Begin typing your search above and press return to search.

వామ్మో సందీప్...స్పిరిట్ రేంజ్ పెంచేలా..

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ స్పిరిట్ చేయనున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   29 Sep 2023 5:30 PM GMT
వామ్మో సందీప్...స్పిరిట్ రేంజ్ పెంచేలా..
X

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ స్పిరిట్ చేయనున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా రణబీర్ కపూర్ హీరోగా యానిమల్ మూవీ చేస్తున్నారు. ఈ మూవీ డిసెంబర్ లో రిలీజ్ కానుంది. రష్మిక మందన ఈ చిత్రంలో రణబీర్ కపూర్ కి జోడీగా నటిస్తోంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో యానిమల్ తెరకెక్కుతోంది.

తాజాగా ఈ మూవీ టీజర్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. కథ ఏంటి అనేది టీజర్ లోనే చాలా వరకు దర్శకుడు సందీప్ రెడ్డి క్లారిటీ ఇచ్చేశాడు. అలాగే మూవీలో మోస్ట్ వైలెంట్ మెన్ గా రణబీర్ కపూర్ ని రిప్రజెంట్ చేశారు. తండ్రి ఎంతగా దండించిన అతనిని విపరీతంగా ప్రేమించే కొడుకుగా రణబీర్ కపూర్ పాత్ర ఉంది. అలాంటి తండ్రి కోసం అమాయకంగా ఉండే కొడుకు యానిమల్ గా ఎలా మారాడు అనేది కథ టూకీగా ఉంది. టీజర్ లో రణబీర్ కపూర్ ని రెండు భిన్నమైన షేడ్స్ లో ఆవిష్కరించారు.

చెడు వెతుక్కుంటూ వెళ్ళా. ఎక్కడా కనిపించలేదు. చివరికి నాలోనే కనిపించింది అంటూ సాగే డైలాగ్ హీరో క్యారెక్టర్ ని ఎంత వైలెంట్ గా డిజైన్ చేసాడో ఆవిష్కరిస్తోంది. సందీప్ రెడ్డి వంగా అర్జున్ రెడ్డి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. అందులో విజయ్ దేవరకొండని వైలెంట్ గా చూపించాడు. వైలెంట్ ఆలోచనలు ఉండే హీరో లవ్ ఫెయిల్యూర్ అయితే ఎలా రియాక్ట్ అయ్యాడో ఆవిష్కరించారు.

ఇందులో అదే సెంటిమెంట్ తండ్రి కొడుకుల మీదకి తీసుకొచ్చి, తండ్రి జీవితంలో జరిగిన అన్యాయానికి కొడుకు ఇంకా ఎక్కువ వైలెంట్ కావడం చూపించాడు. ఇప్పుడు మూడో సినిమాగా ప్రభాస్ తో చేయబోయే చిత్రంలో అతన్ని ఇంకెంత వైలెంట్ గా ఆవిష్కరిస్తాడో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

హీరోయిజంలో ఎంత ఎక్కువ వయొలెన్స్ ఉంటే ఆడియన్స్ అంత బలంగా కనెక్ట్ అవుతారనే విధంగా సందీప్ రెడ్డి మొదటి, రెండు సినిమాలు ఉన్నాయి. యానిమల్ టీజర్ కారణంగా నెక్స్ట్ చేయబోయే స్పిరిట్ మీద కూడా అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.