Begin typing your search above and press return to search.

సలార్ 2.. అసలు ఆట అప్పుడే..

డార్లింగ్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన సలార్ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే

By:  Tupaki Desk   |   3 Feb 2024 5:21 AM GMT
సలార్ 2.. అసలు ఆట అప్పుడే..
X

డార్లింగ్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన సలార్ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. హోంబలే ఫిలిమ్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ హైవోల్టేజ్ యాక్షన్ మూవీ అదే స్థాయిలో సిల్వర్ స్క్రీన్ దగ్గర కలెక్షన్స్ రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా 700 కోట్లకి పైగా వసూళ్ళని ఈ మూవీ సంపాదించింది. ఇక సలార్ కి సీక్వెల్ గా శౌర్యాంగ పర్వం ఉంటుందని క్లైమాక్స్ లో ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇచ్చాడు.

సలార్ పార్ట్ 1లో చూపించిన కథ ఇంకా సగం మాత్రమే. చాలా ప్రశ్నలకి సమాధానాలు చెప్పకుండా ప్రశాంత్ నీల్ వదిలేసాడు. వాటిని పార్ట్ 2లో చూపించాబోతున్నట్లు హిట్ ఇచ్చాడు. దీంతో సలార్ 2 మూవీ ఎప్పుడు వచ్చిన చూడటానికి ఫ్యాన్స్ నుంచి రెగ్యులర్ ఆడియన్స్ వరకు అందరూ ఎదురుచూస్తున్నారు. బాహుబలి2 తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన సాలిడ్ హిట్ సలార్ మూవీ.

ఇది కూడా సినిమాపై హైప్ క్రియేట్ కావడానికి ఒక కారణం అని చెప్పాలి. సలార్ 2 చిత్రాన్ని వచ్చే ఏడాది ఆరంభాలోనే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని ఇప్పటికే నిర్మాత క్లారిటీ ఇచ్చారు. అలాగే ఎన్టీఆర్ తో చేయాల్సిన ప్రాజెక్ట్ లేట్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో సలార్ 2 ఫినిష్ చేయడంపై ప్రశాంత్ నీల్ దృష్టి పెట్టారు. ఇప్పటికే సినిమా సగం షూటింగ్ కంప్లీట్ అయిపొయింది.

మిగిలిన పెండింగ్ షూట్ కూడా కంప్లీట్ చేయడానికి షెడ్యూల్ రెడీ చేసుకుంటున్నారంట. సమ్మర్ నుంచి ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఈ లోపు కల్కి మూవీ షూటింగ్ కంప్లీట్ అయిపోయి రిలీజ్ కి సిద్ధం అవుతుంది. మారుతితో చేస్తోన్న రాజాసాబ్ ఒక్కటే ఉంటుంది. సలార్, రాజాసాబ్ రెండు బ్యాక్ తూ బ్యాక్ షెడ్యూల్స్ తో పూర్తి చేయాలని ప్రభాస్ అనుకుంటున్నట్లు టాక్.

రాజాసాబ్ మూవీని డిసెంబర్ లో రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది. దాని తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో సెకండ్ వరల్డ్ వార్ నేపథ్యంలో తెరకెక్కబోయే ప్రేమకథా చిత్రాన్ని ప్రభాస్ స్టార్ట్ చేసే అవకాశం ఉంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ మూవీ కథ కూడా ఆల్ మోస్ట్ రెడీ అయిపోతుంది.