Begin typing your search above and press return to search.

సలార్.. అప్పటి వరకు ఇక మౌనవ్రతమే..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ సలార్. ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది

By:  Tupaki Desk   |   12 Sep 2023 4:34 AM GMT
సలార్.. అప్పటి వరకు ఇక మౌనవ్రతమే..
X

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ సలార్. ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాని సెప్టెంబర్ 28న రిలీజ్ చేయాల్సి ఉంది. అయితే విఎఫ్ఎక్స్ వర్క్ కంప్లీట్ కాకపోవడంతో వాయిదా వేశారు. ఈ విషయంపై ఇప్పటికే స్పష్టత వచ్చేసింది. అయితే ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశం ఉందనేదానిపై ఎలాంటి క్లారిటీ లేదు.

నవంబర్ లేదా డిసెంబర్ నెలల్లో డేట్ చూసుకొని రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. అయితే సలార్ ఆ టైంలో రిలీజ్ అయితే మాత్రం ఎప్పటి నుంచో క్రిస్మస్ కోసం వెయిట్ చేస్తున్న సినిమాలు వాయిదా వేసుకోవాల్సిందే అనే మాట వినిపిస్తోంది. హిందీ పరిశ్రమలో కూడా సలార్ కి పోటీగా అంటే కష్టపడాల్సిందే.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగున్న నేపథ్యంలో అప్పడే డేట్ ఎనౌన్స్ చేస్తే కరెక్ట్ గా ఉండదని భావించి లేట్ చేస్తున్నారంట. ఒక నెల రోజులు ఆగిన తర్వాత టైం చూసుకొని మరోసారి అఫీషియల్ గా రిలీజ్ డేట్ ప్రకటించాలని ప్రశాంత్ నీల్ భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. డార్లింగ్ అభిమానులు మాత్రం సలార్ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నారు. సెప్టెంబర్ 28న రిలీజ్ అవుతుందని చాలా ఆశ పడ్డారు.

అయితే వాయిదా పడటంతో కొంత నిరాశకి గురైన ఆదిపురుష్, రాధేశ్యామ్ లాంటి రిజల్ట్ రాకుండా బ్లాక్ బస్టర్ కావాలని, దానికోసం ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తామని అంటున్నారు. ప్రశాంత్ నీల్ కూడా అవుట్ పుట్ విషయంలో సంతృప్తికరంగా లేకపోవడం వలనే వాయిదా వేసినట్లు తెలుస్తోంది. బిజినెస్ డీల్స్ అయితే ఇప్పటికే అన్ని భాషలలో కంప్లీట్ అయిపోయాయి.

రిలీజ్ ఎప్పుడైనా సలార్ మూవీ కచ్చితంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమాపై ఉన్న హైప్ కారణంగా ఆదిపురుష్ కంటే మంచి ఓపెనింగ్స్ వస్తాయని సినీ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. అలాగే టాలీవుడ్ కి కూడా సలార్ తో ఈ ఏడాది వెయ్యి కోట్ల కలెక్షన్స్ మూవీ ఒకటి పడనుందని భావిస్తున్నారు.