Begin typing your search above and press return to search.

ఇద్ద‌రిలో ఇప్పుడెవ‌రు మారాలి?

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ తో సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్' చిత్రానికి స‌న్నాహాలు జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   19 Jan 2024 6:46 AM GMT
ఇద్ద‌రిలో ఇప్పుడెవ‌రు మారాలి?
X

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ తో సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్' చిత్రానికి స‌న్నాహాలు జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే 'స‌లార్' విజ‌యంతో డార్లింగ్ మ‌ళ్లీ ఫామ్ లోకి వ‌చ్చేసాడు. అటు సందీప్ వంగా వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్నాడు. ఇటీవ‌లే 'యానిమ‌ల్' తో భారీ స‌క్సెస్ ఖాతాలో వేసుకున్నాడు. దీంతో ఈ కాంబినేష‌న్ పై అంచ‌నాలు అంత‌కంత‌కు పెరిగిపోతున్నాయి. ఇంత‌వ‌ర‌కూ బాగానే ఉంది.

మ‌రి వీరిద్దిలో మారెదెవ‌రు? ఎవ‌రూ రాజీ ప‌డాల్సి ఉంటుంది? అంటే చాలా ఇంట్రెస్టింగ్ విష‌యాలే తెలుస్తున్నాయి. ప్ర‌భాస్ ఒకేసారి రెండు..మూడు సినిమా షూటింగ్ లు చేస్తుంటాడు. రెండేళ్ల కాలంగా డార్లింగ్ ఇదే ప‌ద్ద‌తిలో సినిమాలు చేస్తున్నాడు.ఎంత భారీ బ‌డ్జెట్ సినిమాలైనా డేట్లు ప‌రంగా ఎక్క‌డా క్లాష్ కాకుండా షూటింగ్ లు పూర్తి చేస్తున్నాడు. గ‌త ఏడాది ఒకేసారి మూడు సినిమా షూటింగ్ లు పూర్తి చేసాడు అంటే? ఎంత ప్లానింగ్ తో వెళ్లాడో అర్దం చేసుకోవ‌చ్చు. అందుకు ద‌ర్శ‌కులు కూడా అలాగే స‌హ‌క‌రిం చ‌డంతో ఎక్క‌డా క్లాష్ జ‌ర‌గ‌లేదు. తాను అనుకున్న ప్లానింగ్ ప్ర‌కారం చిత్రీక‌ర‌ణ‌లు పూర్తి చేయ‌గ‌లిగాడు.

మ‌రి సందీప్ స్పిరిట్ ని కూడా అలా పూర్తి చేయ‌డం సాధ్య‌మేనా? అన్న‌ది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. ఎందుకంటే సందీప్ సినిమా షూటింగ్ అంటే? సంవ‌త్స‌రాలు సాగుతుంది. అర్జున్ రెడ్డి మొద‌లు పెట్టి పూర్తి చేసి రిలీజ్ చేయ‌డానికి చాలా స‌మ‌యం తీసుకున్నాడు. అదే సినిమాని మ‌ళ్లీ బాలీవుడ్ లో రీమేక్ చేయ‌డానికి చాలా స‌మ‌యం కేటాయించాడు. అటుపై యాన‌మిల్ కోసం ఏకంగా నాలుగేళ్లు కేటాయిం చాడు. ఇప్ప‌టివ‌ర‌కూ ఇలా కూల్ గా త‌న సినిమా షూట్లు అన్ని పూర్తి చేసుకుంటూ వ‌చ్చాడు.

కానీ ప్ర‌భాస్ తో అలాంటి వెసులు బాటు దొరుకుతుందా? అన్న‌ది ఆస‌క్తిక‌రం. సాధార‌ణంగా అయితే సాధ్య‌మ‌య్యే ప‌నికాదు. డార్లింగ్ ఒకేసారి మూడు సినిమాలు పూర్తి చేస్తాడు కాబ‌ట్టి..ఒక సినిమా కోసమే రెండు..మూడేళ్లు కేటాయించ‌డం అంటే చాలా న‌ష్టం ఎదుర‌వుతుంది. త‌న ఆదాయం బాగా త‌గ్గిపోయే అవ‌కాశం ఉంది. చాలా మంది ద‌ర్శ‌కుల్ని వెయిట్ చేయాల్సి వ‌స్తుంది. ఇది ప్ర‌భాస్ నుంచి చూడాల్సిన కోణం..మ‌రి సందీప్ నుంచి చూస్తే! అంద‌కు పూర్తి కాంట్రాస్ట్ గా క‌నిపిస్తుంది.

సందీప్ సినిమా అంటే హీరోలు కూడా ఎక్కువ‌గానే డేట్లు కేటాయించాలి. సినిమా పూర్త‌య్యే అవ‌ర‌కూ అత‌నికి బాండ్ అయి ప‌నిచేయాల్సి ఉంటుంది. ఇంత‌వ‌ర‌కూ సందీప్ తో ప‌నిచేసిన విజయ్ దేవ‌ర‌కొండ‌.. షాహిద్ క‌పూర్...ర‌ణ‌బీర్ క‌పూర్ అలాగే ప‌నిచేసారు. ఓ సినిమా మొద‌లు పెడితే దాన్ని పూర్తి చేయ‌డానికి సందీప్ చాలా స‌మ‌యం తీసుకుంటాడు. మ‌రి డార్లింగ్ సదీప్ దారిలోకి వెళ్తాడా? త‌న దారిలోకి సందీప్ ని తెచ్చుకుంటాడా? అన్న‌ది చూడాలి.