Begin typing your search above and press return to search.

ప్రభాస్ బొమ్మను కామెడీ చేశారే..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అంటే ప్రస్తుతం అందరికి గుర్తుకొచ్చే సినిమా బాహుబలి.

By:  Tupaki Desk   |   26 Sep 2023 4:12 AM GMT
ప్రభాస్ బొమ్మను కామెడీ చేశారే..
X

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అంటే ప్రస్తుతం అందరికి గుర్తుకొచ్చే సినిమా బాహుబలి. ఈ బాహుబలి ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఓ విధంగా బాహుబలిలో ప్రభాస్ లుక్ అతనికి విపరీతమైన బ్రాండింగ్ తీసుకొచ్చింది. ఒక కింగ్ అంటే ఇలానే ఉంటాడేమో అనేలా ప్రభాస్ రూపం, దేహం ఉండటంతో అందరికి బాగా కనెక్ట్ అయ్యింది. నార్త్ ఇండియన్ ఆడియన్స్ కి కూడా ప్రభాస్ కి దగ్గర చేసింది బాహుబలి లుక్ అని చెప్పొచ్చు.

అయితే బ్యాంకాక్ లో మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రభాస్ మైనపు బొమ్మ ఉంది. అది కూడా బాహుబలి గెటప్ లోనే ఏర్పాటు చేశారు. ఈ మైనపు బొమ్మ ప్రభాస్ లుక్స్ కి దగ్గరగానే ఉంది. అయితే తాజాగా ప్రభాస్ బాహుబలి గెటప్ లో మరో మైనపు విగ్రహం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిని మైసూర్ లో ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

ప్రభాస్ అంటే బాహుబలి గెటప్ తప్ప ఇంకెలాంటి పోలిక లేకపోయిన పర్వాలేదు అనే విధంగా ఈ మైనపు విగ్రహం ఉండటం విశేషం. దీంతో నెటిజన్లు ఈ మైనపు విగ్రహం ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నాప్ టాల్ ప్రభాస్, డేవిడ్ వార్నర్ బాహుబలి గెటప్, అమరేంద్ర జాన్ వీక్ బాహుబలి లుక్ ఇది అంటూ కామెంట్స్ తో ట్రోల్ చేస్తున్నారు. కొంత మంది అయితే మీమ్స్ కూడా క్రియేట్ చేస్తూ ఉండటం విశేషం.

మైసూర్ వాక్స్ మ్యూజియంలో ఈ స్టాట్యూ ఏర్పాటు చేశారు. ఇందులో లుక్ లో అస్సలు ప్రభాస్ పోలికలు లేవనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇలాంటి విగ్రహాలు ఏర్పాటు చేసి ప్రభాస్ పరువు తీయొద్దు అంటూ డార్లింగ్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. ఈ విగ్రహాన్ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.

మరి ప్రభాస్ బాహుబలి మైనపు విగ్రహం విషయంలో సోషల్ మీడియాలో ట్రోల్స్ జరుగుతూ ఉండటంతో మైసూర్ లో మ్యూజియం నిర్వాహకులు ఏమైనా మార్పులు చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.