Begin typing your search above and press return to search.

ప్రభాస్ స్పిరిట్.. ప్లాన్ మారుతోంది!

కథలని ప్రెజెంట్ చేయడంలో సమాజంలో పెట్టుకున్న కట్టుబాట్లు అన్ని దాటిపోయి ఎక్స్ట్రీమ్ లెవల్ ఆలోచిస్తాడని అర్జున్ రెడ్డితోనే ప్రూవ్ చేసుకున్నాడు.

By:  Tupaki Desk   |   13 Dec 2023 3:46 AM GMT
ప్రభాస్ స్పిరిట్.. ప్లాన్ మారుతోంది!
X

సందీప్ రెడ్డి వంగా పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. అర్జున్ రెడ్డి సినిమాతోనే తన థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో హీరో పాత్ర ద్వారా సందీప్ రెడ్డి చెప్పకనే చెప్పేశారు. కథలని ప్రెజెంట్ చేయడంలో సమాజంలో పెట్టుకున్న కట్టుబాట్లు అన్ని దాటిపోయి ఎక్స్ట్రీమ్ లెవల్ ఆలోచిస్తాడని అర్జున్ రెడ్డితోనే ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు యానిమల్ మూవీతో సందీప్ రెడ్డి ఆలోచన శైలిపై అందరికి ఒక స్పష్టత వచ్చేసింది.

ఏదైనా మోతాదుకి మించి ఉంటే ప్రమాదం అని అంటారు. అలాంటి ప్రమాదకర వ్యక్తిత్వంలో కూడా హీరోయిజం చూపించడంతో యానిమల్ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. రణబీర్ కపూర్ పెరర్మేన్స్ కి ప్రశంసలు లబిస్తున్నాయి. అలాగే విలన్ గా చేసిన బాబీ డియోల్ పోగొట్టుకున్న ఇమేజ్ మొత్తం తిరిగి సంపాదించుకున్నాడు. యానిమల్ తర్వాత సందీప్ రెడ్డి డార్లింగ్ ప్రభాస్ తో స్పిరిట్ మూవీ చేయబోతోన్న సంగతి తెలిసిందే.

ఈ మూవీ పోస్టర్ ని ఎప్పుడో ఏడాది క్రితమే వదిలారు. సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ఉంటాడని పోస్టర్ తో కన్ఫర్మ్ చేశారు. ఈ సినిమాని కూడా టి-సిరీస్ భూషణ్ కుమార్ నిర్మించబోతున్నారు. అర్జున్ రెడ్డి సినిమాని హిందీలో రీమేక్ చేసింది భూషణ్ కుమార్ అనే సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత మూడు చిత్రాలకి టీ-సిరీస్ తో చేయడానికి సందీప్ రెడ్డి ఒప్పందం చేసుకున్నారు.

అందులో మొదటి చిత్రం యానిమల్. దీంతో బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. రెండో సినిమా స్పిరిట్. ఈ సినిమా వచ్చే ఏడాది స్టార్ట్ అవుతుంది. అయితే ఈ సినిమాకి తెలుగు నిర్మాణ భాగస్వామి మారనున్నారని టాక్. ఆదిపురుష్ సినిమా తెలుగు రైట్స్ ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కొనుగోలు చేసింది. అయితే ఆ సినిమా ఫ్లాప్ కావడంతో కొంత నష్టపోయింది. దీంతో మరో సినిమా పీపుల్ మీడియాకి ఇవ్వడానికి టి-సిరీస్ ఒప్పుకుంది.

స్పిరిట్ మూవీ తెలుగు రైట్స్ ని పీపుల్ మీడియాకి ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. అదే జరిగితే ఈ సంస్థ కెరియర్ లో అతి పెద్ద బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకున్నట్లే అవుతుంది. కలెక్షన్స్ పరంగా కూడా ఆదిపురుష్ తో పోగొట్టుకున్న మొత్తం తిరిగి రాబట్టుకోవచ్చు. త్వరలో ఈ మార్పుతో స్పిరిట్ నుంచి మరో పోస్టర్ ని రిలీజ్ చేసే అవకాశం ఉందనే టాక్ ఇండస్ట్రీ సర్కిల్ లో వినిపిస్తోంది.