Begin typing your search above and press return to search.

హైద‌రాబాద్- ముంబైలో స‌లార్ భారీ ఈవెంట్లు?

మ‌రోవైపు డార్లింగ్ ప్ర‌భాస్ న‌టించిన 'స‌లార్' ట్రైల‌ర్ ఇటీవ‌లే విడుద‌లై యూట్యూబ్ లో సంచ‌ల‌నం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   3 Dec 2023 4:24 AM GMT
హైద‌రాబాద్- ముంబైలో స‌లార్ భారీ ఈవెంట్లు?
X

భార‌త‌దేశంలో ఇద్ద‌రు బిగ్గెస్ట్ సూప‌ర్ స్టార్ల న‌డుమ వార్ షురూ అయింది. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా ఘ‌ర్ష‌ణ‌కు సంబంధించిన కీల‌క స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ ఇరువురిలో ఒక‌రు విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ కాగా, మ‌రొక‌రు డార్లింగ్ ప్ర‌భాస్. ఈ ఇద్ద‌రిపైనా నువ్వా నేనా? అంటూ ఢీకొట్టే ఘ‌ర్ష‌ణ స‌న్నివేశాల్ని తెర‌కెక్కించేందుకు ప్రాజెక్ట్ కే డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ స‌న్నాహ‌కాల్లో ఉన్నార‌ని స‌మాచారం.

కెరీర్ లో అత్యంత కీల‌క‌మైన 'కల్కి 3898AD' (ప్రాజెక్ట్ కే) షూటింగులో పాల్గొనేందుకు ప్రభాస్ రెండు వారాల క్రితం ఇండియాకు తిరిగి వ‌చ్చార‌ని తెలిసింది. ఉలగనాయగన్ కమల్ హాసన్ ఈ చిత్రంలో విలన్‌గా న‌టిస్తుండ‌గా, అత‌డితో ప్ర‌భాస్ ఢీకొట్టే స‌న్నివేశాల్ని నాగ్ అశ్విన్ ప్లాన్ చేసార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. భార‌త‌దేశంలో అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌క‌మైన ప్రాజెక్ట్ గా క‌ల్కి గురించి ప్ర‌చారం ఉంది. ఫాంట‌సీ, సైన్స్ ఫిక్ష‌న్ నేప‌థ్యంలో ఇప్ప‌టివ‌ర‌కూ దేశంలో అత్యంత భారీ బ‌డ్జెట్ తో రూపొందుతున్న చిత్ర‌మిద‌ని కూడా వైజ‌యంతి మూవీస్ నుంచి సోర్సెస్ వెల్లడించాయి. ఈ చిత్రంలో దీపిక ప‌దుకొనే క‌థానాయిక‌గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. అమితాబ్ బ‌చ్చ‌న్ ఓ కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నారు.

'స‌లార్' ప్ర‌చారంలో స్పీడ్:

మ‌రోవైపు డార్లింగ్ ప్ర‌భాస్ న‌టించిన 'స‌లార్' ట్రైల‌ర్ ఇటీవ‌లే విడుద‌లై యూట్యూబ్ లో సంచ‌ల‌నం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఈ ట్రైల‌ర్ ను ఏడున్న‌ర కోట్ల మంది వీక్షించారు. వీక్ష‌ణ‌ల్లో ట్రైల‌ర్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. స‌లార్ ప్ర‌చారంలో మ‌రింత స్పీడ్ పెంచేందుకు ప్ర‌భాస్ కొన్ని ప్ర‌ణాళిక‌ల‌తో సిద్ధంగా ఉన్నాడ‌ని కూడా తెలిసింది. త‌దుప‌రి వారంలో ముంబై, హైదరాబాద్‌లలో భారీ ప్ర‌చార వేదిక‌ల‌పై ప్ర‌మోష‌న్ చేస్తార‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఈ రెండు ఈవెంట్ల‌తో స‌లార్ ప్ర‌చారం స్కై హైకి చేరుతుంద‌ని కూడా అంచ‌నా వేస్తున్నారు.

మారుతితో సెట్స్‌కి

మ‌రోవైపు ద‌ర్శ‌కుడు మారుతితో క‌లిసి ప్రభాస్ న‌టిస్తున్న ప్రాజెక్ట్ (రాజా డీల‌క్స్) పైనా స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. ప్రభాస్ ఇప్ప‌టికే మారుతికి డేట్స్ కేటాయించాడు. అత‌డితో కామెడీ థ్రిల్లర్ సెట్స్‌లో జాయిన్ అవుతాడని కూడా తెలిసింది. మోకాలి శస్త్రచికిత్స చేయించుకోవడానికి యూఎస్ వెళ్లిన ప్ర‌భాస్ చికిత్స అనంత‌రం హైద‌రాబాద్ కి రాగానే త‌న ద‌ర్శ‌క‌ నిర్మాత‌ల్లో ఉత్సాహం క‌నిపిస్తోంది. ప్ర‌భాస్ తిరిగి రావడంతో నిర్మాతలు సెట్స్‌పైకి వెళ్లాలని ఎదురుచూస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మారుతి ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తి చేసారు. ప్రభాస్ షూట్‌లో జాయిన్ అయిన తర్వాత వేగంగా పెండింగ్ చిత్రీక‌ర‌ణ‌ పూర్తి చేస్తార‌ని తెలిసింది.

ఈ సినిమాకు సంబంధించిన ప్రత్యేకత ఏంటంటే.. ఇంతవరకు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇందులో మాళవిక మోహనన్ కథానాయికగా నటిస్తోంది. రెండు ప్రెస్ మీట్‌లను హోస్ట్ చేస్తూ సాలార్‌ను ప్రమోట్ చేసాక హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ K ప్రస్తుత షెడ్యూల్‌ను ముగించి త‌దుప‌రి మారుతి సినిమా షూట్‌కు ప్ర‌భాస్ వెళ్లనున్నారని తెలిసింది.