Begin typing your search above and press return to search.

స్పిరిట్‌ : రెండు సూపర్‌ అప్‌డేట్స్‌

యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్ గత ఏడాది సలార్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

By:  Tupaki Desk   |   30 March 2024 4:17 AM GMT
స్పిరిట్‌ : రెండు సూపర్‌ అప్‌డేట్స్‌
X

యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్ గత ఏడాది సలార్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక మీదట ప్రభాస్ నుంచి రాబోతున్న ప్రతి సినిమా కూడా కచ్చితంగా వెయ్యి కోట్ల సినిమానే అన్నట్లుగా ఫ్యాన్స్ చాలా ధీమాతో ఉన్నారు. ప్రభాస్ కమిట్‌ అయిన సినిమాలు కూడా అదే రేంజ్ లో ఉన్నాయి.

ప్రభాస్‌ త్వరలో కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమా పాన్ వరల్డ్‌ మూవీ అనే విషయంను మేకర్స్ పదే పదే ప్రకటిస్తూ వస్తున్నారు. ఇక మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రాజాసాబ్ సినిమా కూడా కచ్చితంగా కమర్షియల్‌ బ్లాక్ బస్టర్‌ అనే టాక్ వినిపిస్తుంది. ఇక ప్రభాస్‌ తో యానిమల్‌ మేకర్‌ చేయబోతున్న స్పిరిట్‌ కి ఆకాశమే హద్దు అన్నట్లుగా అంచనాలు ఉన్నాయి.

దర్శకుడు సందీప్ వంగ యానిమల్ సినిమాలో అంతకు ముందు అర్జున్‌ రెడ్డి సినిమాలో హీరోలను చూపించిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ రేంజ్‌ లో ప్రభాస్ ను దర్శకుడు కనుక చూపించగలిగితే స్పిరిట్‌ వెయ్యి కోట్లకు మించి వసూళ్లు చేస్తుందని, బాహుబలి రికార్డులను బ్రేక్‌ చేయగల సత్తా ఉన్న మూవీ అవుతుందని ఫ్యాన్స్‌ నమ్మకంగా ఉన్నారు.

స్పిరిట్ సినిమా గురించి ఆకాశమే హద్దు అన్నట్లు అంచనాలు పెరుగుతున్న సమయంలో రెండు ఆసక్తికర అప్‌డేట్స్ ఈ సినిమా గురించి సినీ వర్గాల ద్వారా అందుతున్నాయి. మొదటిది ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ కు ప్రభాస్ 2024 డిసెంబర్‌ అంటే ఈ ఏడాదిలోనే డేట్లు ఇచ్చేందుకు ఓకే చెప్పాడట.

ప్రభాస్ డేట్లు క్లారిటీ రావడం తో తదుపరి విషయాలపై దర్శకుడు సందీప్ వంగ ఫోకస్ చేశాడని తెలుస్తోంది. ఈ సినిమా కోసం రష్మిక మందన్న, కీర్తి సురేష్‌ మరియు మృణాల్ ఠాకూర్ పేర్లను పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. యానిమల్ సెంటిమెంట్‌ కంటిన్యూ అవ్వాలని రష్మిక మందన్న పై దర్శకుడు ఆసక్తి చూపిస్తున్నాడు.

ప్రభాస్‌ నిర్ణయం పై ఆధారపడి ఉంది. హీరోయిన్ విషయంలో అతి త్వరలోనే మరింత స్పష్టత రావడం ఖాయం. ఈ ముగ్గురిలో ఒకరు ప్రభాస్‌ కి జోడీగా నటించబోతున్నారు, అలాగే డిసెంబర్‌ నుంచి సినిమా షూటింగ్‌ ప్రారంభం కాబోతుంది. ఈ రెండు అప్‌డేట్స్ ప్రభాస్ ఫ్యాన్స్ కి ఫుల్‌ కిక్‌ ఇచ్చేవే. ఈ డిసెంబర్‌ లో స్పిరిట్ షూట్‌ ప్రారంభం అయితే 2026 లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.