Begin typing your search above and press return to search.

సలార్ షాకింగ్ న్యూస్​.. సినిమాలో అవేవి ఉండవట

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ సినిమా 'సలార్' మరో నలభై రోజుల్లో విడుదల కానుంది

By:  Tupaki Desk   |   17 Aug 2023 7:51 AM GMT
సలార్ షాకింగ్ న్యూస్​.. సినిమాలో అవేవి ఉండవట
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ సినిమా 'సలార్' మరో నలభై రోజుల్లో విడుదల కానుంది. అయితే మూవీటీమ్​ టీమ్​ మాత్రం చడి చప్పుడు చేయట్లేదు. కేజీయఫ్​ 2కు భారీ హడావుడి చేసిన ఈ సినిమా మూవీటీమ్​, నిర్మాణ సంస్థ.. సలార్​కు ఎందుకిలా మౌనం వహిస్తుందో అర్థం కావట్లేదు. అయితే తాజాగా ఈ సినిమా గురించి షాకింగ్ వార్త అందింది. ఈ సినిమాలో పాటలు ఉండవని తెలిసింది.

కేజీయఫ్​​ 2లో పాటలు కూడా ఎంతో హైలైట్​గా నిలిచిన సంగతి తెలిసిందే. హీరో ఎలివేషన్ సాంగ్​, అమ్మ సాంగ్​ శ్రోతలను, ఆడియెన్స్​ను బాగా ఆకట్టుకున్నాయి. సినిమా సక్సెస్ కావడంలో అవి కూడా ఎంతో కీలక పాత్ర పోషించాయి. అయితే ఇప్పుడు సలార్​ మాత్రం అలా సాంగ్స్ ఉండవట. కేవలం ఒకటే మెయిన్​ సాంగ్​ ఉంటుందని తెలిసింది.

మరోవైపు ఆ మెయిన్​ సాంగ్​.. కేజీయఫ్ తరహాలో అమ్మ సెంటిమెంట్​లా పాట సాగుతుందని​ అంటున్నారు. కేవలం మూడు బిట్ సాంగ్స్, అవి కూడా బ్యాక్ గ్రౌండ్​ స్కోర్ మాదిరిగా వస్తాయని చెబుతున్నారు. ఏదిఏమైనా ఇది ప్రభాస్ ఫ్యాన్స్​కు కాస్త నిరాశ కలిగించే వార్త అనే చెప్పాలి. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి ఉండాల్సిందే.

ఇక ప్రమోషన్స్ విషయానికొస్తే.. కేజీయప్​ 2 టీజర్, ట్రైలర్​ రిలీజ్ సమయంలో భారీ స్థాయిలో హడావుడి చేసి ఫుల్ ప్రమోషన్స్​ చేశారు నిర్మాతలు. ఇంకా చెప్పాలంటే నేషనల్ మీడియా మొత్తాన్ని పిలిచారు. కానీ సలార్ టీజర్‌ను మాత్రం సైలంట్‌గా ఏం చప్పుడు చేయకుండా ఆన్ లైన్‌లోకి సింపుల్​గా వదిలేశారు. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు ఏ హడావుడి చేయలేదు. ఇప్పుడు సాంగ్స్ కూడా లేకుండా డైరెక్ట్​గా ట్రైలర్​ను రిలీజ్ చేస్తారట. సెప్టెంబర్ ఫస్ట్ వీక్​నుంచి ప్రమోషన్స్​ను షురూ చేస్తారట. చూడాలి మరి ఏ రేంజ్​లో చేస్తారో..

అసలే ప్రభాస్​ అభిమానులు ఈ సినిమాపైనే అంచనాలు పెట్టుకున్నారు. ఎందుకంటే బాహుబలి తర్వాత సాహో, రాధేశ్యామ్​, ఆదిపురుష్​ సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. దీంతో అందరూ సలార్​పైనే భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు. హోంబలే ఫిల్మ్​ నిర్మిస్తోంది.