Begin typing your search above and press return to search.

వ‌ర‌ల్డ్ మార్కెట్లో ర‌జ‌నీని మించిపోయిన ప్ర‌భాస్

రజనీకాంత్- ప్ర‌భాస్ నిస్సందేహంగా భారతీయ సినీపరిశ్రమలో అతిపెద్ద స్టార్లు అన్న‌దాంట్లో సందేహం లేదు.

By:  Tupaki Desk   |   17 Feb 2024 5:08 AM GMT
వ‌ర‌ల్డ్ మార్కెట్లో ర‌జ‌నీని మించిపోయిన ప్ర‌భాస్
X

పాన్ ఇండియా నుంచి పాన్ వ‌ర‌ల్డ్ మార్కెట్ కి సౌత్ సినిమా ఎదిగేస్తోంది. ఇన్నాళ్లు పాన్ ఇండియా మార్కెట్ అంటూ చెప్పుకుంటున్న ట్రేడ్ ఇక‌పై పాన్ వ‌ర‌ల్డ్ మార్కెట్ అని ఘనంగా ప్ర‌స్థావించ‌నుంది. అంటే దీన‌ర్థం.. హాలీవుడ్ సినిమాల‌కు ధీటుగా తెలుగు-త‌మిళ చిత్రాలు విడుద‌ల‌య్యేందుకు ఇంకెంతో స‌మ‌యం ప‌ట్ట‌దు. ఇప్ప‌టికే మ‌హేష్ - రాజ‌మౌళి సినిమాని పాన్ వ‌ర‌ల్డ్ లో రిలీజ్ చేస్తార‌న్న గుస‌గుస వినిపిస్తోంది. దీనికి తోడు సూర్య న‌టిస్తున్న కంగువ చిత్రాన్ని ఏకంగా ప్ర‌పంచంలోని 36 భాష‌ల్లో రిలీజ్ చేయ‌నున్నార‌న్న టాక్ వేడెక్కిస్తోంది. ఇలా మునుముందు సౌత్ స్టార్లంతా ఒక‌రితో ఒక‌రు పోటీప‌డే స‌న్నివేశం క‌నిపిస్తోంది. అటు బాలీవుడ్ లోను ఖాన్ లు స‌హా యంగ్ హీరోలు పాన్ ఇండియా, పాన్ వ‌ర‌ల్డ్ మార్కెట్ల‌పై గురి పెట్టారు.

అయితే రేసులో ఎంద‌రు ఉన్నా ఇప్ప‌టికే పాన్ వ‌ర‌ల్డ్ మార్కెట్లో త‌మ‌దైన ముద్ర వేస్తూ దూసుకుపోయిన ఇద్ద‌రు ప్ర‌ముఖ సౌత్ స్టార్ల న‌డుమ కాంపిటీష‌న్ గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ప్రపంచవ్యాప్త బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభాస్ VS రజనీకాంత్ వార్ కొన‌సాగుతోంద‌నేది ఒక స‌ర్వే. బాహుబలి స్టార్ ప్ర‌భాస్ తన చివరి 5 చిత్రాల మొత్తాన్ని క‌లుపుకుంటే 77 శాతం అధిక వ‌సూళ్ల‌ సగటుతో తలైవా ర‌జ‌నీని అధిగ‌మించాడ‌ని తెలిసింది. ఆ ఇద్ద‌రినీ పోల్చ‌డం స‌ముచితం కాదు. ర‌జనీ సూప‌ర్ సీనియ‌ర్ హీరో. కెరీర్ లో ఎన్నో అజేయ‌మైన బ్లాక్ బ‌స్ట‌ర్లు అందించారు. యంగ్ రెబ‌ల్ స్టార్ ప్రభాస్ బాహుబ‌లి త‌ర్వాత అసాధార‌ణ స్టార్ డ‌మ్ ని అందుకున్నారు. రజనీకాంత్ గత 5 విడుదలలతోనే పోలుస్తూ ప్ర‌భాస్ ని గొప్ప అన‌డం కూడా క‌రెక్ట్ కాదు. కానీ ఐదు సినిమాల యావ‌రేజ్ విష‌యంలో ర‌జ‌నీ గ‌త ఐదు చిత్రాల‌ను డామినేట్ చేసాయ‌నేది ఒక విశ్లేష‌ణ‌.

రజనీకాంత్- ప్ర‌భాస్ నిస్సందేహంగా భారతీయ సినీపరిశ్రమలో అతిపెద్ద స్టార్లు అన్న‌దాంట్లో సందేహం లేదు. ఇద్దరూ తమ ప్రాంతీయ పరిశ్రమలకు మించి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను ఆస్వాధిస్తున్నారు. హిందీ బెల్ట్ స‌హా పాన్ వ‌ర‌ల్డ్ లో ప‌లు దేశాల్లో భారీ ఫాలోవ‌ర్స్ ని క‌లిగి ఉన్నారు ఈ ఇద్ద‌రూ. అందుకే వీళ్లిద్ద‌రూ బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద క్రౌడ్-పుల్లర్ లుగా పేరు పొందారు.

