Begin typing your search above and press return to search.

ప్రభాస్ ఎక్కడికెళ్లినా వాళ్ళు ఉండాల్సిందే..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చాలాకాలంగా బిగ్ బడ్జెట్ సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు

By:  Tupaki Desk   |   26 Feb 2024 9:46 AM GMT
ప్రభాస్ ఎక్కడికెళ్లినా వాళ్ళు ఉండాల్సిందే..
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చాలాకాలంగా బిగ్ బడ్జెట్ సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు. ఇక అప్పుడప్పుడు కాస్త రెస్ట్ తీసుకోవడానికి విదేశాలకు వెళుతూ ఉంటాడు. ప్రభాస్ ఒకప్పుడు ఈ రేంజ్ లో స్టార్ హోదా రాకముందు మాత్రం తన ఫామ్ హౌస్ లో ఎక్కువగా ఉండడానికి ఇష్టపడేవాడు. అయితే ప్రభాస్ కు ఒకే చోట ఉండాలన్నా కూడా అంతగా ఇష్టం ఉండదు.

బయట కూడా తిరగాలని చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడు. ఒకప్పుడు హైదరాబాద్లో బెస్ట్ ఫుడ్ ఏది ఉంటే అది ప్రభాస్ వెంటనే తినాలని అనుకునేవారు. చాలా ఇంటర్వ్యూలలో ఈ విషయాన్ని తెలియజేశాడు. ఆఖరికి లోకల్ పానీపూరి కూడా వదల్లేదు అని ఎన్నోసార్లు చెప్పాడు. అయితే ఇప్పటికి కూడా ప్రభాస్ అంతే సింపుల్ గా ఉండడానికి ఇష్టపడతాడు. కానీ బయట మాత్రం తిరిగే స్వేచ్ఛ ఉండదు కాబట్టి ఎక్కువగా విదేశాలకు వెళుతూ ఉన్నాడు.

అయితే అక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభాస్ ప్రత్యేకంగా ఒక ఇంటిని లేదా విల్లా లాంటివి రెంటుకు తీసుకుని ఉంటున్నట్లుగా తెలుస్తోంది. అందుకోసం ఖర్చు కూడా గట్టిగానే పెడుతున్నాడు. ఆ మధ్య ఇటలీలో కూడా ప్రభాస్ ఒక పెద్ద బంగ్లా తీసుకున్నాడు అని చాలా రకాల వార్తలు వచ్చాయి. సాహో సినిమా తర్వాత కొన్నాళ్ళు ప్రభాస్ అక్కడే రెస్ట్ తీసుకున్నాడు.

అప్పుడప్పుడు యూఎస్ కూడా వెళ్లడం కామన్. ఇక రీసెంట్ గా అతను లండన్ వెళ్లగా అక్కడ కూడా మరొక విల్లా ను రెంట్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఆ విల్లా రెంట్ దాదాపు 60 లక్షలు అని తెలుస్తోంది. ఇక ప్రభాస్ తో పాటు అతని టీం కూడా ఎల్లప్పుడూ విదేశాలకు వెళ్లడం కామన్ గా మారిపోయింది. ముఖ్యంగా ప్రభాస్ కోసం ప్రత్యేకంగా ఒక చెఫ్ కూడా ఎల్లప్పుడూ అతని వెంటే ప్రయాణాలు చేస్తూ ఉంటాడు.

అతని మేనేజర్స్ కూడా ప్రభాస్ తో పాటు విదేశాలకు వెళ్లాల్సిందే. ఇక ప్రభాస్ మంచి భోజనం ప్రియుడు కాబట్టి ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న చెఫ్ ఏ దేశం వెళ్లినా వెంట ఉండాల్సిందే. అతనికి ఇష్టమైన రకరకాల వంటలను తనే చేయడం, లేదంటే అక్కడ ఉన్న బెస్ట్ చెఫ్ లను పిలిపించి వండించడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక వారి కోసం కూడా ఖర్చు గట్టిగానే చేస్తున్న ప్రభాస్ మొత్తంగా విదేశాలకు హాలిడేస్ కోసం వెళితే మాత్రం కోట్లల్లో ఖర్చు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఏదేమైనా ప్రభాస్ వెళితే అసిస్టెంట్లకు కూడా ఒక హాలిడే వెకేషన్ లాంటిదే అని చెప్పవచ్చు. ఇక ప్రభాస్ దగ్గర పని చేసేవారిలో ఎక్కువగా అతని స్నేహితులు ఉంటారని అందరికి తెలిసిందే. ఒకవేళ వేరే వారు పనిలో చేరినా ప్రభాస్ మంచితనంకు ఫ్రెండ్స్ అయిపోతారు. అంతలా ప్రభాస్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే మన చుట్టూ ఉన్నవారు బాగుంటేనే మనం బాగుంటాము అని ప్రభాస్ నమ్ముతారు.