Begin typing your search above and press return to search.

'స‌లార్' ఫ్యాన్స్‌ని టీజ్ చేసిన ప్ర‌శాంత్ నీల్ భార్య‌

ఆదిపురుష్ ప‌రాజయం త‌ర్వాత‌ ప్రభాస్ హోప్స్ అన్నీ 'స‌లార్' పైనే. రాధేశ్యామ్-ఆదిపురుష్ ప‌రాజ‌యాల త‌ర్వాత గ్రేట్ కంబ్యాక్ కోసం అత‌డు ఎదురు చూస్తున్నాడు

By:  Tupaki Desk   |   19 Nov 2023 8:20 AM GMT
స‌లార్ ఫ్యాన్స్‌ని టీజ్ చేసిన ప్ర‌శాంత్ నీల్ భార్య‌
X

ఆదిపురుష్ ప‌రాజయం త‌ర్వాత‌ ప్రభాస్ హోప్స్ అన్నీ 'స‌లార్' పైనే. రాధేశ్యామ్-ఆదిపురుష్ ప‌రాజ‌యాల త‌ర్వాత గ్రేట్ కంబ్యాక్ కోసం అత‌డు ఎదురు చూస్తున్నాడు. KGF ఫ్రాంఛైజీతో సంచ‌ల‌నాలు సృష్టించిన ప్ర‌శాంత్ నీల్ తో భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ 'స‌లార్'లో అత‌డు న‌టించాడు. కేజీఎఫ్ ని మించేలా స‌లార్ ని తెర‌కెక్కించేందుకు ప్ర‌శాంత్ నీల్ రాజీ అన్న‌దే లేకుండా ప‌ని చేస్తున్నారు. ఈ సినిమా టాకీని మించి విజువ‌ల్ ఎఫెక్ట్స్- గ్రాఫిక్స్ కోసం ప‌ని చేస్తున్నార‌న్న చ‌ర్చా సాగుతోంది.


'సలార్: పార్ట్ 1 సీజ్ ఫైర్‌' 22 డిసెంబర్ 2023న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రం అన్ని భారతీయ భాషల్లో విడుద‌ల కానుంది. జ‌పనీ, చైనీ, కొరియ‌న్ భాష‌ల్లోను విడుద‌ల చేస్తార‌ని స‌మాచారం ఉంది. అయితే స‌లార్ నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ స‌రైన అప్ డేట్ లేదు. టీజ‌ర్ త‌ర్వాత మోస్ట్ అవైటెడ్ ట్రైల‌ర్ కోసం అభిమానులు క‌ళ్లు కాయ‌లు కాసేలా వేచి చూస్తున్నారు.

ట్రైలర్ 1, డిసెంబర్ 2023న రాత్రి 7:19 గంటలకు విడుదల కానుంది. ఇది ప్రభాస్ అభిమానులలో ఉత్సాహాన్ని పెంచింది. ట్రైల‌ర్ కోసం నిరీక్షిస్తున్న అభిమానుల‌ను టీజ్ చేస్తూ ఇప్పుడు ప్రశాంత్ నీల్ భార్య లిఖిత రెడ్డి నీల్ ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లాస్ట్ అయ్యే అప్‌డేట్‌ను షేర్ చేసారు. స‌లార్ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పై లిఖిత కొన్ని వివ‌రాల్ని అందించారు. రవి బస్రూర్ మ్యూజిక్ స్టూడియోలో చివరి మిక్సింగ్ సెషన్‌లు జరుగుతున్నాయని 'సలార్' ట్రైలర్‌కు తుది మెరుగులు దిద్దుతున్నామ‌ని వెల్లడించారు.

పాన్ ఇండియ‌న్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కోసం మేకర్స్ ఏం సిద్ధం చేశారో వేచి చూడాలి. టీజ‌ర్ తో బోలెడంత హైప్ వ‌చ్చింది. దానిని మ‌రో స్థాయికి చేర్చ‌డంలో ట్రైల‌ర్ స‌ఫ‌ల‌మ‌వుతుంద‌నే అంచ‌నా వేస్తున్నారు.

హోంబలే ఫిలింస్ పతాకంపై భారీ స్థాయిలో నిర్మించిన 'సలార్‌'లో జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, ఈశ్వరీరావు, టిన్ను ఆనంద్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు.