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ సినిమా కావాల్సినంత పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసుకుంది. అయినప్పటికీ మళ్లీ ఏదో ఒక అప్డేట్ ద్వారా మేకర్స్ ఆ అంచనాల స్థాయిని మరొక లెవల్ కు తీసుకు వెళుతున్నారు.

ఇక లేటెస్ట్ గా వస్తున్న మరొక గాసిప్ గురించి వింటే మాత్రం ఈ సినిమా మొదటి రోజే బాక్సాఫీస్ వద్ద కనివిని ఎరుగని రేంజ్ లో ఓపెనింగ్స్ అందుకుంటుంది అని చెప్పవచ్చు. సలార్ సినిమాను దర్శకుడు ప్రశాంత్ మల్టీవర్స్ తరహాలో తెరపైకి తీసుకురాబోతున్నాడు అని ఇదివరకే టాక్ వినిపించింది. ఇక విడుదలైన టీజర్ పోస్టర్లతో కూడా ఫాన్స్ డీకోడింగ్ చేస్తూ తప్పకుండా ఇదే కేజిఎఫ్ ప్రపంచానికి లింక్ అయ్యి ఉంటుంది అని అనుకుంటున్నారు.

కానీ ఇప్పటివరకు దర్శకుడు ఆ విషయంలో ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఇక లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్ ప్రకారం సలార్ లో కేజీఎఫ్ స్టార్ ఉండబోతున్నట్లు టాక్ అయితే గట్టిగా విడిపిస్తుంది. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం పోటీగా షారుక్ ఖాన్ డుంకి సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా కూడా సలార్ కలెక్షన్స్ పై ఏ మాత్రం ప్రభావం చూపదని చెప్పవచ్చు.

అసలే కేజిఎఫ్ సెకండ్ పార్ట్ తో బాలీవుడ్ లోనే కావాల్సినంత క్రేజ్ అందుకున్నారు. ప్రశాంత్ నీల్ ఇమేజ్ అక్కడ గట్టిగానే ఉంది. కాబట్టి సినిమాలో ప్రభాస్ యశ్ ఇద్దరు కూడా కలిసి ఒకే ఫ్రేమ్ లో కాసేపు కనిపిస్తే ఆ హీట్ మామూలుగా ఉండదు. కనీసం కలెక్షన్ ఉంది అని తెలిసిన కూడా సినిమాకు అదే మేజర్ ప్లస్ పాయింట్ అవుతుంది. మరి దర్శకుడు ప్రశాంత్ కేజిఎఫ్ కు నిజంగానే లింకు పెట్టాడా లేదా అనేది తెలియాలి అంటే డిసెంబర్ 22 వరకు ఆగాల్సిందే.