ఇటీవ‌ల ప్ర‌భాస్ న‌టించిన‌ స‌లార్ పంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 615.26 కోట్ల వసూళ్లను సాధించింది. ప్రభాస్ కెరీర్ లో మ‌రో అరుదైన బ్లాక్ బ‌స్ట‌ర్ గా స‌లార్ నిలిచింది. సాలార్‌కి ముందు ఆదిపురుష్ విడుద‌లైంది. ఇది బాక్సాఫీస్ వ‌ద్ద‌ పరాజయం పాలైంది. ప్రపంచవ్యాప్తంగా 395 కోట్ల గ్రాస్ రాబట్టినప్పటికీ, దీనికోసం చేసిన భారీ ఖ‌ర్చు వ‌ల్ల పెద్ద వైఫల్యంగా డిక్లేర్ అయింది. ఆదిపురుష్‌కి ముందు రాధే శ్యామ్ కూడా బాక్సాఫీస్ వ‌ద్ద భారీగా విఫ‌లమైంది. ఈ చిత్రం కేవలం 148 కోట్ల గ్రాస్ సాధించింది.

రాధే శ్యామ్ కంటే ముందు ప్రభాస్ డీసెంట్ రన్ సాధించాడు. అత‌డు న‌టించిన‌ సాహో 453 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసింది. ప్రభాస్ న‌టించిన‌ బాహుబలి 2: ది కన్‌క్లూజన్ 1800 కోట్ల గ్రాస్ రాబట్టడం అతి పెద్ద సంచ‌ల‌నం. ప్రభాస్ చివరి 5 చిత్రాల ప్రపంచవ్యాప్త బాక్సాఫీస్ ప్రదర్శన చూస్తే.. బాహుబలి 2: ది కన్‌క్లూజన్ - 1800 కోట్ల గ్రాస్, సాహో - 453 కోట్ల గ్రాస్, రాధే శ్యామ్ - 148 కోట్లు గ్రాస్‌, ఆదిపురుష్ - 395 కోట్లు గ్రాస్, స‌లార్ - 615.26 కోట్లు గ్రాస్ .. ఈ ఐదు సినిమాల వ‌సూళ్లు - 3,411.26 కోట్లు..సగటు- 682.25 కోట్ల గ్రాస్.

రజనీకాంత్ కెరీర్ బెస్ట్ హిట్ చిత్రంగా జైలర్ నిలిచింది. ఇది 9 ఆగస్టు 2023న విడుదలై విమర్శకుల నుండి సానుకూల సమీక్షలను అందుకుంది. నెల్సన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 605 కోట్ల గ్రాస్ రాబట్టింది.

వెనక్కు వెళితే జైలర్ కంటే ముందు రజనీకి అన్నాత్తే ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా 175 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది. అధ్వాన్నమైన వ‌సూళ్లు ఇవి. ర‌జ‌నీ `దర్బార్` కూడా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్‌ను సృష్టించలేకపోయింది. ఆశించిన స్థాయిలో ప్రదర్శన ఇవ్వలేదు. ఈ చిత్రం 250 కోట్ల గ్రాస్‌ను రాబట్టి ఫుల్ ర‌న్‌ని ముగించింది. పెట్టా చిత్రం 235 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది. జైలర్ కి ముందు రజనీకాంత్ చివరిసారిగా శంకర్ తో 2.0 సినిమాలో న‌టించారు. ఈ చిత్రం కాస్ట్ ఫెయిల్యూర్ గా మిగిలినా కానీ, ప్రపంచవ్యాప్తంగా 655.44 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసింది.

రజనీకాంత్ చివరి 5 చిత్రాల ప్రపంచవ్యాప్త బాక్సాఫీస్ ప్రదర్శన చూస్తే.. 2.0 - 655.44 కోట్లు గ్రాస్, పెట్టా - 235 కోట్లు, దర్బార్ - 250 కోట్ల గ్రాస్, అన్నాత్తే - 175 కోట్ల గ్రాస్, జైలర్ - 605 కోట్లు గ్రాస్ వ‌సూలైంది. మొత్తం గ్రాస్.- 1920.44 కోట్లు, సగటు- 384.08 కోట్ల గ్రాస్. దీనిని బ‌ట్టి చూస్తే ప్ర‌భాస్ స‌గ‌టు ర‌జ‌నీ కంటే చాలా ఎక్కువ‌గా ఉంది.