Begin typing your search above and press return to search.

'సలార్'​ మూవీటీమ్​ డేరింగ్ డెసిషన్​.. అవేమి ఉండవట

సాధారణంగా ఓ బడా హీరో సినిమా వస్తుందంటే ప్రమోషన్స్​ ఎలా ఉండాలి. మోత మోగిపోవాలి. వరుస అప్డేట్లు, ఇంటర్వ్యూలు, ఈవెంట్లతో షేక్ అవ్వాలి

By:  Tupaki Desk   |   31 Aug 2023 10:29 AM GMT
సలార్​ మూవీటీమ్​ డేరింగ్ డెసిషన్​.. అవేమి ఉండవట
X

సాధారణంగా ఓ బడా హీరో సినిమా వస్తుందంటే ప్రమోషన్స్​ ఎలా ఉండాలి. మోత మోగిపోవాలి. వరుస అప్డేట్లు, ఇంటర్వ్యూలు, ఈవెంట్లతో షేక్ అవ్వాలి. కానీ ఇవేమీ.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ సినిమా 'సలార్' విషయంలో కనపడట్లేదు. మరో 27 రోజుల్లో మూవీ వరల్డ్​ వైడ్​గా రిలీజ్ కానుంది. అయితే మూవీటీమ్​ టీమ్​ మాత్రం చడి చప్పుడు చేయట్లేదు. మౌనం పాటిస్తూ అభిమానులకు నిరుత్సాహ పరుస్తోంది.

కానీ ఓవర్సీస్​లో మాత్రం ఈ సినిమా డప్పులు మోగిస్తోంది. యూఎస్​ బాక్సాఫీస్​ ముందు ప్రమోషన్స్​ మంచిగా జరుగుతూ.. బుకింగ్స్​ కూడా ఓపెన్​ అయిపోయాయి. కానీ ఇక్కడ మాత్రం ఇప్పటి వరకు ఈ సినిమా గురించి సరిగ్గా ఒక్క అప్డేట్​ రాలేదు. టీజర్‌ను మాత్రం సైలెంట్​గా విడుదల చేసి చేతులు కట్టేసుకుని కూర్చున్నారు. అప్పటి నుంచి ఎటువంటి హడావుడి చేయలేదు.

అయితే తాజాగా ఈ సినిమా గురించి మరో షాకింగ్ విషయం తెలిసింది. సలార్ మేకర్స్​.. ఇతర ఏ మూవీటీమ్స్​ తీసుకని సాహసమైన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందింది. అదేంటంటే ప్రచారంలో ఉన్నట్టుగానే ఈ సినిమాకు ఎటువంటి ప్రమోషన్స్​ చేయరట. ఈవెంట్లు కూడా నిర్వహించరట.

ప్రమోషన్స్​ లేకుండానే సింపుల్​గా మూవీ రిలీజ్​ లోపు ముందుగా ట్రైలర్​ను విడుదల చేస్తారట. ఆ తర్వాత ఒకటి లేదా రెండు సాంగ్స్​ను మాత్రమే రిలీజ్​ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారట. అయితే ఇలా చేయడానికి ఓ బలమైన కారణం ఉందట. అదే కాన్ఫీడెంట్. ఇప్పటికే రిలీజైన టీజర్​ గూస్​ బంప్స్​ తెప్పించిన సంగతి తెలిసిందే. సినిమాపై వరల్డ్ వైడ్​గా మంచి హైప్ క్రియేట్ అయింది.

దర్శకుడు ప్రశాంత్ నీల్​, ప్రభాస్​, నిర్మాతలు కూడా తమ సినిమా ఔట్​పుట్​పై భారీ నమ్మకంతో ఉన్నారట. సినిమా హిట్​ అవ్వడం పక్కా అని ధీమాగా ఉన్నారని తెలిసింది. అందుకే ఎటువంటి ప్రమోషన్స్​, ఈవెంట్లు లేకుండా సినిమాను డైరెక్ట్ రిలీజ్​ చేసే సాహసం చేసేందుకు సిద్ధమయ్యారని సమాచారం అందింది. చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్​ను అందుకుంటుందో..