Begin typing your search above and press return to search.

'స‌లార్‌'కి స‌వాల్.. త‌గ్గేదేలే అంటున్నాడు!

ప‌ఠాన్ గ్రాండ్ స‌క్సెస్ త‌ర్వాత జవాన్ తో మ‌రో విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్న ఖాన్ ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ కొట్టాల‌న్న క‌సితో ఉన్నాడు

By:  Tupaki Desk   |   14 Oct 2023 8:35 AM GMT
స‌లార్‌కి స‌వాల్.. త‌గ్గేదేలే అంటున్నాడు!
X

ప‌ఠాన్ గ్రాండ్ స‌క్సెస్ త‌ర్వాత జవాన్ తో మ‌రో విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్న ఖాన్ ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ కొట్టాల‌న్న క‌సితో ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ గ్రాండ్ సక్సెస్ తర్వాత షారుఖ్ ఖాన్ తదుపరి చిత్రం, డుంకీ పై చాలా న‌మ్మ‌కంగా ఉన్నాడు. స‌లార్ లాంటి భారీ క్రేజ్ ఉన్న సినిమాతో పోటీప‌డుతూ డుంకీ విడుద‌ల‌ గురించి చాలా చర్చ సాగుతోంది. ప్రముఖ ద‌ర్శ‌క‌నిర్మాత రాజ్‌కుమార్ హిరాణీతో మొద‌టి సారి షారూఖ్ క‌లిసి ప‌ని చేస్తుండ‌డంతో అభిమానుల్లో స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది.

షారూఖ్‌- హిరాణీ కాంబో మూవీ 'డుంకీ' ఇప్ప‌టికే చాలాసార్లు వాయిదా పడింది. ఈ చిత్రం రిలీజ్ మ‌రోసారి ఆలస్యం అవుతుందని ప్రచారం ఉన్నా కానీ, మేకర్స్ న‌మ్మ‌కంగా క్రిస్మస్ 2023 సందర్భంగా విడుద‌ల‌ను ఆప‌బోమ‌ని నొక్కి చెబుతూనే ఉన్నారు. ''#షారూఖ్ ఖాన్ డుంకీ వాయిదా పడలేదు! షారుఖ్ ఖాన్ నటించిన చిత్రం 2023 క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది'' అని మేక‌ర్స్ మ‌రోసారి ప్ర‌క‌టించారు. దీంతో స‌లార్, ఆక్వామేన్ 2 లాంటి భారీ చిత్రాలు పోటీబ‌రిలో ఉన్నా త‌గ్గేదేలే అంటూ ఖాన్ ర‌ణ‌భేరి మోగించాడు.

వాస్తవానికి ఖాన్ మైండ్ లో చాలా కాలంగా క్రిస్మ‌స్ డేట్ లాక్ అయి ఉంది. దానిని ఇప్పుడు మార్చే ఆలోచ‌న అయితే లేదు. కేవ‌లం థియేట‌ర్ల స‌ర్ధుబాటు కోసం సామ‌ర‌స్య మార్గాన్ని అన్వేషించ‌డం త‌ప్ప వేరొక దారి లేదని షారూఖ్ ప్రిపేర‌య్యార‌ని దీనిని బ‌ట్టి అర్థం చేసుకోవాలి. గతంలో కూడా అట్లీ దర్శకత్వం వహించిన జవాన్ ప్రెస్ షో సందర్భంగా షారుఖ్ ఖాన్ చిత్రం గురించి ఓపెన‌య్యారు. త‌న స్పీచ్ లో రిపబ్లిక్ డేకి పఠాన్ .. జవాన్ జన్మాష్టమికి ఇప్పుడు క్రిస్మస్ విత్ డుంకీ అంటూ ఖాన్ ప్రస్తావించారు. ఖాన్ ఆశించిన తేదీల్లోనే త‌న సినిమాలు విడుద‌ల‌వుతున్నాయి. ఇటీవ‌లి రెండు సినిమాలు పఠాన్ - జవాన్ ల‌ ఘన విజయంతో షారుఖ్ ఖాన్ బాలీవుడ్‌లో అత్యంత డిమాండ్ ఉన్న నటుడిగా మారాడు. నిజానికి కింగ్ ఖాన్ పై అన్ని వర్గాల నుండి ప్రేమ లభిస్తోంది. ఇది డుంకీ ఉత్సాహాన్ని మరింత పెంచింది. ఇది భారతీయులు ఉపయోగించే చట్టవిరుద్ధమైన వలస టెక్నిక్ గురించిన క‌థాంశంతో రూపొందింది. డుంకీ ఫ్లైట్! అనే అంశం చుట్టూ స్టోరీ ర‌న్ అవుతుంది. తాప్సీ ఇందులో క‌థానాయిక కాగా, ఈ చిత్రంలో దియా మీర్జా, బొమన్ ఇరానీ, ధర్మేంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. బుడాపెస్ట్, యుఎఇ, కాశ్మీర్ వంటి అనేక ప్రదేశాలలో చిత్రీకరించిన డుంకీ డిసెంబర్ 21 న విడుదల కానుంది.

పోటీలో నువ్వా నేనా?

నిజానికి డుంకీ విడుద‌ల స‌మ‌యంలోనే టాలీవుడ్ నుంచి స‌లార్ లాంటి భారీ చిత్రం విడుద‌ల‌వుతోంది. ఇందులో పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టించ‌డం, కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ప్రొడ‌క్ట్ కావ‌డంతో అభిమానుల్లో ఉత్కంఠ నెల‌కొంది. క్రిస్మ‌స్ బ‌రిలో ఈ మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ కి ప్ర‌జ‌లు ప‌ట్టంగ‌డ‌తార‌ని అంతా భావిస్తున్నారు. స‌లార్ డిసెంబ‌ర్ 22న అత్యంత భారీగా విడుద‌ల కానుండ‌గా, హిందీ బెల్ట్ లోను థియేట‌ర్ల ప‌రంగా 'డుంకీ'తో పోటీ త‌ప్ప‌డం లేదు.

అయితే ఈ రెండు సినిమాల‌ను ఢీకొడుతూ మ‌ల్టీప్లెక్సుల్లో హ‌వా సాగించ‌డానికి ఆక్వామేన్ సీక్వెల్ 22 డిసెంబ‌ర్ కోసం రెడీ అవుతుండ‌డంతో స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. ఇక ఈ సినిమాల‌తో పాటు నాని న‌టించిన హాయ్ నాన్న డిసెంబ‌ర్ 21న విడుద‌ల‌వుతోంది. అయితే రెండు పెద్ద సినిమాల రిలీజ్ ల‌కు ముందు హాయ్ నాన్న చిత్రాన్ని విడుద‌ల చేయ‌డం గ‌ట్సీ డెసిష‌న్ అని చెప్పాలి. ఈ సినిమాతో పాటు 'హ‌రోంహ‌ర' అనే మ‌రో సినిమా డిసెంబ‌ర్ 22న విడుద‌ల‌వుతోంది.