Begin typing your search above and press return to search.

ప్రభాస్ ఫ్యాన్స్ కోసం ఆ రెండు పక్కా..

ఇక మొత్తానికి ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 23వ తేదీన సలార్ కల్కి నుంచి మాత్రం పక్క రెండు అప్డేట్స్ రాబోతున్నట్లుగా తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   13 Oct 2023 12:30 AM GMT
ప్రభాస్ ఫ్యాన్స్ కోసం ఆ రెండు పక్కా..
X

ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఏదైనా అప్డేట్ ఇస్తారేమో అని ఫ్యాన్స్ అయితే చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఏ హీరోకు లేనివిధంగా ప్రభాస్ లైనప్ లో బలమైన సినిమాలు ఉన్నాయి. బాహుబలి తర్వాత సరైన సక్సెస్ లేకపోయినప్పటికీ కూడా ప్రభాస్ అరేంజ్ అయితే అసలు తగ్గలేదు. ఇక రాబోయే సినిమాలు తప్పకుండా సక్సెస్ అవుతాయి అని రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో నమ్మకంతో ఉన్నారు.

అయితే ముందుగా రావలసిన సలార్ వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇక డిసెంబర్లో రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ కోసం కూడా ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకుంటున్నారు. అసలైతే మొదట అనుకున్న ప్లాన్ ప్రకారం ఫ్యాన్స్ ను సంతోష పరచాలని రెండు ట్రైలర్స్ విడుదల చేయాలని అనుకున్నారు. విడుదల టైం కి ఒక ట్రైలర్ అలాగే ఇప్పుడు ప్రభాస్ బర్త్ డే ఒక ట్రైలర్ విడుదల చేస్తే బాగుంటుంది అని ప్రశాంత్ నీల్ ఆలోచించాడు.

కానీ ఇప్పుడు ఆ ప్లాన్ వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు. ఎందుకో మరి ఇప్పుడు కేవలం ప్రభాస్ కు ప్రత్యేకంగా బర్తడే శుభాకాంక్షలు తెలుపుతూ ఒక టీజర్ విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఇక మరొకవైపు కల్కి సినిమా కూడా షూటింగ్ దశలో ఉంది. ఆ చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా ప్రభాస్కు బర్త్ డే విషెస్ చెబుతూ ఒక చిన్న టీజర్ విడుదల చేసే ఛాన్స్ ఉంది.

ఇక మారుతి సినిమా షూటింగ్ ఎంతవరకు వచ్చింది అనే విషయంలో క్లారిటీ లేదు అయితే ఈ సినిమా అప్డేట్ మాత్రం ఉండకపోవచ్చు అలాగే మరోవైపు హను రాఘవపూడి తో కూడా ప్రభాస్ ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ ప్రాజెక్టు అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా పుట్టినరోజు చెప్పేయాలని అనుకున్నారు. కానీ ప్రస్తుతం ప్రభాస్ లైనప్ ఎక్కువగా ఉండడం అలాగే ఏది ఎప్పుడు వస్తుందో తెలియని కన్ఫ్యూజన్ ఉండడంతో వెంట వెంటనే ఈ విధంగా అనౌన్స్ చేయకూడదు అని ఫిక్స్ అయ్యారు.

మొదట సలార్ సినిమా రిలీజ్ అయిన తర్వాతనే మారుతి ప్రాజెక్టుకు సంబంధించిన అప్డేట్స్ అలాగే హను రాగపూడి కాంబినేషన్ పై క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నారు. ఇక మొత్తానికి ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 23వ తేదీన సలార్ కల్కి నుంచి మాత్రం పక్క రెండు అప్డేట్స్ రాబోతున్నట్లుగా తెలుస్తోంది.