Begin typing your search above and press return to search.

ప్రభాస్ స్పిరిట్ ఆరు నెలల టార్గెట్..!

ముఖ్యంగా ప్రభాస్ రేంజ్ కి తగిన సరైన కథ పడితే బాక్సాఫీస్ షేక్ చేయడం పక్కా.. అలాంటి కథతోనే స్పిరిట్ రాబోతుందని అంటున్నారు.

By:  Tupaki Desk   |   8 Sep 2023 6:52 AM GMT
ప్రభాస్ స్పిరిట్ ఆరు నెలల టార్గెట్..!
X

సలార్ పార్ట్ 1 పూర్తి చేసిన ప్రభాస్ ప్రస్తుతం కల్కి, మారుతి సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్నాడు. మారుతి సినిమా దాదాపు చివరి దశకు వచ్చిందని టాక్. ఈ సినిమాల తర్వాత సందీప్ వంగతో స్పిరిట్ సినిమా లైన్ లో ఉంది. ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది. యానిమల్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉన్న సందీప్ స్పిరిట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టాడని టాక్. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారట.

అర్జున్ రెడ్డి సినిమాతో దేశం మొత్తం సంచలనం సృష్టించిన సందీప్ వంగా యానిమల్ టీజర్ తోనే అదుర్స్ అనిపించాడు. ఇక ఇప్పుడు ప్రభాస్ తో స్పిరిట్ అంటూ మరో సంచలనానికి సిద్ధమయ్యాడు. ప్రభాస్ స్పిరిట్ కోసం సందీప్ వంగా కు ఆరు నెలలు టార్గెట్ పెట్టినట్టు తెలుస్తుంది.

ప్రీ ప్రొడక్షన్ వర్క్ కి ఎంత టైం అయినా తీసుకో కానీ సినిమా మాత్రం 6 నెలల్లో పూర్తి చేయాలని కండీషన్ పెట్టాడట. ఈ ఇయర్ ఎండింగ్ కు మొదలు పెట్టి నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ కి సినిమా రిలీజ్ చేయాలని ప్రభాస్ అనుకుంటున్నాడట.

ప్రభాస్ స్పిరిట్ నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్ రిలీజ్ ఉంటుందని చెప్పొచ్చు. అసలు స్పిరిట్ కథ ఏంటి.. అసలే డాక్టర్ బ్యాక్ నేపథ్యం నుంచి వచ్చిన సందీప్ ప్రభాస్ ని ఎలా చూపించాలని అనుకుంటున్నాడు లాంటి విషయాలు రెబల్ స్టార్ ఫ్యాన్స్ ని సూపర్ ఎగ్జైట్ అయ్యేలా చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రభాస్ రేంజ్ కి తగిన సరైన కథ పడితే బాక్సాఫీస్ షేక్ చేయడం పక్కా.. అలాంటి కథతోనే స్పిరిట్ రాబోతుందని అంటున్నారు.

స్పిరిట్ సినిమాలో మిగతా కాస్టింగ్ ఎవరు.. సినిమాకు మ్యూజిక్ ఎవరు అందిస్తున్నారు అన్నది కొద్ది రోజుల్లో తెలుస్తుంది. స్పిరిట్ తర్వాత ప్రభాస్ అల్లు అర్జున్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. స్పిరిట్ తో భారీ టార్గెట్ తోనే రంగంలోకి దిగుతున్నాడు.

క్రేజీ కాంబోగా రాబోతున్న ఈ సినిమా తప్పకుండా ఫ్యాన్స్ అంచనాలనే కాదు సినీ లవర్స్ అందరినీ సర్ ప్రైజ్ చేసేలా ఉంటుందని చెప్పుకుంటున్నారు. కల్కి మారుతి సినిమాతో పాటుగా ప్రభాస్ స్పిరిట్ కూడా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ ఉండొచ్చు ఒకవేళ 2025 సంక్రాంతికి వచ్చే అవకాశం ఉంది. ప్రభాస్ సినిమాల లైనప్ మాత్రం ఫ్యాన్స్ కి సూపర్ జోష్ అందిస్తుంది.