Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్ యానిమ‌ల్ పోలీస్?

సందీప్ వంగా త‌దుపరి ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా 'స్పిరిట్' చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నాడు. ఈ సినిమాలో ప్ర‌భాస్ ని అత‌డు ఎలా చూపించ‌బోతున్నాడు?

By:  Tupaki Desk   |   29 Feb 2024 4:38 AM GMT
ప్ర‌భాస్ యానిమ‌ల్ పోలీస్?
X

అర్జున్ రెడ్డి, క‌బీర్ సింగ్, యానిమ‌ల్ చిత్రాల‌తో హ్యాట్రిక్ విజ‌యాల్ని అందుకున్నాడు సందీప్ వంగా. యానిమ‌ల్ చిత్రం దాదాపు రూ. 915 కోట్లు వ‌సూలు చేయ‌డం ఒక సంచ‌ల‌నం. బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణ‌బీర్ క‌పూర్ త‌న కెరీర్ లో ఆశించిన గొప్ప బ‌హుభాషా విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్నాడు. తాజా విజ‌యం నేప‌థ్యంలో సందీప్ వంగా పాన్ ఇండియ‌న్ డైరెక్ట‌ర్ల జాబితాలో చేరాడు. ఇప్పుడు జ‌నం దృష్టి అత‌డిపైనే. సందీప్ తెర‌కెక్కించే త‌దుప‌రి చిత్రంపైనే స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది.

సందీప్ వంగా త‌దుపరి ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా 'స్పిరిట్' చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నాడు. ఈ సినిమాలో ప్ర‌భాస్ ని అత‌డు ఎలా చూపించ‌బోతున్నాడు? అంటూ అభిమానుల్లో చ‌ర్చ సాగుతోంది. అర్జున్ రెడ్డిని డ్ర‌గ్ అడిక్ట్ అయిన ప్రేమికుడిగా చూపించాడు. దీనికి రీమేక్ అయిన 'క‌బీర్ సింగ్' లో షాహిద్ పాత్ర సేమ్ రిపీట్. త‌ర్వాత యానిమల్ లో తండ్రి ప్రేమ‌కు దూర‌మై ఆవేద‌న చెందేవాడిగా, తండ్రి అంటే చ‌చ్చేంత ప్రేమ ఉన్న‌వాడిగా ర‌ణ‌బీర్ ని చూపించాడు. తండ్రి కోసం గూండా రాజ్ గా మారే కొడుకు క‌థ‌ను చూపించాడు.

అయితే సందీప్ వంగా ఎలివేట్ చేసే హీరోయిజంపై మొద‌టి నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు ఉన్నాయి. స్త్రీద్వేషం, విష‌పూరిత ఆలోచ‌న‌లు, ర‌క్త‌పాతం, వేధింపులు, అత్యాచారాలు వంటి అంశాలు విమ‌ర్శ‌ల‌కు తావిచ్చాయి. అయితే ఇప్పుడు త‌దుప‌రి చిత్రంలో ప్ర‌భాస్ పాత్ర‌ను ఎలా చూపించ‌బోతున్నాడు? అంటే.... ఇప్ప‌టివ‌ర‌కూ త‌న సినిమాల్లో క్రైమ్ చేసే హీరోలు, గూండాల‌ను చూపించాడు వంగా.. వారిని ఎదుర్కొనే స‌రైన పోలీస్ ఒక్క‌డూ క‌నిపించ‌డు. పోలీస్ వ్య‌వ‌స్థ ఏమీ చేయ‌దు అన్న‌ట్టుగానే ఉంటాయి అత‌డి సినిమాలు. యానిమ‌ల్ దీనికి అతీతంగా లేదు. కానీ ఇప్పుడు స్పిరిట్ లో పోలీస్ పాత్ర‌ను చూపించ‌బోతున్నాడు.. ఈ సినిమా టేకింగ్ ఎలా ఉంటుందో, ప్ర‌భాస్ పాత్ర ఎలా ఉంటుదో చూడాలన్న ఉత్కంఠ నెల‌కొంది. ఒక ఎదురేలేని యారొగెంట్ పోలీస్ ని ఇంటెన్స్ పోలీస్ ని చూపిస్తాడా? లేదా యానిమ‌ల్ లా క్రూరంగా ఉండే పోలీస్ ని తెర‌పై చూపించి షాక్ లిస్తాడా? అంటూ నెటిజ‌నుల్లో డిబేట్ స్టార్ట‌యింది.

బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో సందీప్ రెడ్డి వంగా ప్రభాస్‌తో స్పిరిట్ తన తదుపరి చిత్రం అని ధృవీకరించారు. ప్రస్తుతం సందీప్ స్క్రిప్ట్‌పై పని చేస్తున్నాడు. స్పిరిట్ తర్వాత మాత్రమే యానిమల్ పార్క్ పేరుతో యానిమల్‌కి సీక్వెల్ చేయ‌నున్నాడు. ఈలోగా ర‌ణ‌బీర్ త‌న త‌దుపరి చిత్రాల‌ను పూర్తి చేస్తాడు.