Begin typing your search above and press return to search.

స్పిరిట్.. చిన్న లీక్స్ తోనే హైప్ ఎక్కిస్తున్నారుగా

అతని క్యారెక్టర్ చాలా కొత్తగా ఉండబోతోందని స్పష్టం చేశారు. అర్జున్ రెడ్డి, యానిమల్ కి భిన్నంగా ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని అన్నారు.

By:  Tupaki Desk   |   28 Dec 2023 12:30 AM GMT
స్పిరిట్.. చిన్న లీక్స్ తోనే హైప్ ఎక్కిస్తున్నారుగా
X

యానిమల్ మూవీతో సూపర్ సక్సెస్ అందుకున్న సందీప్ రెడ్డి వంగా నెక్స్ట్ ప్రభాస్ హీరోగా స్పిరిట్ మూవీని సెట్స్ పైకి తీసుకొని వెళ్లనున్నాడు. ఈ సినిమాకి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే సందీప్ స్టార్ట్ చేశారని తెలుస్తోంది. టి-సిరీస్, సందీప్ రెడ్డి వంగా అన్న ప్రణయ్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తోనే మూవీ తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.

వచ్చే ఏడాది ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుందని కూడా ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉంటే తాజాగా సందీప్ రెడ్డి అన్నయ్య నిర్మాత ప్రణయ్ రెడ్డి ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. స్పిరిట్ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా యాంగ్రీ యంగ్ మెన్ రోల్ లో కనిపిస్తాడని తెలియజేశారు.

అతని క్యారెక్టర్ చాలా కొత్తగా ఉండబోతోందని స్పష్టం చేశారు. అర్జున్ రెడ్డి, యానిమల్ కి భిన్నంగా ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని అన్నారు. మూవీకి సంబంధించి ఇప్పటి వరకు హీరో మాత్రమే ఖరారయ్యారని, స్టొరీ కంప్లీట్ అయిన తర్వాత ఇతర క్యాస్టింగ్ అండ్ క్రూ గురించి ఆలోచిస్తామని అన్నారు.

ఈ సినిమాకి సంబందించిన పనులు ఆరు నెలల్లో పూర్తిస్థాయిలో స్టార్ట్ అవుతాయని తెలిపారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ చేసిన సలార్ మూవీ అద్భుతంగా ఉందని, ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొడుతుందని అన్నారు. ప్రభాస్ తన కెరియర్ లో మొదటిసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో స్పిరిట్ లో చేయబోతూ ఉండటం ఫ్యాన్స్ లో కూడా క్యూరియాసిటీ నెలకొని ఉంది.

ఇప్పటికే అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో సందీప్ రెడ్డి వంగా స్టైల్ పై ఆడియన్స్ కి ఒక క్లారిటీ వచ్చేసింది. ఈ నేపథ్యంలో స్పిరిట్ మూవీపైన అంచనాలు నెక్స్ట్ లెవల్ లో ఉంటాయని కచ్చితంగా చెప్పొచ్చు. మరి ఆ అంచనాలని సందీప్ రెడ్డి వంగా అందుకొని ఏ స్థాయి సక్సెస్ ని ప్రభాస్ కి ఇస్తాడనేది వేచి చూడాలి.