Begin typing your search above and press return to search.

స్పిరిట్... ఫేక్ న్యూస్ ఎక్కువ అయ్యాయి

యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్‌ ఫ్లాప్స్ నుంచి సలార్‌ తో బయట పడి కాస్త రిలాక్స్‌ అయ్యాడు

By:  Tupaki Desk   |   21 April 2024 7:37 AM GMT
స్పిరిట్... ఫేక్ న్యూస్ ఎక్కువ అయ్యాయి
X

యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్‌ ఫ్లాప్స్ నుంచి సలార్‌ తో బయట పడి కాస్త రిలాక్స్‌ అయ్యాడు. ఇకపై ప్రభాస్ నుంచి రాబోతున్న ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీ హిట్‌, వెయ్యి కోట్ల వసూళ్లు సాధించబోతున్న సినిమాలే అనడంలో సందేహం లేదు అంటూ ఫ్యాన్స్ చాలా బలంగా నమ్ముతున్నారు.

ప్రభాస్ కమిట్‌ అయిన సినిమాల్లో సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో 'స్పిరిట్‌' సినిమా ఒకటి. అర్జున్‌ రెడ్డి, యానిమల్‌ సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పర్చుకుని సినిమాలు ఇలా కూడా తీయవచ్చు అనే బెంచ్‌ మార్క్‌ ను క్రియేట్‌ చేసిన సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ రూపొందబోతోంది.

యానిమల్‌ సినిమా తర్వాత స్పిరిట్‌ సినిమా కోసం ఫ్యాన్స్ మరియు ప్రేక్షకుల ఎదురు చూపులు ఎక్కువ అయ్యాయి. ఏ సినిమా క్రేజ్‌ అంతకంతకు పెరుగుతూ ఉంటుందో ఆ సినిమా పై పుకార్లు విపరీతంగా పుట్టుకురావడం ఈ మధ్య కాలంలో చాలా కామన్ గా మారింది.

ఇప్పుడు స్పిరిట్‌ సినిమా గురించి పుకార్లు పెద్ద ఎత్తున షికార్లు చేస్తూ ఉన్నాయి. ఆ మధ్య స్పిరిట్ కథ గురించి ప్రచారం జరుగగా మొన్నటికి మొన్న హీరోయిన్‌ ఫిక్స్ అంటూ వార్తలు వచ్చాయి. ఇప్పటి వరకు దర్శకుడు స్క్రిప్ట్‌ వర్క్ లోనే ఉన్నాడు.

నటీ నటుల ఎంపిక విషయంలో కనీసం చర్చలు కూడా జరపలేదు. ప్రభాస్ హీరోగా నటిస్తున్నాడు.. అంతకు మించి ఏ ఒక్క నటుడిని కానీ నటిని కానీ ఎంపిక చేయలేదు అంటూ సమాచారం అందుతుంది. స్పిరిట్ గురించి ముందు ముందు మరెన్ని ఫేక్‌ న్యూస్ వినాల్సి వస్తుందో...!