Begin typing your search above and press return to search.

స్పిరిట్..ఒక్క ముక్కలో చెప్పాలంటే

టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా గత ఏడాది యానిమల్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు

By:  Tupaki Desk   |   11 July 2024 5:10 AM GMT
స్పిరిట్..ఒక్క ముక్కలో చెప్పాలంటే
X

టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా గత ఏడాది యానిమల్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఏకంగా 900+ కోట్ల కలెక్షన్స్ ని వరల్డ్ వైడ్ గా యానిమల్ మూవీ కలెక్ట్ చేసింది. దీనిని బట్టి సినిమాకి ఎలాంటి ఆదరణ వచ్చిందో అర్ధం చేసుకోవచ్చు. మోస్ట్ వైలెంట్ మూవీగా యానిమల్ చిత్రాన్ని సందీప్ రెడ్డి తెరకెక్కించారు. దర్శకుడి సందీప్ రెడ్డి స్టైల్ కూడా వైలెన్స్ అని ఆయన సినిమాలు చూస్తేనే అర్ధమవుతోంది.

హై ప్రొఫైల్ లోనే హీరో క్యారెక్టరైజేషన్స్ ని కూడా సందీప్ రెడ్డి డిజైన్ చేస్తాడు. ఇదిలా ఉంటే సందీప్ రెడ్డి నెక్స్ట్ డార్లింగ్ ప్రభాస్ తో స్పిరిట్ మూవీ చేయబోతున్నాడు. ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. సౌత్ కొరియన్ స్టార్ యాక్టర్ ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. పాన్ వరల్డ్ మూవీగానే ఈ సినిమాని సందీప్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారంట. 300+ కోట్ల భారీ బడ్జెట్ తో టి-సిరీస్ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. సందీప్ రెడ్డి కూడా నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు.

ఇదిలా ఉంటే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ ఏడాది ఆఖరులో మొదలయ్యే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. ప్రస్తుతం ఓ వైపు స్క్రిప్ట్ వర్క్ చేస్తూనే మరో వైపు క్యాస్టింగ్ ని కూడా ఖరారు చేసుకునే పనిలో సందీప్ రెడ్డి వంగా ఉన్నారంట. ఇదిలా ఉంటే ఈ మూవీ కాన్సెప్ట్ గురించి ఇంటరెస్టింగ్ ప్రచారం తెరపైకి వచ్చింది. సినిమాలో డ్రగ్స్ ప్లీడర్లు, డీలర్స్ తో వర్క్ చేసే కరప్టెడ్ కాప్ పాత్రలో ప్రభాస్ పాత్ర ఉంటుందంట.

అయితే డ్రగ్స్ మాఫియాతో కలిసి పనిచేస్తూనే వారిని పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ ఎలా నాశనం చేసాడు అనేది కథలో భాగంగా చెప్పబోతున్నారంట. పవర్ ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ మూవీగా ఈ చిత్రాన్ని సందీప్ రెడ్డి తెరకెక్కించబోతున్నారంట. హాలీవుడ్ స్టాండర్డ్స్ లో స్పెక్టక్యులర్ గా స్పిరిట్ మూవీలో యాక్షన్ ఘట్టాలని సందీప్ రెడీ చేస్తున్నారంట. ఈ క్యారెక్టర్ కోసం ప్రభాస్ తన బాడీ లాంగ్వేజ్, లుక్ కూడా చేంజ్ చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

కల్కి హడావిడి మరికొద్దిరోజుల్లో ముగియనున్న నేపథ్యంలో స్పిరిట్ సినిమాకి సంబంధించి ఏదో ఒక అప్డేట్ చిత్ర యూనిట్ ఇచ్చే అవకాశం ఉందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. ప్రభాస్ స్పిరిట్ కంటే ముదుగా హను రాఘవాపూడి దర్శకత్వంలో సినిమాని ప్రభాస్ సెట్స్ పైకి తీసుకొని వెళ్లే అవకాశం ఉందంట. అలాగే ప్రభాస్ రాజా సాబ్ మూవీని నెక్స్ట్ ఆడియెన్స్ ముందుకు తీసుకు రానున్నాడు.