Begin typing your search above and press return to search.

ప్రభాస్ తో సలార్ సవాళ్ళు.. అంతకుమించి

హై ఎక్స్ పెక్టేషన్స్ మధ్య ప్రేక్షకుల ముందుకి రాబోతున్న ఈ సినిమాపై డార్లింగ్ అభిమానులు చాలా హోప్స్ పెట్టుకున్నారు.

By:  Tupaki Desk   |   18 Dec 2023 9:14 AM GMT
ప్రభాస్ తో సలార్ సవాళ్ళు.. అంతకుమించి
X

డార్లింగ్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తోన్న మూవీ సలార్. ఈ సినిమా డిసెంబర్ 22న థియేటర్స్ లోకి వస్తోంది. హై ఎక్స్ పెక్టేషన్స్ మధ్య ప్రేక్షకుల ముందుకి రాబోతున్న ఈ సినిమాపై డార్లింగ్ అభిమానులు చాలా హోప్స్ పెట్టుకున్నారు. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ ఖాతాలో మరో వెయ్యి కోట్ల మూవీ పడలేదు.

సలార్ తో ఆ లోటు తీరిపోతుందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ పెద్దగా ప్రమోషన్స్ చేయలేదు. ప్రభాస్ బ్రాండ్ ఇమేజ్, తన ట్రేడ్ మార్క్ ని నమ్ముకొని స్ట్రాంగ్ కంటెంట్ తో సలార్ చేస్తున్నాడు. సినిమాలో దమ్ముంటే కలెక్షన్స్ ఆటోమేటిక్ గా వస్తాయని ప్రశాంత్ నీల్ నమ్ముతున్నాడు. అందుకే ప్రమోషన్స్ పై పెద్దగా ఫోకస్ చేయలేదు.

అయితే ప్రభాస్ ముందు ఈ ఏడాది హైయెస్ట్ ఓపెనింగ్ డే కలెక్షన్ రికార్డ్ లియో రూపంలో ఉంది. ఈ సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 135 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. జవాన్ మూవీ 129.6 కోట్లు అందుకుంది. రీసెంట్ గా రిలీజ్ అయినా యానిమల్ 119 కోట్ల గ్రాస్ ని టచ్ చేసింది. ఈ మూడు సినిమాలని బ్రేక్ చేసుకొని టాప్ చైర్ లోకి సలార్ రావాలని ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు.

మరి ఈ రికార్డ్ ని అందుకోవడం సాధ్యం అవుతుందా అనేది చెప్పలేని విషయం. ప్రభాస్ కి ఉన్న మాస్ ఇమేజ్ తో వంద కోట్ల గ్రాస్ ని అయితే అందుకునే ఛాన్స్ ఉంటుంది. గతంలో ప్రభాస్ నుంచి వచ్చిన సాహో, ఆదిపురుష్ వంద కోట్ల గ్రాస్ ని సునాయాసంగా అందుకున్నాయి. దీంతో సలార్ కి ఈ టార్గెట్ పెద్ద కష్టమైతే కాదు. కాని లియో మూవీ గ్రాస్ ని టచ్ చేయడం కష్టమనే మాట ట్రేడ్ పండితుల నుంచి వినిపిస్తోంది.

దీనికి కారణం నార్త్ ఇండియాలో సలార్ కి షారుఖ్ ఖాన్ డంకీ నుంచి గట్టి పోటీ ఎదురవుతుంది. ప్రభాస్ తో పోల్చుకుంటే షారుక్ కి నార్త్ లో ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. అంతర్జాతీయంగా చూసుకుంటే ఆక్వామెన్ 2 అదే డేట్ కి రిలీజ్ అవుతోంది. ఇంటర్నేషనల్ మార్కెట్ పై సలార్ తో పోల్చుకుంటే ఆక్వామెన్ 2కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ నేపథ్యంలో సలార్ ముందున్న టార్గెట్ ఈ సారి మాత్రం చాలా పెద్దదనే మాట వినిపిస్తోంది.