Begin typing your search above and press return to search.

సలార్ 2.. ఇది కిక్కిచ్చే లీక్!

By:  Tupaki Desk   |   4 March 2024 4:17 AM GMT
సలార్ 2.. ఇది కిక్కిచ్చే లీక్!
X

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ పార్ట్ 1 సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. మూవీకి సరైన ప్రమోషన్స్ చేయకపోవడం, డంకీ ఇంపాక్ట్ కారణంగా వెయ్యి కోట్ల మార్క్ కలెక్షన్స్ ని సలార్ అందుకోలేదు. ప్రపంచ వ్యాప్తంగా 730 కోట్ల వరకు ఈ మూవీ వసూళ్లు సాధించింది.

సలార్ కి సీక్వెల్ గా శౌర్యంగపర్వం రాబోతుందని క్లైమాక్స్ లో ప్రశాంత్ నీల్ కన్ఫర్మ్ చేశారు. అలాగే సలార్ పార్ట్ 1 లో చెప్పని చాలా ప్రశ్నలకి రెండో పార్ట్ లో సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రేక్షకులు కూడా శౌర్యంగపర్వం కోసం ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనేది ప్రశాంత్ నీల్ టీమ్ నుంచి ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు.

వచ్చే ఏడాది వేసవిలోపు సినిమా రిలీజ్ చేస్తామని నిర్మాత విజయ్ కిరంగదూర్ అయితే ప్రకటించారు. కానీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందనే దానిపై స్పష్టత రాలేదు. ఈ సినిమాలో ప్రభాస్ తర్వాత ఆ స్థాయిలో ప్రాధాన్యత ఉన్న పాత్రని చేసిన బాబీ సింహా పోషించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శౌర్యంగపర్వం గురించి ఆసక్తికర విషయాలని బాబీ సింహా రివీల్ చేశారు.

ఈ మూవీ షూటింగ్ ఏప్రిల్ లో మొదలయ్యే అవకాశం ఉందని తెలిపారు. మూవీ కోసం తాను కూడా ఎదురుచూస్తున్న అని చెప్పినట్లు తెలుస్తోంది. అంటే కల్కి రిలీజ్ లోపే సలార్ పార్ట్ 2 శౌర్యంగ పర్వం సెట్స్ పైకి వెళ్లనుందని దీనిని బట్టి తెలుస్తోంది. సలార్ 1 తో వెయ్యి కోట్ల మార్క్ ని డార్లింగ్ ప్రభాస్, ప్రశాంత్ అందుకోలేకపోయారు.

శౌర్యంగ పర్వంతో మాత్రం వెయ్యి కోట్ల మార్క్ ని బీట్ చేయడంతో పాటు కేజీఎఫ్ చాప్టర్ 2 కలెక్షన్స్ టార్గెట్ ని కూడా బ్రేక్ చేసే అవకాశం ఉందని సినీ వర్గాలలో వినిపిస్తోంది. పార్ట్ 2లో ప్రశాంత్ నీల్ చాలా కథని నేరేట్ చేయాల్సి ఉంది. ఇంటరెస్టింగ్ ఎలిమెంట్స్ అన్ని కూడా ఇందులోనే ఉంటాయని తెలుస్తోంది.