Begin typing your search above and press return to search.

'స్పిరిట్' ప‌వ‌ర్ ఫుల్ డ్ర‌గ్ లా మ‌త్తెక్కించే కంటెంట్!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా సందీప్ రెడ్డి వంగ ద‌ర్శ‌క‌త్వంలో `స్పిరిట్` తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   10 Sep 2023 9:30 AM GMT
స్పిరిట్ ప‌వ‌ర్ ఫుల్ డ్ర‌గ్ లా మ‌త్తెక్కించే కంటెంట్!
X

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా సందీప్ రెడ్డి వంగ ద‌ర్శ‌క‌త్వంలో `స్పిరిట్` తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. `ప్రాజెక్ట్ -కె`..`స‌లార్` నుంచి పూర్తికాగానే డార్లింగ్ ఈ చిత్రాన్నే సెట్స్ పైకి తీసుకెళ్ల‌ను న్నారు. అటు సందీప్ కూడా బాలీవుడ్ లో తెరకెక్కిస్తోన్న `యానిమ‌ల్` షూట్ నుంచి కూడా ఫ్రీ అయిపోతున్నాడు. డార్లింగ్ ప‌క్కాగా డేట్ల‌పై క్లారిటీ ఇస్తే రంగంలోకి దూకేస్తారు. ఇది సరికొత్త యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ అని ఇప్ప‌టికే రివీల్ చేసారు.

తాజాగా ఈ సినిమా గురించి మర‌న్ని లోతైన విష‌యాలు తెలుస్తున్నాయి. ఇది డ్ర‌గ్ లా యువ‌త‌కి మ‌త్తెక్కించే స్టోరీ అట‌. ప‌వ‌ర్ ఫుల్ డ్ర‌గ్ లాంటికంటెంట్ ఇందులో ఉందిట‌. డ్ర‌గ్స్ లో అత్యుత్త‌మ క్వాలిటీ డ్ర‌గ్ తీసుకుంటే ఎలా ఉంటుందో? ఈ సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్ష‌కుల‌కు అలాంటి అనుభూతే క‌లుగుతుందిట‌. చాలా బ‌ల‌మైన క‌థ‌ని స్పిరిట్ ద్వారా చెబుతున్న‌ట్లు సందీప్ తెలిపాడు.

ఆ మ‌త్తు నుంచి ప్రేక్ష‌కుడు తేరుకోవ‌డానికి చాలా స‌మ‌యం ప‌డుతుంతుందిట‌. థియేట‌ర్ నుంచి బ‌య‌ట కు వెళ్లేట‌ప్పుడు సినిమా చూసి వ‌స్తున్నామా? మ‌రే ప‌నికైనా వెళ్లి వ‌స్తున్నామా? అన్న రేంజ్ లో సినిమా ఆక‌ట్టుకుంటుంద‌ని అంటున్నాడు. ఈ నేప‌థ్యంలో ప్రభాస్ పాత్ర మాస్ గా ఉంటుందా? అని చ‌ర్చ మొద‌లైంది. ఇందులో హీరో డ్ర‌గ్స్ కి బానిసైన‌ట్లు చూపించ‌బోతున్నారు అన్న హిట్ అందింది.

మ‌రి ఈ సినిమా నిజంగా మ‌త్తెక్కిస్తుందా? మైకంలో ముంచేస్తుందా? అన్న‌ది ప్రేక్ష‌కులు రిలీజ్ త‌ర్వాత తేలుస్తారు. ప్ర‌స్తుతం సందీప్ రెడ్డి యానిమ‌ల్ తో బిజీగా ఉన్నారు. ఇందులో ర‌ణ‌బీర్ క‌పూర్ హీరోగా న‌టిస్తున్నాడు. ఇది భారీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ . సినిమాపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. ఇప్ప‌టికే క‌బీర్ సింగ్ హిట్ తో అక్క‌డా సందీప్ రెడ్డి త‌న మార్క్ వేసాడు. తొలి సినిమాతోనే భారీ విజ‌యం అందుకుని ర‌ణ‌బీర్ తో సినిమా చేసే స్థాయికి..టాలీవుడ్ లో మ‌హేష్‌..బ‌న్నీ..రామ్ చ‌ర‌ణ్ లాంటి స్టార్లు క్యూలో నుంచునేలా చేసాడు.