Begin typing your search above and press return to search.

సలార్ కోసం.. ఓ కొత్త ప్లాన్

అయితే తాజాగా మరో టాక్ కూడా వినిపిస్తోంది. సలార్ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కూడా పెట్టాలని డిసైడ్ అయ్యారంట

By:  Tupaki Desk   |   20 Sep 2023 4:50 AM GMT
సలార్ కోసం.. ఓ కొత్త ప్లాన్
X

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా సలార్. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా చిత్రంగా సిద్ధమవుతోన్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ నెల 28న రిలీజ్ కావాల్సి ఉన్న అవుట్ ఫుట్ సంతృప్తికరంగా రాకపోవడంతో వాయిదా వేశారు. విఎఫ్ఎక్స్ వర్క్ క్వాలిటీ లేకపోవడం ఈ వాయిదాకి కారణం అని తెలుస్తోంది.

అయితే తాజాగా మరో టాక్ కూడా వినిపిస్తోంది. సలార్ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కూడా పెట్టాలని డిసైడ్ అయ్యారంట. ఆ సాంగ్ కోసం ఐశ్వర్యరాయ్ లేదా త్రిషలో ఒకరిని తీసుకోవాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉందంట. డాన్స్ బేస్డ్ గా ఉండే ఈ సాంగ్ లో ప్రభాస్ కూడా పాల్గొనాల్సి ఉంటుంది. కానీ అతని మోకాలి గాయం కారణంగా సాధ్యం కాలేదు. ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకొని రెస్ట్ తీసుకుంటున్నారు.

త్వరలో పూర్తిగా రికవరీ అయ్యి వస్తారు. దీంతో ప్రభాస్ రికవరీ అయిన వెంటనే ఈ సాంగ్ షూట్ చేయాలని అనుకుంటున్నారంట. గ్రాండ్ గా ఈ స్పెషల్ సాంగ్ ని తెరకెక్కించాలని ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నారంట. ఈ సాంగ్ షూటింగ్ కూడా పూర్తయితే అప్పుడు రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసే అవకాశం ఉందని టాలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తోన్న మాట. ఇప్పటికే ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

ఈ స్పెషల్ సాంగ్ కూడా ఉంటే సినిమాని మరింత బూస్టింగ్ దొరికే ఛాన్స్ ఉంటుంది. డార్లింగ్ అభిమానులు సలార్ రిలీజ్ కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే బిజినెస్ డీల్స్ కూడా క్లోజ్ అయిపోయాయి. అయితే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఇంకా బెస్ట్ క్వాలిటీ కోసం ప్రశాంత్ నీల్ ఎదురుచూస్తున్నారు.

ఈ మూవీ నవంబర్, డిసెంబర్ లలో ఏదో ఒక డేట్ ఫిక్స్ చేసుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఒక వేళ సాధ్యం కాకపోతే సంక్రాంతి టైంలో కూడా రిలీజ్ చేస్తేఎలా ఉంటుందో ఆలోచిస్తున్నారని తెలుస్తోంది.